అన్వేషించండి

Delhi Liquor Scam Case: లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌కి ఊరట, మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు - అయినా జైల్లోనే

Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam) అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్‌కి ఊరట లభించింది. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. ఈ కేసుని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. కేజ్రీవాల్ అరెస్ట్‌లో పలు కీలక అంశాలతో పాటు సెక్షన్లను పరిశీలించాల్సి ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈడీ కేసులో ఇంకా కస్టడీలో ఉండాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ తరపున న్యాయవాదులు వాదించారు. తన అరెస్ట్ అక్రమమని కేజ్రీవాల్ పిటిషన్ వేయగా...ఈ పిటిషన్‌ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది కోర్టు. దీనిపై ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

అరెస్ట్‌ని సమర్థించిన ఢిల్లీ హైకోర్టు..

బెయిల్ వచ్చినప్పటికీ ఆయన జైల్‌లోనే ఉండక తప్పదు. ఇదే కేసులో ఆయనను CBI విచారిస్తోంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. 90 రోజుల పాటు కేజ్రీవాల్‌ జైల్లో ఇబ్బంది పడ్డారని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. ఆయన ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి అన్న సంగతి గుర్తుంచుకోవాలని వెల్లడించింది. ఏప్రిల్ 9వ తేదీన ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్‌కి బెయిల్‌ని తిరస్కరించింది. కేజ్రీవాల్ అరెస్ట్‌ని సమర్థించింది. ఇందులో ఎలాంటి అక్రమం లేదని తేల్చి చెప్పింది. 

"సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కి భారీ ఊరటనిచ్చింది. ఈ కేసు నమోదైనప్పటి నుంచి మేం ఒకే విషయం చెబుతున్నాం. మనీలాండరింగ్ జరగలేదని,అవన్నీ అవాస్తవం అని వాదిస్తున్నాం. మనీలాండరింగ్‌ జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. FIRలో కేజ్రీవాల్ పేరు కూడా లేదు. ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యమూ లేదు. ఇప్పటి వరకూ ఈడీ ఎలాంటి ఆధారాలు బయటపెట్టలేదు. కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేయాల్సిన అవసరాన్ని బలపరిచేలా ఎలాంటి ప్రూఫ్‌లనీ ఇవ్వలేదు. ఇది కేవలం రాజకీయ కుట్ర మాత్రమే"

- అడ్వకేట్ సంజీవ్ నజీర్, ఆప్‌ లీగల్ సెల్‌

Also Read: Indian Railways: ప్రయాణికులకు బిగ్ అలర్ట్ - దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన

టాప్ హెడ్ లైన్స్

National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Siraj Wierd Throw Towords Umpire: అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
ABP Desam Top 10, 18 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 18 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
Pujara Bold Strategy: టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!
టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Embed widget