Top Headlines Today: జగన్ సీఎం అయిన 6 రోజులకే పొన్నవోలుకు పదవి! రేవంత్ వ్యాఖ్యలపై మోహన్ భగవత్ కౌంటర్
AP Telangana Latest News 28 April 2024: నేటి ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో టాప్ హెడ్ లైన్స్ మీకోసం.. ఒక్క క్లిక్ చేసి 5 ప్రధాన వార్తలు చదవండి.
Andhra Pradesh News Today: చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తలపెట్టినట్టే- తాడిపత్రి సభలో సీఎం జగన్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును నమ్మడం అంటే.. పులి నోట్లో తలపెట్టినట్టేనని సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని ఆయన సూచించారు. ఆదివారం మధ్యాహ్నం తాడిపత్రిలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
జగన్ సీఎం అయిన 6 రోజులకే పొన్నవోలుకు పదవి, వైఎస్ పేరును ఇరికించినందుకే - షర్మిల
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, ఏపీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఏపీ న్యాయ యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్ షర్మిల.. ఇటీవల పొన్నవోలు సుధాకర్ ఇచ్చిన కౌంటర్ పై స్పందించారు. జగన్ ప్రమాణ స్వీకారం చేసిన 6 రోజులకే పొన్నవోలు సుధాకర్ రెడ్డికి పదవి వచ్చిందని గుర్తు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తిరుమలలో జయప్రద, ఏపీ ప్రస్తుత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు
సీనియర్ సినీ నటి జయప్రద ఏపీ రాజకీయాలపైన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె ఆదివారం (ఏప్రిల్ 28) తిరుమలకు వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ అధికారులు జయప్రదరకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం తర్వాత ఆలయ రంగనాయకుల మండపంలో జయప్రదకు వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు - రేవంత్ వ్యాఖ్యలపై మోహన్ భగవత్ కౌంటర్
దేశంలో అమలు చేస్తున్న రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా ఉందన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మోహన్ భగవత్ స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. కొంత మంది వ్యక్తులు ఆర్ఎస్ఎస్ పై స్వార్థంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. అసత్యం, అబద్ధం చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాన్ని కొందరు చేస్తున్నారని మోహన్ భగవత్ ఆక్షేపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
గుడివాడలో కొడాలి అభ్యర్థిత్వంపై ప్రతిష్టంభన! టీడీపీ ఫిర్యాదుతో టెన్షన్‌లో నాని
గుడివాడ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి కొడాలి నాని వేసిన నామినేషన్ విషయంలో ఇంకా ప్రతిష్ఠంభన కొనసాగుతూనే ఉంది. ఆయన వేసిన నామినేషన్ ప్రస్తుతానికి ఆమోదం పొందినపప్పటికీ ఎన్నికల సంఘం ఇంకా పూర్తి స్థాయి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. అందుకు కారణం కొడాలి నాని తన నామినేషన్ పూర్తి వివరాలను వెల్లడించలేదని అంటున్నారు. నాని సమర్పించిన నామినేషన్ డాక్యుమెంట్లలో తారె ప్రభుత్వ వసతిని ఉపయోగించుకోలేదని చెప్పుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి