News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

కర్రలపై ట్రోలింగ్స్ ఆపండి- వారి సూచనలతోనే ఆ చర్య - టీటీడీ క్లారిటీ!

టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గురువారం ఉదయం అలిపిరి నడక మార్గంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కుకున్నట్లు తెలిపారు.

FOLLOW US: 
Share:

తిరుమల తిరుపతిలో చిరుత నాలుగేళ్ల చిన్నారి లక్షితను చంపేసిన ఘటన తరువాత అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే నడక మార్గంలో వచ్చే భక్తులందరికీ అధికారులు చేతి కర్రలు ఇస్తున్నారు. దీని గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ నడుస్తుంది. 

దీని గురించి నూతనంగా నియమితమైన టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి స్పందించారు. మీడియాతో మాట్లాడారు. గురువారం ఉదయం అలిపిరి నడక మార్గంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కుకున్నట్లు తెలిపారు.

దీనిని మగ చిరుతగా గుర్తించామని వివరించారు. ఆ ప్రాంతాన్ని టీటీడీ అధికారులతో కలిసి టీటీడీ ఈవో, టీటీడీ ఛైర్మన్‌ భూమన పరిశీలించారు. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత 1:30 ప్రాంతంలో చిరుత బోనులో చిక్కిందని భూమన మీడియాతో తెలిపారు. భక్తుల భద్రతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన వివరించారు.

నడక దారిలో వారికి భద్రతను కల్పిస్తూనే చిరుతలను బంధించడానికి చర్యలు చేపట్టామని ఆయన వివరించారు. భక్తులకు కర్రలు ఇవ్వాలన్న అటవీ అధికారులు ఆదేశాలతోనే అందరి చేతికి కర్రలు ఇస్తున్నామని ఆయన వివరించారు. అంతేకానీ కేవలం కర్రలు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకుంటున్నారని సోషల్‌ మీడియాలో వస్తున్న దానిలో వాస్తవం లేదని ఆయన వివరించారు. 

ఇలాంటి నిందలు వేయడం సమంజసం కాదని ఆయన అన్నారు. ఇప్పటికీ ఆపరేషన్‌ చిరుతను కొనసాగిస్తున్నామని, మరికొన్ని చిరుతలను బంధించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నమని ఆయన వెల్లడించారు. ఆయన తరువాత మీడియాతో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి మాట్లాడారు. ఇప్పటికే చిరుతలను గుర్తించేందుకు అటవీ ప్రాంతంలో 300 కెమెరా ట్రాప్‌ లను ఏర్పాటు చేశామని తెలిపారు.

మరో 200 కెమెరా ట్రాప్‌ లను ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు. ఇందుకు శ్రీశైలం అటవీ ప్రాంతం నుంచి కొంతమంది ఎక్స్‌పర్ట్‌ నిపుణులను పిలిపిస్తున్నామని వివరించారు. డ్రోన్‌ టీం సైతం తిరుమలకు తీసుకుని వచ్చామన్నారు. పులులతోపాటు ఎలుగుబంట్లును కూడా పట్టుకోబోతున్నామని వివరించారు. కానీ వాటని బంధించేందుకు బోన్లు సరిపోవని, అలా కుదరదని ఆయన వివరించారు. 

వలలు వేయడం, ట్రాంకులైజ్ ద్వారా పట్టుకోగలంమన్నారు. టీటీడీ అధికారులు, అటవీశాఖ అధికారులు అహర్నిశలు శ్రమిస్తున్నారని, చిరుతలు ఎత్తైన మనుషులపైన , జంతువుల పై దాడి చేయద్దన్నారు. చిరుత కన్నాఎత్తైన ఏనుగులపై ఇప్పటి వరకు దాడి చేసిన సందర్భాలు లేదని, చిన్న పిల్లలను చూసినప్పుడు చిన్న జంతువు అనుకొని దాడులు చేస్తాయో కానీ, చేతిలో కర్ర పెట్టుకోవడం వల్ల మనిషి మరింత ఎత్తు కనపడే అవకాశం ఉందన్నారు. 

