అన్వేషించండి

Boat capsizes in Yamuna River: యమునానదిలో పడవ బోల్తా - పది మంది మృతి - పలువురు గల్లంతు!

Yamuna river: యమునా నదిలో పడవ గల్లంతు కావడంతో పది మంది చనిపోయారు. మరో పదిహేను మంది గల్లంతయ్యారు. ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది.

Boat capsized in the Yamuna river: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథురా జిల్లాలోని బృందావన్‌లో యమునా నదిపై శుక్రవారం ఘోర పడవ ప్రమాదం సంభవించింది. యాత్రికులతో వెళ్తున్న ఒక భారీ స్టీమర్ పడవ కేసీ ఘాట్ సమీపంలో నదిపై ఉన్న తాత్కాలిక వంతెనను  బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో సుమారు 10 మంది యాత్రికులు మృతి చెందగా, మరికొందరు గల్లంతైనట్లు సమాచారం.

 సామర్థ్యానికి మించి ప్రయాణికులు? 

ప్రమాదం జరిగిన సమయంలో పడవలో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్‌లోని ముక్త్‌సర్ ప్రాంతానికి చెందిన యాత్రికులు బృందావన దర్శనం కోసం వచ్చి ఈ ప్రమాదానికి గురయ్యారు. నదిలో ప్రవాహం ఉధృతంగా ఉండటం, దానికి తోడు సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతో పడవ నియంత్రణ తప్పి వంతెనను ఢీకొట్టినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పడవ బోల్తా పడగానే యాత్రికులు ఒక్కసారిగా నీటిలో పడిపోవడంతో అక్కడ ఆర్తనాదాలు మిన్నంటాయి.   

 కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

ప్రమాద వార్త తెలియగానే స్థానిక పోలీసులు, మత్స్యకారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించారు. ఇప్పటివరకు 15 మందిని సురక్షితంగా వెలికితీసి చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. గల్లంతైన వారి కోసం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ , ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. నదిలో గాలింపు చర్యలను వేగవంతం చేసేందుకు గజ ఈతగాళ్లను కూడా వినియోగిస్తున్నారు. ఇప్పటి వరకు ఎనిమిది మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు ధృవీకరించారు.                                   

 విషాదంలో మునిగిన ఘాట్లు 

ఈ ఘోర ప్రమాదంతో పవిత్ర బృందావన ఘాట్ల వద్ద విషాద ఛాయలు అలముకున్నాయి. గల్లంతైన వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఈ ఘటనపై స్పందిస్తూ, బాధితులకు తక్షణ సహాయం అందించాలని మరియు గాలింపు చర్యలను పర్యవేక్షించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. పడవ నడిపిన వ్యక్తి నిర్లక్ష్యంపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. గల్లంతైన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shreyas Iyer Toss Luck Streak: టాస్ లక్ లో ధోని, కోహ్లీ సరసన శ్రేయస్ .. వరుసగా ఐదోసారి అదృష్టం వరించినా దక్కని ఫస్ట్ విక్టరీ, ట్రెంట్ బ్రిడ్జ్ టీ20 లో టీమిండియాలో మార్పులు
టాస్ లక్ లో ధోని, కోహ్లీ సరసన శ్రేయస్ .. వరుసగా ఐదోసారి అదృష్టం వరించినా దక్కని ఫస్ట్ విక్టరీ, 3వ టీ20 లో టీమిండియాలో మార్పులు
Wayanad Landslide: వయనాడ్‌లో కొండ చరియల భీభత్సం.. భయం గొలుపుతున్న CCTV విజువల్స్  
వయనాడ్‌లో కొండ చరియల భీభత్సం.. భయం గొలుపుతున్న CCTV విజువల్స్  
Samson  Exclusion Strategy Twist: సంజూ శాంసన్ జింబాబ్వే టూర్ ఎగ్జిట్ వెనుక క్రేజీ ఇన్సైడ్ స్టోరీ.. ఆ వ్యూహంతోనే తనను..
సంజూ శాంసన్ జింబాబ్వే టూర్ ఎగ్జిట్ వెనుక క్రేజీ ఇన్సైడ్ స్టోరీ.. ఆ వ్యూహంతోనే తనను..
ABP Desam Top 10, 7 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 7 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Pawan Kalyan: అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Embed widget