అన్వేషించండి

Mohan Bhagwat: రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు - రేవంత్ వ్యాఖ్యలపై మోహన్ భగవత్ కౌంటర్ 

Mohan Bhagwat News: ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకమన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Mohan Bhagwat On Revanth Reddy Comments: దేశంలో అమలు చేస్తున్న రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా ఉందన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మోహన్ భగవత్ స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. కొంత మంది వ్యక్తులు ఆర్ఎస్ఎస్ పై స్వార్థంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. అసత్యం, అబద్ధం చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాన్ని కొందరు చేస్తున్నారని మోహన్ భగవత్ ఆక్షేపించారు. ఎవరి కోసం అయితే రిజర్వేషన్లు కేటాయించబడ్డాయో వారి అభివృద్ధి జరిగేంతవరకు రిజర్వేషన్లు ఉండాల్సిందేనని మోహన్ భగవత్ మరో మారు స్పష్టం చేశారు. రిజర్వేషన్ల అంశంపై వివాదాన్ని సృష్టించి లబ్ధి పొందేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని, దానితో తమకు సంబంధం లేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ పేర్కొన్నారు. రాజకీయ అవసరాల కోసం ఆర్ఎస్ఎస్ పై అనవసరమైన ఆరోపణలు చేయవద్దని ఈ సందర్భంగా మోహన్ భగవత్ సూచించారు. 

అసలు రేవంత్ రెడ్డి ఏమన్నారంటే

ఆర్ఎస్ఎస్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలోనే మోహన్ భగవత్ స్పందించారు. ఈ నేపథ్యంలో అసలు ఆర్ఎస్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి ఏం వ్యాఖ్యలు చేశారన్న ఆసక్తి సర్వత్ర నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని, మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయడానికి బిజెపి ప్రయత్నిస్తోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. రిజర్వేషన్ల రహిత దేశంగా భారత్ ను ప్రకటించడానికి బీజేపీ 400 సీట్లు కోరుతోందని రేవంత్ విమర్శించారు. ఇందుకు ఆర్ఎస్ఎస్ కు బలమైన కారణాలు ఉన్నాయన్నారు.

హిందువుల్లో కులాలు, ఉప కులాలు ఉంటే హిందువులు అంతా ఏకంగా ఉన్నారని చూపించడానికి ఇబ్బంది వస్తుంది కాబట్టే, రిజర్వేషన్లు రద్దు చేసి ఈ మొత్తాన్ని హిందూ సమాజంగా చూపించడానికి ఆర్ఎస్ఎస్ ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రణాళికలను బిజెపి అమలు చేస్తోందని, ఇందులో భాగంగానే త్రిపుల్ తలాక్ రద్దు, 370 ఆర్టికల్ రద్దు, యూనిఫాం సివిల్ కోడ్ వంటి అనేక నిర్ణయాలను బిజెపి తీసుకుంటోందన్నారు.   ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానాలను బిజెపి అమలు చేస్తోందన్న రేవంత్.. బిజెపి వచ్చినా, రాకపోయినా రాజ్యాంగాన్ని సమూల మార్పులకు ఆలోచన చేస్తున్నారని విమర్శించారు. అందులో భాగంగానే రిజర్వేషన్ల రద్దుకు కుట్ర జరుగుతోందని,  తద్వారా దళితులు, గిరిజనులు, బీసీలు, ఓబీసీలను శాశ్వతంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపైనే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవాన్ స్పందించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Supreme Court : వక్ఫ్‌ చట్టంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు- 2 వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశం 
Supreme Court : వక్ఫ్‌ చట్టంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు- 2 వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశం 
Kancha Gachibowli Land Case: కొందరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది, కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
కొందరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది, కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
Kavitha Lokesh Politics:  లోకేష్ బాటలోనే  కవిత రాజకీయాలు  - పాదయాత్ర కూడా చేస్తారా ?
లోకేష్ బాటలోనే కవిత రాజకీయాలు - పాదయాత్ర కూడా చేస్తారా ?
AP DSC Notification: అభ్యర్థులకు గుడ్‌న్యూస్, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
అభ్యర్థులకు గుడ్‌న్యూస్, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Preity Zinta Celebrations | PBKS vs KKR మ్యాచ్ లో ప్రీతి జింతా సెలబ్రేషన్స్ వైరల్Narine Bat Inspection vs PBKS IPL 2025 | పంజాబ్ మ్యాచ్ లో నరైన్ కి షాక్ ఇచ్చిన అంపైర్లుPBKS vs KKR Match Chahal Bowling | IPL 2025 లో సంచలన బౌలింగ్ తో పంజాబ్ కు సెన్సేషనల్ విక్టరీPBKS Highest lowest IPL 2025 | వరుస మ్యాచుల్లో రెండు వేరియేషన్స్ చూపించిన పంజాబ్ కింగ్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court : వక్ఫ్‌ చట్టంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు- 2 వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశం 
Supreme Court : వక్ఫ్‌ చట్టంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు- 2 వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశం 
Kancha Gachibowli Land Case: కొందరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది, కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
కొందరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది, కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
Kavitha Lokesh Politics:  లోకేష్ బాటలోనే  కవిత రాజకీయాలు  - పాదయాత్ర కూడా చేస్తారా ?
లోకేష్ బాటలోనే కవిత రాజకీయాలు - పాదయాత్ర కూడా చేస్తారా ?
AP DSC Notification: అభ్యర్థులకు గుడ్‌న్యూస్, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
అభ్యర్థులకు గుడ్‌న్యూస్, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
Akshaya Tritiya 2025 Date : అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం కన్నా పిచ్చితనం మరొకటి లేదా!
అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం కన్నా పిచ్చితనం మరొకటి లేదా!
Next Chief Justice: భారత తదుపరి చీఫ్ జస్టిస్‌గా బీఆర్ గవాయ్ - సిఫారసు చేసిన కొలీజియం
భారత తదుపరి చీఫ్ జస్టిస్‌గా బీఆర్ గవాయ్ - సిఫారసు చేసిన కొలీజియం
Samantha: సమంతతో అంత వీజీ కాదు... కొత్త రూల్‌తో కోట్లాది రూపాయలు లాస్... ఆ ముగ్గురూ 'నో' అంటే ఇక అంతే!
సమంతతో అంత వీజీ కాదు... కొత్త రూల్‌తో కోట్లాది రూపాయలు లాస్... ఆ ముగ్గురూ 'నో' అంటే ఇక అంతే!
KTR on HCU Lands: కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన కేటీఆర్, నెంబర్ 1 విలన్ రేవంత్ అని ట్వీట్
కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన కేటీఆర్, నెంబర్ 1 విలన్ రేవంత్ అని ట్వీట్
Embed widget