అన్వేషించండి

Gautami Tadimalla : అన్నాడీఎంకేకు సినీ నటి గౌతమి రాజీనామా - విజయ్ పార్టీలో చేరుతారా?

Gautami Tadimalla Resign : తమిళనాడులో అన్నాడీఎంకేకు బిగ్ షాక్ తగిలింది. సినీ నటి గౌతమి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ప్రాథమిక సభ్యత్వంతో పాటు అధికారిక పదవికి కూడా రిజైన్ చేశారు.

Actress Gautami Tadimalla Resigned To AIADMK : తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం జరిగింది. ప్రముఖ సినీ నటి, AIADMK (ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం) ప్రచార విభాగం ఉప కార్యదర్శి గౌతమి తాడిమల్ల ఆ పార్టీకి సడన్‌గా గుడ్‌బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు తనకు అప్పగించిన అధికారిక పదవికి కూడా ఆమె రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె.పళనిస్వామికి పంపించారు.

అదే రీజనా?

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే తాను ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందని గౌతమి లేఖలో పేర్కొన్నారు. బరువెక్కిన హృదయంతో AIADMKను వీడుతున్నట్లు సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేశారు. భవిష్యత్తులో మరింత స్వతంత్రంగా, సముచిత రీతిలో సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేందుకే ఈ అడుగు వేసినట్లు ఆమె పేర్కొన్నారు. తన రాజకీయ ప్రయాణంలో సహకరించిన మాజీ మంత్రులు, జిల్లా, నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యకర్తలకు, నాయకత్వానికి ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Also Read : Kenatha Kanom OTT : బావిలో బయటపడ్డ డైనోసార్ - ఓటీటీలోకి యోగిబాబు సెటైరికల్ కామెడీ మూవీ... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

బీజేపీని వీడి...

దాదాపు రెండు దశాబ్దాల పాటు బీజేపీలో కొనసాగిన గౌతమి... ఆ పార్టీ హై కమాండ్ నుంచి ఆశించిన స్థాయిలో సపోర్ట్ లభించడం లేదంటూ 2023, అక్టోబరులో బయటకు వచ్చారు. ఆ తర్వాత ఏడాది ఫిబ్రవరిలో పళని స్వామి సమక్షంలో అన్నాడీఎంకేలో చేరారు. రీసెంట్‌గా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

ప్రస్తుతం అన్నాడీఎంకే తీవ్ర రాజకీయ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గౌతమి లాంటి కీలక నేత పార్టీని వీడటం ఆ పార్టీకి పెద్ద షాకే అని చెప్పాలి. ప్రస్తుతం ఈ అంశం పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, గౌతమి రాజీనామా నిర్ణయంపై పార్టీ అధిష్టానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

విజయ్ పార్టీలో చేరతారా?

ప్రస్తుతానికి నటి గౌతమి తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించకపోయినప్పటికీ ఆమె సీఎం విజయ్ TVK పార్టీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఒకవేళ అదే నిజమైతే ప్రజెంట్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో బలమైన మహిళా నేతగా గౌతమి TVKలో ఎదుగుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Also Read : Mahesh Babu : మహేశ్ బాబుతో నెక్స్ట్ మూవీ... రామ్ చరణ్‌తో మరో సినిమా - బుచ్చిబాబు రియాక్షన్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: డీఎస్సీ తరహాలోనే యూనివర్సిటీల్లో నియామకాలు చేపడతాం: మంత్రి నారా లోకేష్
డీఎస్సీ తరహాలోనే యూనివర్సిటీల్లో నియామకాలు చేపడతాం: మంత్రి నారా లోకేష్
BJP Grassroots Leadership: వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Embed widget