Supreme Court bail to Kavitha : ఈడీ, సీబీఐ దర్యాప్తు పూర్తవడమే ప్లస్ - సిసోడియాకు ఇచ్చినట్లే - కవిత బెయిల్‌పై సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవీ
Kavitha : కవితకు బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే కేసులో ఈడీ, సీబీఐ దర్యాప్తు పూర్తి చేయడంలో ఇక నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదన్నారు.
Supreme Court On Kavitha bail : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితకు బెయిల్ మంజూరుకు సుప్రీంకోర్టు మూడు ప్రధాన కారణాలు చెప్పింది. సీబీఐ తుది చార్జిషీటు దాఖలు చేయడం, ఈడీ కూడా దర్యాప్తు పూర్తి చేయడం, ఇప్పుడు నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదని.. మహళగా కూడా పరిగణనలోకి తీసుకుని బయిల్ మంజూరు చేస్తున్నట్లుగా సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.
తుది చార్జిషీటు దాఖలు చేసిన సీబీఐ
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సుదీర్గ విచారణ జరిపిన సీబీఐ అనేక అనుబంధ చార్జిషీట్లు దాఖలు చేస్తూ వస్తోంది. గత నెలలో తుది చార్జిషీటు దాఖలు చేసింది. దర్యాప్తు అంతా పూర్తయింది. సాదారణంగా దర్యాప్తునకు ఆటంకాలు కలిగిస్తారన్న ఉద్దేశంతోనే నిందితుల్ని ఎక్కువ కాలం జైల్లో ఉంచుతారు. సీబీఐ తుది చార్జిషీటు దాఖలు చేసినట్లుగా కోర్టుకు తెలిచేయడంతో కవిత తరపున్యాయవాదులు చురుకుగా కదిలారు. ఈ పాయింట్ ను ప్రధానంగా తమ వాదనల్లో ప్రస్తావించారు. అవి ఫలించాయని.. తాజా తీర్పును బట్టి స్పష్టమవుతోంది. దర్యాప్తు పూర్తైంది. చార్జ్‌షీట్ ఫైల్ చేశారు. నిందితురాలు ఇంకా కస్టడీలో ఉండాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేశారు. కవిత ఐదు నెలలుగా జైలులో ఉన్నారని... కేసు విచారణ త్వరగా పూర్తయ్యే సూచనలు కనిపించడం కనిపించనందున.. ఇతర కేసుల్లో చెప్పినట్లే విచారణ ఖైదీలు జైల్లో ఉండి శిక్ష అనుభవించకూడదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
దర్యాప్తు పూర్తి చేసిన ఈడీ
సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా .. కొత్త కేసులు నమోదు చేసి విచారణ జరిపిన ఈడీ కూడా దర్యాప్తు పూర్తి చేసింది. చార్జిషీటు దాఖలు చేయాల్సి ఉంది. ఇప్పుడు కవిత ను జైల్లో ఉంచడానికి బలమైన కారణాలను ఈడీ చెప్పలేకపోయింది. దర్యాప్తు పూర్తయినందున ప్రభావితం చేసే అవకాశం లేదు. అందుకే ఈడీ కూడా కవిత బెయిల్ కు వ్యతిరేకంగా బలమైన వాదన వినిపించలేకపోయారు.
మహిళ కావడం కూడా !
కవిత మహిళ కావడం కూడా బెయిల్ మంజూరుకు ప్రధాన కారణాల్లో ఒకటిగా ఉంది. ఆమె తరచూ అస్వస్థతకు గురవుతున్న విషయాన్ని లాయర్లు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మహిళల్ని సుదీర్ఘ కాలం జైల్లోపెట్టడంపై సరి కాదని వాదనలు వినిపించారు. ఈ వాదనలపై సుప్రీంకోర్టు ధర్మాసనం కొన్ని వ్యాఖ్యలు చేసినప్పటికీ చివరికి బెిల్ మంజూరుకు కారణాల్లో మహిళ కావడం కూడా ఒకటిగా ప్రకటించి..బెయిల్ మంజూరు చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇంకా కేజ్రీవాల్ మత్రమె బెయిల్ పొందాల్సి ఉంది. సిసోడియా కూడా ఇటీవల బెయిల్ పొందారు. ఆయన ఏడాదికిపైగానే జైల్లోనే ఉన్నారు. కేజ్రీవాల్ కూడా ఎన్నికల సందర్భంలో మధ్యంతర బెయల్ పొందారు కానీ.. మళ్లీ జైలుకు వెళ్లారు. ఆయనకు ఈడీ కేసులో బెయిల్ మంజూరు అయింది. సీబీఐ కోసులో ఇంకా బెయిల్ రావాల్సి ఉంది. ఢిల్లీ లిక్కర్ కేసు నిందితులకు వరుసగా బెయిల్స్ వస్తున్న విధానం చూస్తే.. కేజ్రీవాల్ కూడా బెయిల్ లభించవచ్చని అంచనా వేస్తున్నారు.
Also Read: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట- బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు