Taliban Takeover Kabul: కాబుల్ విమానాశ్రయంలో భయానక దృశ్యాలు.. సిటీబస్సులను తలపిస్తున్న విమానాలు.. విమానాలపై వేలాడుతూ ప్రయాణాలు
అఫ్గానిస్థాన్ తాలిబన్ల పరమైంది. దీంతో అక్కడి ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని దేశాన్ని వీడివెళ్లేందుకు విమానాశ్రయాల వైపు పరుగులు పెడుతున్నారు. కానీ అఫ్గాన్ గగనతలాన్ని మూసివేసినట్లు తెలుస్తోంది.
తాలిబన్లు పంతం గెలిచింది. అఫ్గానిస్థాన్ ని తమ వశం చేసకున్నారు. రాకెట్ల దాడులు, బాంబుల విధ్వంసాలతో రక్తం ఏరులై పారింది. లక్షల మంది దేశం విడిచి వెళ్లారు. వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఆ దేశం భయం గుప్పిట్లో ఉంది. ఇతర దేశాల ప్రజలు వారి దేశాలకు వెళ్లేందుకు విమానాశ్రయాలకు వెళ్తున్నారు. లాక్ డౌన్ వేళ రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు కిక్కిరిసిపోవడం చూస్తుంటాము. ఇప్పుడు అఫ్గానిస్థాన్ లో అదే పరిస్థితి కనిపిస్తోంది. అఫ్గాన్ వీడేందుకు విమానాల వద్దకు పరుగులు తీస్తున్నారు.
ప్రాణ భయంతో పరుగులు
అఫ్గాన్ రాజధాని కాబుల్‌ను తాలిబన్లు సమీపించారని తెలిసిన వెంటనే నగరవాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విమానాశ్రయాల వైపు పరుగులు తీశారు. దేశంలోని ప్రధాన నగరాలతో పాటు వివిధ రాష్ట్రాల రాజధానులను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో చాలా మంది దేశ రాజధాని కాబుల్‌కు వలసవచ్చారు. ఇక్కడ ప్రభుత్వ బలగాలు అధిక సంఖ్యలో ఉండటంతో తాలిబన్లను అడ్డకుంటారని భావించారు. కానీ ఊహించిన దాని కంటే బలంగా తాలిబన్లు కాబుల్ వైపు దూసుకొచ్చారు. రాజధానిని వశం చేసుకున్నారు. దీంతో ప్రజలు ప్రాణ భయంతో విమానాశ్రయాల వైపు పరుగుల తీస్తున్నారు.
Chaotic scenes continue at Kabul Airport. Overnight people slept on the plane, ripped seats off etc etc. We are still seeing thousands of people on the tarmac. No flights can take off. Where the hell are the Americans (who had promised security)?? This is Saigon on steroids pic.twitter.com/XzMwM8ENxX
— Saad Mohseni (@saadmohseni) August 16, 2021
ఒక్కో విమానం వద్ద వేల మంది
అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయారు. ఆయన తన బృందంతో తజకిస్థాన్ కి వెళ్లినట్లు సమాచారం. ఈ వార్త తెలియగానే వేల మంది ప్రజలు, నగరవాసులు, ఉద్యోగులు, వ్యాపారులు, మంత్రులు, ప్రాణభయంతో దేశం విడిచి పెట్టి వెళ్లేందుకు కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. దీంతో హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కిక్కిరిసిపోయింది. ఒక్కో విమానం వద్ద వందల సంఖ్యలో ప్రజలు గుమ్మిగూడారు. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. వందల సంఖ్యలో ప్రజలు విమానాల వద్దకు వస్తుండడంతో భద్రతా సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపారు. కాబుల్ విమనాశ్రయం తాలిబన్ల అధీనంలో ఉందని అమెరికా దౌత్య కార్యాలయం తెలిపింది.
