Cricketrs Wealth : క్రికెటర్లలో సంపన్నుడు కోహ్లీ, ధోనీ, సచిన్ కాదు - ఆయనెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !
Sports : క్రికెట్ సూపర్ స్టార్లు అయిన కోహ్లీ, ధోనీ, సచిన్ లకు వేల కోట్లు ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. వారి కంటే ధనవంతుడైన క్రికెటర్ ఉన్నారు.

This Cricketer Surpasses Sachin Tendulkar Virat Kohli in Wealth : విరాట్ కోహ్లీ ఒక్క ఏడాదిలోనే 66 కోట్ల రూపాయల పన్ను కట్టారని బయటకు తెలిసినప్పుడే ఆయన ఆస్తి వేల కోట్లలోనే ఉంటుందని అందరూ అంచనా వేశారు. సచిన్, ధోనీ వంటి వారి ఆస్తి కూడా అంతే ఉంటుంది. అయితే క్రికెటర్లలో వీరే అత్యంత ధనవంతులు కాదు. వీరందరి కన్నా అత్యధిక ఆస్తి పరుడైన మరో క్రికెటర్ ఉన్నాడు. అతని పేరు ఆర్యమన్ బిర్లా.
భారత్‌కు వచ్చే విదేశీ పెట్టుబడుల్లో సగం మహారాష్ట్రకే - తెలంగాణకూ పర్వాలేదు.. కానీ ఏపీకే !
బిర్లా అనే పేరు వినిపిస్తే ఎక్కువగా వ్యాపార రంగమే గుర్తుకు వస్తుంది. ఈ ఆర్యమన్ బిర్లా కూడా వ్యాపార రంగం నుంచే వచ్చినా ఆయన క్రికెట్ కెరీర్ ఎంచుకున్నారు. భారత వ్యాపార దిగ్గజాల్లో కుమార మంగళం బిర్లా ఒకరు. ఆయన కుమారుడే ఆర్యమన్ బిర్లా. క్రికెట్ కెరీర్ లో ఉన్నప్పటికీ కుటుంబ బిజినెస్‌లోనూ ఆయనకు ఇప్పుడు వాటాలొచ్చాయి. ఫలితంగా ఆర్యమన్ బిర్లా ఆస్తి ఇప్పుడు రూ. 70 వేల కోట్లు ఉంటుందని అంచనా. అంటే మరి ఏ ఇతర క్రికెటర్ దరిదాపుల్లోకి వచ్చేంత ఆస్తి ఉండదన్నమాట.
వరద నీళ్లలో కారు మునిగితే ఎంత ఇన్సూరెన్స్ వస్తుంది? ఎలా క్లెయిమ్ చేయాలి?
ఎంత ఆస్తి ఉన్నా ఆర్యమన్ బిర్లా కింది స్థాయి నుంచి క్రికెట్ ఆడుతూ వస్తున్నారు. ఆరేడేళ్ల కిందట ఆయన రంజీ ట్రోఫిలో మధ్యప్రదేశ్ తరపున ఆరంగేట్రం చేశారు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు అతని కోసం ముఫ్పై లక్షల రూపాయలు వెచ్చించింది. ఇప్పటి వరకూ ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో ఓ సెంచరీ కూడా చేశాడు బిర్లా. నిజానికి మంచి ఫామ్ లో ఉన్నప్పుడు కుటుంబవ్యక్తిగత కారణాల వల్ల రెండేళ్లు విరామం తీసుకోవడంతో కెరీర్ పరంగా వెనుకబడిపోయాడు.
#MadhyaPradesh batsman #AryamanBirla, who was part of the #RajasthanRoyals franchise till last year, has decided to take an 'undefined sabbatical' from cricket owing to anxiety related issues.
— IANS (@ians_india) December 21, 2019
Photo: IANS pic.twitter.com/ha3rus4l7j
అయితే ధోనీ, కోహ్లీ, సచిన్ వంటి వారి సంపద పూర్తిగా వారిసంపాదన. అదీ కూడా క్రికెట్ తో సంపాదించింది. కానీ క్రికెటర్ అయినప్పటికీ ఆర్యమన్ బిర్లా మాత్రం ఆయన ఆస్తిని కుటుంబపరంగా.. వారసత్వ రూపంలోనే పొందారు తప్ప.. సంపాదించినది కాదు. ఈ రకంగా చూస్తే.. ఆర్యమన్ బిర్లా గొప్పతనమేమీ లేదని చెప్పుకోవచ్చు.





















