అన్వేషించండి

BRS Meeting: ఓరుగల్లు నుంచే బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం- భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు

BRS Meeting: అక్టోబర్ 10వ తేదీన 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.  

BRS Meeting: బీఆర్ఎస్ అధికార యంత్రాంగం గెలుపే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేస్తోంది. వీలయినన్ని సభలు నిర్వహిస్తూ.. ముందుకెళ్తోంది. అక్టోబర్ 16వ తేదీన 10 లక్షల మందితో వరంగల్ జిల్లా భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సభ ఏర్పాట్లపై ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నేతలకు సీఎం కేసీఆర్ సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే ముందే ఇప్పటికే బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహాలు మొదలు పెట్టింది. పార్టీ నేతలు కేటీఆర్, కవిత, హరీష్ రావుతోపాటు ముఖ్య నేతలంతా తమ తమ ప్రాంతాల్లో ప్రజల్లోకి వెళ్లి జోరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్తూ... అక్టోబర్ 16వ తేదీన భారీ బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు సమాచారం. మలిదశ ఉద్యమం ప్రారంభం నుంచి కేసీఆర్ కు వరంగల్ బాగా అచ్చొచ్చింది. అందుకే ఇక్కడి నుంచే వచ్చే ఎన్నికల కోసం ప్రచార శంఖారావం పూరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. 

సహజంగా బీఆర్ఎస్ బహిరంగ సభ అంటేనే ప్రజలంతా తెగ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. జన సమీకరణ బహిరంగ సభ నిర్వహణ, ఏర్పాట్లు.. ఇలా అన్నింట్లోనూ ప్రత్యేకత ఉంటుంది. 150 ఎకరాల్లో బహిరంగ సభ, 200 ఎకరాల్లో పార్కింగ్ ఉండేలా వరంగల్ నగర శివారులోని దేవన్నపేట ప్రాంతాన్ని ప్రాథమికంగా గుర్తించినట్లు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏప్రిల్ లో ప్రకటించారు. ఈ మేరకే సభ ఏర్పాట్లు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ తొలి వారంలో వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రక్రియ ముందే అన్ని రకాలుగా ఎన్నికలకు సిద్ధమయ్యేలా బీఆర్ఎస్ అధిష్టానం ఏర్పాట్లు చేసుకుంటుంది. షెడ్యూల్ రాగానే భారీ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. 

వరంగల్ లో బీఆర్ఎస్ నిర్వహించిన సభలు ఇవే..!

2001 జూన్ 21వ తేదీ కాకతీయ డిగ్రీ కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. 2003 ఏప్రిల్ 26వ తేదీన సిద్దిపేట నుంచి వరంగల్ వరకు 100 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ తీశారు. 2003 ఏప్రిల్ 27వ తేదీన వరంగల్ జైత్రయాత్ర పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించగా... మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ, అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అజిత్ సింగ్ హాజరయ్యారు. 2005 జులై 17వ తేదీన వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించగా.. అప్పటి కేంద్రమంత్రి శరద్ పవార్ హాజరయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆరుగురు టీఆర్ఎస్ మంత్రులు రాజీనామా చేసిన తర్వాత నిర్వహించిన మొదటి సభ ఇదే. అలాగే 2007 ఏప్రిల్ 27వ తేదీన తెలంగాణ విశ్వరూప మహాసభ పేరుతో టీఆర్ఎస్‌లో ఆరో వార్షికోత్సవం నిర్వహించారు. 2009 నవంబర్ 23వ తేదీన కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల జేఏసీ బహిరంగ సభ నిర్వహించగా.. 14 విద్యార్థి సంఘాలతో సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో నినాదాన్ని ప్రకటించారు. 2010 డిసెంబర్ 16వ తేదీన తెలంగాణ మహా గర్జన పేరుతో నగరంలోని ప్రకాశ్ రెడ్డి పేటలో భారీ బహిరంగ సభ నిర్వహించగా.. స్వామి అగ్నివేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ బహిరంగ సభ ఉద్యమ చరిత్రలోనే అతిపెద్ద బహిరంగ సభగా రికార్డు సాధించింది. 2017 ఏప్రిల్ 27వ తేదీన నగరంలోని ప్రకాశ్ రెడ్డి పేటలో పది లక్షల మందితో ప్రగతి నివేదన సభ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
2025 Upcoming Hybrid Cars: 2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
2025 Upcoming Hybrid Cars: 2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Sandhya Theatre Incident: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి ప్రకటన
రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి ప్రకటన
BSNL Broadband Plan: బీఎస్ఎన్ఎల్ బెస్ట్ వైఫై ప్లాన్ - రోజుకు 200 జీబీ హైస్పీడ్ డేటా!
బీఎస్ఎన్ఎల్ బెస్ట్ వైఫై ప్లాన్ - రోజుకు 200 జీబీ హైస్పీడ్ డేటా!
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Embed widget