దీంతో చిరుత ఎత్తును చూసి భయపడి వెనక్కి వెళ్లిపోతుందని శాస్త్రీయంగా నిరూపితమైందన్నారు. కర్ర ఇవ్వడం చిన్న సహాయం మాత్రమేనని, వందమంది కర్రలతో ఉంటే చాలా బలం ఏర్పడుతుందన్నారు. చర్యలు చేపట్టినప్పుడు అభినందించాలి కానీ విమర్శలు చేసి మనోబలాన్ని తగ్గించడం సబబు కాదన్నారు. 

కొత్త సాంకేతికతతో బోనాల సైతం ఏర్పాటు చేస్తున్నామని, ట్రాప్‌ ల ద్వారా చిరుత కదలికలు నిరంతరం కొనసాగిస్తున్నామని, బయట నుంచి తీసుకు వచ్చిన చిరుతలను ఇక్కడ పెట్టి మాయ మాటలు చెప్తున్నామంటూ సోషల్‌ మీడియాలో వస్తున్న వాదనలు అవాస్తవమని ఆయన అన్నారు. చిరుతలు బోను చిక్కినప్పుడు సీసీ కెమెరాలలో రికార్డు అయిన వీడియో విజువల్స్‌ ను కూడా మీడియాకు విడుదల చేస్తామని వారు పేర్కొన్నారు.

Published at : 17 Aug 2023 02:32 PM (IST) Tags: TTD Chairman Bhumana Karunakar Reddy TTD EO Devotees cheetha sticks

ఇవి కూడా చూడండి

Breaking News Live Telugu Updates: నారా లోకేశ్ కు హైకోర్టులో ఊరట - ఫైబర్ గ్రిడ్, స్కిల్‌డెవలప్‌మెంట్ కేసుల్లో బెయిల్‌కు ప్రయత్నాలు

Breaking News Live Telugu Updates: నారా లోకేశ్ కు హైకోర్టులో ఊరట - ఫైబర్ గ్రిడ్, స్కిల్‌డెవలప్‌మెంట్ కేసుల్లో బెయిల్‌కు ప్రయత్నాలు

SSC Exams: పదోతరగతి పరీక్షల్లో 'కాంపోజిట్‌' పేపర్ కొనసాగింపు, రద్దుపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం

SSC Exams: పదోతరగతి పరీక్షల్లో 'కాంపోజిట్‌' పేపర్ కొనసాగింపు, రద్దుపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం

IIITDMK Admissions: ఐఐఐటీడీఎం కర్నూల్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు, ఈ అర్హతలుండాలి

IIITDMK Admissions: ఐఐఐటీడీఎం కర్నూల్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు, ఈ అర్హతలుండాలి

Top Headlines Today: టీడీపీని నడిపించేందుకు బ్రహ్మణి సిద్ధపడ్డారా? తెలంగాణలో బీజేపీ గాడిన పడుతుందా? టాప్ న్యూస్

Top Headlines Today: టీడీపీని నడిపించేందుకు బ్రహ్మణి సిద్ధపడ్డారా? తెలంగాణలో బీజేపీ గాడిన పడుతుందా? టాప్ న్యూస్

Chittoor: భవ్యశ్రీ హత్య కేసులో ఇంకా వీడని మిస్టరీ! విచారణలో నలుగురు, ఆ రిపోర్టు వస్తే ఓ కొలిక్కి!

Chittoor: భవ్యశ్రీ హత్య కేసులో ఇంకా వీడని మిస్టరీ! విచారణలో నలుగురు, ఆ రిపోర్టు వస్తే ఓ కొలిక్కి!

టాప్ స్టోరీస్

Narayana: భూమి వదులుకున్నోడిని, అవినీతి చేస్తానా? రాజకీయ కక్షలతోనే ఈ కేసులు - నారాయణ

Narayana: భూమి వదులుకున్నోడిని, అవినీతి చేస్తానా? రాజకీయ కక్షలతోనే ఈ కేసులు - నారాయణ

YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి,  కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్

YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి,  కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

తమిళనాడు కర్ణాటక మధ్య నిప్పు రాజేస్తున్న నీళ్లు, 150 ఏళ్లుగా కావేరి వాటాల వివాదం

తమిళనాడు కర్ణాటక మధ్య నిప్పు రాజేస్తున్న నీళ్లు, 150 ఏళ్లుగా కావేరి వాటాల వివాదం