By: Ram Manohar | Updated at : 15 Jul 2022 06:32 PM (IST)
తమిళనాడులోని పెరియార్ యూనివర్సిటీలో హిస్టరీ ఎగ్జామ్‌లో అడిగిన ప్రశ్న వివాదాస్పదమవుతోంది.
మాకు ముందుగా తెలియలేదు: యూనివర్సిటీ వీసీ
తమిళనాడులోని పెరియార్ యూనివర్సిటీలో ఓ క్వశ్చన్ పేపర్ వివాదాస్పదమైంది. అందులో క్యాస్ట్‌కి సంబంధించిన ప్రశ్న అడగటంపై
తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఎమ్‌ఏ హిస్టరీ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో ఈ ప్రశ్న అడిగారు. "తమిళనాడులో ఎక్కువగా కనిపించే లోయర్ క్యాస్ట్ ఏంటి" అనే క్వశ్చన్ అందులో ఉంది. పైగా ఇదో మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ కావటం వల్ల నాలుగు ఆప్షన్స్‌లో నాలుగు క్యాస్ట్‌ల పేర్లు ముద్రించారు. యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ జగన్నాథన్...ఈ వివాదంపై స్పందించారు. ఇది ఎవరు చేశారో తప్పకుండా విచారణ జరుపుతామని వెల్లడించారు. హిస్టరీ మాస్టర్స్‌లో సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్‌లో ఈ క్వశ్చన్ అడిగారు. తమిళనాడు స్వాతంత్య్రోద్యమం( 1800-1947) అనే సబ్జెక్ట్‌లో ఈ ప్రశ్న వచ్చినట్టు వీసీ తెలిపారు. ఇది తాము తయారు చేసిన క్వశ్చన్ పేపర్ కాదని, వేరే యూనివర్సిటీ రూపొందించిందని చెప్పారు. ముందే ఈ విషయం దృష్టికి వచ్చుంటే ఈ తప్పిదం జరగకుండా చూసే వాడినని అన్నారు.
Tamil Nadu | 1st-year MA History students of Periyar University in Salem got asked in the exam, "Which one is the lower caste that belongs to Tamil Nadu?" with 4 options mentioning different castes pic.twitter.com/kdJxQrMo5R
— ANI (@ANI) July 15, 2022
క్వశ్చన్ పేపర్ మేం తయారు చేయలేదు: వీసీ
"ఈ క్వశ్చన్ పేపర్ మేము తయారు చేయలేదు. ఎగ్జామ్ పేపర్స్ లీక్ అయ్యే అవకాశముందని, ముందుగా మేం ఆ పేపర్‌ను చదవం. ఈ వివాదాస్పద ప్రశ్నకు సంబంధించిన నాకెలాంటి సమాచారం అందలేదు. విచారణ జరిపి తీరుతాం" అని వీసీ జగన్నాథన్ స్పష్టం చేశారు.
Question papers are not prepared by us. Other University & college lecturers prepare the paper. Usually, to avoid a question paper leak, we don't read the papers before the exam. We will investigate this & consider reexamination: R Jagannathan, Vice-Chancellor, Periyar University
— ANI (@ANI) July 15, 2022
Also Read: Vizianagaram Crime : ప్రియుడి మోజులో భర్తను హత్య చేసిన భార్య, మర్డర్ చేసి యాక్సిడెంట్ గా నాటకం!
Pawan Kalyan: పదవులపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు, 2009లోనే ఎంపీ అయ్యేవాడినన్న జనసేనాని
Khammam News : తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు దారుణ హత్య, ఆటోతో ఢీకొట్టి వేటకొడవళ్లతో నరికి!
వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - చాట్ పక్కకు స్వైప్ చేస్తే!
Jagadish Reddy: కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఇవే చివరి ఎలక్షన్స్, ఈడీ బోడీలు ఏం చేయలేవు - మంత్రి జగదీశ్ వ్యాఖ్యలు
Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత, పరస్ఫరం రాళ్లదాడులు - పోలీసులపై బండి ఆగ్రహం
Karthikeya 2 Collections : రెండవ రోజు పెరిగిన 'కార్తికేయ 2' కలెక్షన్లు - మూడో రోజు లాభాల్లోకి?
TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం
Popcorn Price In Multiplex: మల్టీప్లెక్స్‌ల్లో పాప్‌కార్న్ కాస్ట్ ఎందుకంత ఎక్కువ? పీవీఆర్ ఛైర్మన్ ఏమన్నారంటే?
Jagan Independence Day: 75 ఏళ్ల విజయ ప్రస్థానం మరపురానిది: ఏపీ సీఎం జగన్