Land-For-Job Case: తేజస్వీ యాదవ్ సతీమణికి అనారోగ్యం, సీబీఐ విచారణకు హాజరు కాలేనని వెల్లడి
Land-For-Job Case: తేజస్వీ యాదవ్ సీబీఐ విచారణకు హాజరు కాలేదు.
Land-For-Job Case:
ఆసుపత్రిలో చికిత్స..
బిహార్ డిప్యుటీ సీఎం తేజస్వీ యాదవ్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే...తేజస్వీ యాదవ్ మాత్రం విచారణకు హాజరు కాలేదు. ఆయన భార్య ఆసుపత్రిలో ఉన్నారు. పైగా ఆమె గర్భవతి కూడా. ఈ కారణంగానే ఆయన విచారణకు హాజరు కావడం కుదరడం లేదని సీబీఐకి తేజస్వీ యాదవ్ చెప్పినట్టు ANI రిపోర్ట్ చేసింది. 12 గంటల పాటు సీబీఐ అధికారులు విచారించిన కారణంగా ఆయన భార్య కళ్లు తిరిగి పడిపోయారని, ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించింది.
"బిహార్ డిప్యుటీ సీఎం తేజస్వీ యాదవ్ సీబీఐ విచారణకు హాజరు కావడం లేదు. ఆయన భార్య ఆసుపత్రి పాలయ్యారు. ఈడీ సోదాలు ముగిసిన తరవాత ఆమె ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోయారు. లో బీపీ కారణంగా అస్వస్థకు గురయ్యారు. అధికారులు 12 గంటల పాటు విచారించారు"
-ANI
Bihar Deputy CM Tejashwi Yadav likely to skip CBI summons today in land-for-jobs case
— ANI Digital (@ani_digital) March 11, 2023
Read @ANI Story | https://t.co/6qiZV1G1bq#TejashwiYadav #EDSummon #landjobscam #CBI #Bihar pic.twitter.com/qhLjVoa4hw
#UPDATE | Bihar Dy CM & RJD leader Tejashwi Yadav won't appear before CBI due to his wife's health. After the ED raid, she was hospitalised yesterday at a private hospital in Delhi. She is pregnant and after twelve hours of interrogation she fainted due to BP problems: Sources
— ANI (@ANI) March 11, 2023
ఇదే కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీ దేవిని కూడా అధికారులు విచారించారు. ఇప్పటికే ఫిబ్రవరి 4వ తేదీన తేజస్వీ యాదవ్‌కు సమన్లు జారీ చేసిన సీబీఐ ఇప్పుడు మరోసారి ఆయనకు నోటీసులు పంపింది. అయితే మొదటి సారి సమన్లు పంపినప్పుడు ఆయన హాజరు కాలేదు. లాలూని రెండు గంటల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ విచారణ మొత్తాన్ని వీడియో తీసింది ఈడీ. ఇప్పటికే సీబీఐ ఈ కేసుకు సంబంధించి ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవితో పాటు మొత్తం 14 మంది పేర్లు చేర్చింది. లాలూ హయాంలో ఈ స్కామ్ జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. గ్రూప్ డి ఉద్యోగాలు ఇచ్చేందుకు పలు చోట్ల స్థలాలను లంచంగా తీసుకున్నట్టు చెబుతోంది ఈడీ. 2004-09 మధ్య కాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలోనే ఈ స్కామ్ జరిగినట్టు ED అధికారులు ఆరోపిస్తున్నారు. ముంబయి, జబల్‌పూర్, కోల్‌కత్తా, జైపూర్, హాజిపూర్‌లలో పలువురికి గ్రూప్ D పోస్ట్‌లు ఇచ్చారని, అందుకు బదులుగా తమ పేరు మీద స్థలాలు రాయించుకున్నారని చెబుతున్నారు. AK Infosystems Private Limited పేరు మీద కూడా స్థలాలు రాయించారని ED వివరిస్తోంది. ఆ తరవాత ఈ కంపెనీ ఓనర్‌షిప్‌ను లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యుల పేరుపై మార్చారన్న ఆరోపణలున్నాయి.
Also Read: Mohit Joshi: ఇన్‌ఫోసిస్ అధ్యక్షుడు మోహిత్ జోషి రాజీనామా, 20 ఏళ్ల ప్రయాణానికి ఫుల్‌స్టాప్