విమానం రెక్కలపై నుంచి జారిపడి
విమానాలు ఎక్కి వేలాది మంది అఫ్గాన్ ను విడిచివెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదకరంగా రెక్కలతో, టైర్లు, విమాన పైభాగాన వేలాడుతూ ప్రయాణించారు. టేకాఫ్ అయిన సీ-130జే విమానం నుంచి పలువురు జారి కింద పడుతున్న దృశ్యాలు చూస్తుంటే ఒళ్లు జలదరిస్తుంది. ఇద్దరు వ్యక్తులు విమానం నుంచి కిందపడి చనిపోయి ఉంటారని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.
The moment a person falls from a plane in Afghanistan, because he were clinging to the tires of the airplane.#Afghanistan #Talibans #Afghanishtan #AfghanWomen #Kabul #KabulHasFallen #kabulairport #AfghanistanBurning #KabulFalls pic.twitter.com/hVb2U3zJ1R
— Musawer khalil andarabi (@MusawerAndarabi) August 16, 2021
Also Read: Afghanistan News: తాలిబన్ల చేతిలో అఫ్గానిస్థాన్.. అధికార మార్పిడి కోసం చర్చలు
భారతీయుల తరలింపు
అఫ్గాన్ లో చిక్కుకున్న భారతీయులను దేశానికి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం రాత్రి 129 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీకి చేరింది. రాత్రి 8 గంటల సమయంలో ఈ విమానం రన్‌వేపై దిగింది. కాబుల్ నుంచి ఢిల్లీకి వరుసగా విమానాలు నడిపేందుకు ఎయిర్ ఇండియా ఏర్పాట్లుచేస్తోంది. రెండు విమానాలను అత్యవసరంగా సిద్ధం చేసింది. ఆ అఫ్గాన్ వెళ్లే విమానాన్ని ఈ రోజు మధ్యాహ్నం 12.30కు రీషెడ్యూల్ చేసింది.
అఫ్గాన్ గగనతలం మూసివేత!
అఫ్గాన్ గగనతలాన్ని మూసివేసినట్లు కొన్ని దేశాల విమానయాన సంస్థలకు నోటీసు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆ దేశానికి విమానాలను పంపలేకపోతున్నామని ఎయిర్ ఇండియా తెలిపింది. అఫ్గానిస్థాన్ గగనతలాన్ని అన్ని ఎయిర్‌లైన్లకు మూసివేసినట్లు సమాచారం అందినట్లు తెలిపింది. అమెరికా నుంచి ఢిల్లీకి వచ్చే విమానాలను అఫ్గాన్ మీదుగా వెళ్లకుండా దారిమళ్లీస్తున్నామని వెల్లడించింది. ఆ విమానాలు యూఏఈలో ప్యూయల్ నింపుకుని ఢిల్లీకి వస్తాయని పేర్కొంది. ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు కాబుల్‌కు విమానాన్ని పంపాలని ఎయిర్ ఇండియా నిర్ణయింది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ఎయిర్ ఇండియా వర్గాలు తెలిపాయి.
As the Americans leave Kabul: pic.twitter.com/VLYoOrPGZL
— ian bremmer (@ianbremmer) August 16, 2021
ఎయిర్ పోర్టులో తొక్కిసలాట
అఫ్గానిస్థాన్‌లోని కాబూల్ విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాలిబన్లు అఫ్గాన్ చేజిక్కించుకోవడంతో వేలాది మంది దేశాన్ని విడిచివెళ్లేందుకు విమానాశ్రయానికి వస్తున్నారు. పౌరులు భారీగా వస్తుండడంతో భద్రతా సిబ్బంది గాల్లోకి కాల్పులు కూడా జరిపాయి. విమానాశ్రయంలో తొక్కిసలాట జరిగింది. ఐదుగురు పౌరులు చనిపోయినట్లు తెలుస్తోంది.
Here in this video you see some of the Afghan youth hanging on the American airplane’s engines before take off in the Kabul airport pic.twitter.com/msb8UbZO9D
— Ragıp Soylu (@ragipsoylu) August 16, 2021
God no. pic.twitter.com/mJJP23ydpZ
— ian bremmer (@ianbremmer) August 16, 2021