అన్వేషించండి

CM Vijay: సీఎం విజయ్ సంచలనం - మేనమామ పథకం ప్రకటన - ఇక పుట్టిన ప్రతి బిడ్డకూ 1 గ్రాము బంగారు ఉంగరం

New born Baby Gift: తమిళనాడు సీఎం విజయ్ మేనమేమ బంగారు ఉంగరం పథకం ప్రకటించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టే ప్రతి బిడ్డకు గ్రాము బంగారు ఉంగరం ఇస్తారు.

CM Vijay Free Gold Ring Scheme:  తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనాలకు తెరలేపిన నటుడు, ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం.. ప్రజల్లోకి దూసుకెళ్లేలా ఒక వినూత్న ప్రజాకర్షక పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించే ప్రతి బిడ్డకు ఉచితంగా ఒక గ్రాము బంగారు ఉంగరాన్ని బహూకరించేలా   మేనమామ బంగారు ఉంగరం పథకం అనే ప్రతిష్టాత్మక పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. తమిళ సంస్కృతిని, సంప్రదాయాలను మేళవించి సీఎం విజయ్ తీసుకొచ్చిన ఈ సరికొత్త సెంటిమెంట్ పథకం  హాట్ టాపిక్‌గా మారింది. 

తమిళ సాంప్రదాయం ప్రకారం.. కుటుంబంలో ఒక బిడ్డ జన్మించినప్పుడు ఆ శిశువుకు మేనమామ   మొదటిసారిగా బంగారు ఉంగరాన్ని బహుమతిగా తొడగడం అత్యంత పవిత్రమైన ఆచారంగా భావిస్తారు. అయితే, పేదరికంలో ఉన్న ఎంతోమంది మేనమామలు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ ముచ్చట తీర్చుకోలేకపోతున్నారు. ఈ సెంటిమెంట్‌ను, సామాన్యుల భావోద్వేగాలను గుర్తించిన ముఖ్యమంత్రి విజయ్.. పేద కుటుంబాలకు తానే  మేనమామ  స్థానంలో నిలబడతానని ప్రకటించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పుట్టే ప్రతి బిడ్డకూ మేనమామ స్థానంలో ప్రభుత్వమే ఈ ఒక గ్రాము బంగారు ఉంగరాన్ని బహుమతిగా అందిస్తుందని స్పష్టం చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే అధికారిక ఉత్తర్వులను   విడుదల చేసింది.

తమిళనాడు వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు  , పురపాలక క్లినిక్‌లలో ప్రసవించే తల్లులందరికీ ఈ పథకం వర్తిస్తుందని తమిళ మీడియా వర్గాలు వెల్లడించాయి. ప్రసవం ముగిసిన వెంటనే ఆసుపత్రి యంత్రాంగం ద్వారానే ఈ ఉంగరాన్ని తల్లిదండ్రులకు అందజేసేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వినూత్న పథకం కేవలం సెంటిమెంట్‌ కోసమే కాకుండా.. గ్రామీణ ప్రాంతాల్లో వంద శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే  జరిగేలా ప్రోత్సహించడానికి మరియు తల్లీపిల్లల మరణాల రేటును తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆరోగ్య శాఖ నిపుణులు భావిస్తున్నారు.

ఈ ప్రతిష్టాత్మక పథకం అమలు కోసం తమిళనాడు ప్రభుత్వం భారీగా నిధులను కేటాయించింది. బడ్జెట్ నుంచి ఏటా రూ. 755.83 కోట్లను ఈ ఒక గ్రాము బంగారు ఉంగరాల పంపిణీ కోసం ఖర్చు చేయనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఆసుపత్రులలో నమోదయ్యే వార్షిక ప్రసవాల సగటు గణాంకాలను ఆధారంగా చేసుకుని, నిధుల కొరత లేకుండా లబ్ధిదారులందరికీ సకాలంలో ఈ ఉంగరాలు అందేలా తమిళనాడు మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనుంది.   

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే సీఎం విజయ్ ఈ స్థాయి భారీ సంక్షేమ పథకానికి జీవో జారీ చేయడంపై మహిళలు, పేద కుటుంబాల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. గతంలో తమిళనాడు పాలిటిక్స్‌లో ఉచిత మిక్సీలు, గ్రైండర్లు, ఉచిత ల్యాప్‌టాప్‌లు వంటి పథకాలు సంచలనం సృష్టించగా.. ఇప్పుడు తమిళ సంస్కృతితో ముడిపడిన ఈ 'తాయా మామన్ తంగ మోదిరమ్ తిట్టమ్' నేరుగా ప్రజల హృదయాలను తాకుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పథకం ద్వారా ముఖ్యమంత్రి విజయ్ ప్రతి ఇంట్లో ‘మేనమామ’గా మారి తన రాజకీయ పునాదిని మరింత పటిష్టం చేసుకుంటున్నారనే చర్చ తమిళనాట నడుస్తోంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
India Census 2027: జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
US Iran War: ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Embed widget