Top Headlines Today: బీఫాంలు ఇచ్చి దిశానిర్దేశం చేసిన పవన్ కల్యాణ్! తాగునీళ్లయినా ఇవ్వాలని ప్రభుత్వానికి హరీష్ రావు విజ్ఞప్తి
AP Telangana Latest News 17 April 2024: నేటి ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ హెడ్ లైన్స్ మీకోసం.. ఒక్క క్లిక్ చేసి 5 ప్రధాన వార్తలు చదవండి.
మనమేం చేస్తామో ప్రజలకు చెప్పండి - అభ్యర్థులకు బీఫాంలు ఇచ్చి దిశానిర్దేశం చేసిన పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్‌లో గురువారం నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ తమ అభ్యర్థులకు బీఫాంలు అందించారు. మొదటి బీఫాంను తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కు అందించారు. తనతో సహా 20 మంది ఎమ్మెల్యే, ఇద్దరు ఎంపీ అభ్యర్థులకు బి ఫారాలను పవన్ ఇచ్చారు. పాలకొండ నుంచి జయకృష్ణ వ్యక్తిగత కారణాలతో రాలేకపోయారు.ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలుండగా టీడీపీ, జనసేన, బీజేపీలతో కుదుర్చుకున్న పొత్తుల కారణంగా 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలకు జనసేన పోటీ చేస్తుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ప్రత్యక్ష రాజకీయాల్లోకి నారా భువనేశ్వరి ఎంట్రీ ? ఆ కోణంలోనే యాత్రలు చేస్తున్నారా?
నారా భువనేశ్వరి అంటే.. ఎన్టీఆర్ కుమార్తె కంటే చంద్రబాబునాయుడు సతీమణిగానే ఎక్కువ పరిచయం. దశాబ్దాల పాటు అందరికీ తెలిసినప్పటికీ ఆమె బహిరంగంగా మాట్లాడింది చాలా తక్కువ. చంద్రబాబు రాజకీయాల్లో ఉంటే... భువనేశ్వరి హెరిటేజ్ కంపెనీని వృద్ధిలోకి తీసుకు వచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ బాధ్యతలు చూసుకున్నారు. అంతే కానీ ఎప్పుడూ రాజకీయాల జోలికి రాలేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
సాగునీరు కాదు కనీసం తాగునీళ్లయినా ఇవ్వండి - ప్రభుత్వానికి హరీష్ రావు విజ్ఞప్తి
తెలంగాణలో తాగునీరు సమస్యగా మారిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. తాగునీటి కోసం పలు ప్రాంతాల్లో ప్రజలు అల్లాడిపోతున్నారని, దీంతో కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో తాగునీటి సమస్యపై మాజీ మంత్రి హరీష్ రావు ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని తన ట్వీట్‌కు హరీష్ రావు జత చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
బొండా ఉమపై తప్పుడు కేసులకు కుట్ర - పోలీసులకు చంద్రబాబు వార్నింగ్
జగన్ పై జరిగిన రాయి దాడి కేసులో టీడీపీ నేతల్ని ఇరికించేందుకు పోలీసు అధికారులు కుట్రలు పన్నుతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ప్రజల్లో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న కొద్దీ అధికార పార్టీ కుట్రలను మరింత పెంచుతోందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని.. సీఎంపై రాయి దాడి విషయంలో తప్పుడు ప్రచారాలు, సింపతీ డ్రామాలతో వైఎస్సార్‌సీపీ అభాసుపాలయ్యిందన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
రైతులే టార్గెట్‌గా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎన్నికల వ్యూహాలు
తెలంగాణలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల ఎజెండా విచిత్రంగా ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎజెండా అంతా జాతీయ రాజకీయాలపైన నడుస్తోంది. మోదీ మరోమారు ప్రధాని అని బీజేపీ, బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని రద్ద చేస్తారు లేదా మార్చేస్తారంటూ కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేపడుతోంది. ఆయా రాష్ట్రాల్లో కూడా ఎన్డీయే, ఇండియా కూటమి పార్టీలు జాతీయ రాజకీయ అంశాలే ప్రాధాన్యతా అంశాలుగా ప్రచారం చేస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి