అన్వేషించండి

Janasena News : మనమేం చేస్తామో ప్రజలకు చెప్పండి - అభ్యర్థులకు బీఫాంలు ఇచ్చి దిశానిర్దేశం చేసిన పవన్ కల్యాణ్

Andhra News : జనసేన అభ్యర్థులకు పవన్ కల్యాణ్ బీఫాంలు ఇచ్చారు. ప్రజలు ఏం చేస్తామో చెప్పేందుకు విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.

Pawan Kalyan gave B forms to Janasena candidates :  ఆంధ్రప్రదేశ్‌లో గురువారం నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ తమ అభ్యర్థులకు బీఫాంలు అందించారు. మొదటి బీఫాంను తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కు అందించారు. తనతో సహా 20 మంది ఎమ్మెల్యే, ఇద్దరు ఎంపీ అభ్యర్థులకు బి ఫారాలను పవన్ ఇచ్చారు. పాలకొండ నుంచి జయకృష్ణ వ్యక్తిగత కారణాలతో రాలేకపోయారు.ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్‌ స్థానాలుండగా టీడీపీ, జనసేన, బీజేపీలతో కుదుర్చుకున్న పొత్తుల కారణంగా 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్‌ స్థానాలకు జనసేన పోటీ చేస్తుంది . ఈ సందర్భంగా ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించిన పవన్‌కల్యాణ్ ‌(Pawankalyan) పండుగ రోజున బీ ఫారాలు అందజేసి దిశానిర్దేశం చేశారు.                                                                            

2019 ఎన్నికల తర్వాత రాష్ట్రం ఇబ్బందులు ఎదుర్కొందని ఆయన తెలిపారు. ఓట్లు చీలకుండా ఎన్డీఏ కూటమిగా ఏర్పడ్డామని.. ఎలాగైనా రాక్షస పాలనను అంతమొందించాలన్నారు. ఏపీని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేయాలని నేతలకు సూచించారు. శ్రీరామ నవమి రోజు బీ-ఫారాలు అందివ్వడం సంతోషంగా ఉందన్న ఆయన.. రామరాజ్యం వైపు రాష్ట్రాన్ని అడుగులు వేయించాలన్నారు. అనంతరం అభ్యర్థులతో పవన్‌ కళ్యాణ్ ప్రతిజ్ఞ చేయించారు.                           

పవన్ అభ్యర్థులతో చేయించిన ప్రతిజ్ఞ : 

మూడు కాలాల ప్రకృతి ఆశీస్సులతో, తరగని సహజ వనరులతో, సుదీర్ఘ సాగరతీరంతో సకల సంపదలకు నెలవైనది ఆంధ్రప్రదేశ్‌. అప్పుల ఆర్థిక విధానాలు, తప్పుడు పరిపాలన వల్ల ఇప్పుడు మనకీ తిప్పలు తప్పడం లేదు. అయిదేళ్ల పాలనలో రాష్ట్రం అదోగతి పాలయింది. మనమంతా కలిసికట్టుగా నడుం బిగించి, మళ్లీ మన అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు కనుక వారికి జవాబుదారుగా ఉంటూ పారదర్శక పాలనను అందించాల్సిన కర్తవ్యం రాజకీయ వ్యవస్థది. తెలుగు వారి జీవన రేఖ పోలవరం పూర్తి, నదుల అనుసంధానం, సామాజిక న్యాయం, యువతకు విద్య`ఉద్యోగావకాశాలు, మహిళలకు సముచిత స్థానం, జనం మెచ్చే రాజధాని, ప్రజలకు నచ్చే ప్రభుత్వమే పాలనకు గీటురాయి కావాలి. మన లక్ష్యమైన ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు అందించడం ద్వారా… వలసలు, పస్తులు లేని వికసిత ఆంధ్రప్రదేశ్‌ ఆవిష్కరణకు భూమిక సిద్దం చేయడమే మనందరి ఉమ్మడి బాధ్యత. ఇందుకోసం వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీలతో కూడిన ఎన్డీయే కూటమి గెలుపే కర్తవ్యంగా కృషిచేస్తానని, మన పార్టీ నియమ`నిబంధనలకు కట్టుబడుతూ, కూటమి అభ్యర్థిగా పైన తెలిపిన ప్రతిమాటకు కట్టుబడి ఉంటానని భారత రాజ్యాంగం సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana TET Exam Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Nellore Alert : నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
Poco M7 Pro 5G: పోకో ఎం7 ప్రో 5జీ వచ్చేసింది - బడ్జెట్ ధరలో మంచి ఫోన్!
పోకో ఎం7 ప్రో 5జీ వచ్చేసింది - బడ్జెట్ ధరలో మంచి ఫోన్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారుఎడతెరపి లేకుండా వర్షం, డ్రాగా ముగిసిన గబ్బా టెస్ట్అలిగిన అశ్విన్, అందుకే వెళ్లిపోయాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana TET Exam Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Nellore Alert : నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
Poco M7 Pro 5G: పోకో ఎం7 ప్రో 5జీ వచ్చేసింది - బడ్జెట్ ధరలో మంచి ఫోన్!
పోకో ఎం7 ప్రో 5జీ వచ్చేసింది - బడ్జెట్ ధరలో మంచి ఫోన్!
Ravichandran Ashwin: అశ్విన్... స్పిన్ కింగ్, క్రికెట్ పిచ్ పై చెరగని సంతకం రవిచంద్రన్
అశ్విన్... స్పిన్ కింగ్, క్రికెట్ పిచ్ పై చెరగని సంతకం రవిచంద్రన్
Thandel Second Single: కాశీలో... శివుడి సన్నిధిలో 'తండేల్' సెకండ్ సాంగ్ రిలీజ్... 'శివ శక్తి'లో చైతన్య - సాయి పల్లవిని చూశారా?
కాశీలో... శివుడి సన్నిధిలో 'తండేల్' సెకండ్ సాంగ్ రిలీజ్... 'శివ శక్తి'లో చైతన్య - సాయి పల్లవిని చూశారా?
Telangana Congress Protest : తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
Are Kapu Community Leaders Suffocating In YSRCP: జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
Embed widget