TS CM Revanth Reddy Oath ceremony Live Updates : తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి - 6 గ్యారెంటీలపై తొలి సంతకం, దివ్యాంగురాలికి ఉద్యోగం
Revanth Reddy oath ceremony : తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ అప్‌డేట్స్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఇతర అప్‌డేట్స్ కోసం ఈ పేజ్‌ను రీఫ్రెష్ చేయండి
LIVE

Background
సీఎంగా రేవంత్ తొలి సంతకం - దివ్యాంగురాలికి ఉద్యోగం
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన 6 గ్యారంటీలపై తొలి సంతకం చేశారు. అనంతరం దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగ నియామక పత్రంపై రెండో సంతకం చేసి ఆమెకు నియామక పత్రం అందించారు.
రేపు ఉదయం ప్రజాభవన్ లో ప్రజాదర్బార్: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో రేపు ఉదయం 10 గంటలకు ప్రజా భవన్ లో ప్రజా దర్బార్ నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో ప్రజలందరికీ ఆహ్వానం పలికారు. ప్రజలు ఎప్పుడైనా ప్రజాభవన్ కు రావొచ్చని, ఈ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములని స్పష్టం చేశారు. ప్రజా భవన్ వద్ద కంచెలు తొలగించినట్లు చెప్పారు.
పదేళ్ల బాధలను ప్రజలు మౌనంగా భరించారు: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో పదేళ్ల బాధలను ప్రజలు మౌనంగా భరించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో అమరవీరుల ఆకాంక్షలను నెరవేరుస్తామని చెప్పారు.
'జై సోనియమ్మ' అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం
'జై సోనియమ్మ' అంటూ సీఎం రేవంత్ రెడ్డి తన తొలి ప్రసంగం ప్రారంభించారు. ఎన్నో త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. దశాబ్ద కాలంగా తెలంగాణలో మానవ హక్కులకు భంగం కలిగిందని అన్నారు. ఇందిరమ్మ రాజ్య ఏర్పాటుతో తెలంగాణ నలుమూలలా సమాన అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పీఎం మోదీ అభినందనలు
తెలంగాణ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

