అన్వేషించండి

Standup Comedy Controversies: దారి తప్పుతున్న స్టాండప్ కమెడియన్లు - అసభ్యత, కించపర్చడానికి ...హాస్యానికి మధ్య ఉన్న గీత గుర్తించలేరా?

Limits of Satire vs Insult: త, రాజకీయ నేతలపై వ్యక్తిగత దూషణలు వివాదాస్పదమవుతున్నాయి. హాస్యానికి, అసభ్యతకు, హేళనకు మధ్య గీత దాటుతున్న కారణంగా అనేక సమస్యలు వస్తున్నాయి.

Online Backlash Standup Comedy Controversies:  ప్రస్తుత డిజిటల్ యుగంలో  స్టాండప్ కామెడీ  సంస్కృతి యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే, ఈ మధ్యకాలంలో హాస్యం పండించడం కంటే వివాదాలు సృష్టించడమే దీని ప్రధాన లక్షణంగా మారిందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. కామెడీ క్లబ్‌లలో లేదా సోషల్ మీడియా రీల్స్‌లో వ్యక్తమవుతున్న కొన్ని అభిప్రాయాలు, జోకులు నవ్వు తెప్పించకపోగా, వినేవారికి తీవ్ర అసహ్యం కలిగిస్తున్నాయి. హాస్యానికి  , ఎగతాళికి,  అవమానపర్చడానికి , అసభ్యతకు మధ్య ఉన్న లక్ష్మణ రేఖను కొందరు పూర్తిగా విస్మరిస్తుండటంతో ఈ సరిహద్దుల వివాదం ఇప్పుడు పోలీస్ స్టేషన్లు, కోర్టుల వరకు వెళ్తోంది.

కుళ్లు జోకులతో వివాదాలు

ఇలాంటి వివాదాల్లో చిక్కుకుంటున్న వారిలో ఎక్కువ మంది ప్రొఫెషనల్ కామిక్స్ కాకపోవడం గమనార్హం. ఐటీ రంగానికి చెందిన టెకీలు, వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్లు, ఇతర రంగాల వారు కేవలం పార్ట్-టైమ్ క్రేజ్ కోసం మైక్ పట్టుకుని స్టేజ్ ఎక్కుతున్నారు. గతంలో ఒక ప్రదర్శనలో ఐదేళ్ల చిన్నారిపై అత్యంత అసహ్యకరమైన, లైంగిక కోణంలో జోకులు వేసిన ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఇటీవల ముంబై, గురుగ్రామ్‌లలో జరిగిన 370 రూపాయల బిర్యానీ  వివాదం కూడా తీవ్ర చర్చకు దారితీసింది. మహిళల ఆత్మగౌరవాన్ని, సమ్మతిని కించపరిచేలా ప్రేక్షకులు మాట్లాడిన మాటలను సదరు కమెడియన్ అడ్డుకోకుండా ప్రోత్సహించడంపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. దీనివల్ల సదరు వ్యక్తులు తమ చేతులా కెరీర్లను పాడుచేసుకోవడమే కాకుండా, ఉద్యోగాలు కోల్పోయి చట్టపరమైన ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారు.
 
వ్యక్తిగత జీవితాలపై దాడి 

రాజకీయ విమర్శల పేరుతో నేతల వ్యక్తిగత, కుటుంబ జీవితాలను కించపరిచేలా మాట్లాడటం స్టాండప్ కామెడీ కాదు.. అది ముమ్మాటికీ వ్యక్తిత్వ హననమే. రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ కామెడీ చేయడం ఈ రంగంలో ఒక సాధారణ అంశమే అయినప్పటికీ, ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులపై కొందరు కమెడియన్లు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. హైదరాబాద్‌కు చెందిన కమెడియన్ అనుదీప్ కాటికాల పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ వ్యవహారాలను ఎగతాళి చేస్తూ చేసిన వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు తీవ్రంగా మండిపడ్డాయి. ఫలితంగా ఏపీ పోలీసులు ఉత్తరప్రదేశ్‌కు వెళ్లి మరీ అతడిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. అలాగే మరో కమెడియన్ శరత్ ఉదయ్ గతంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌లను ఉద్దేశించి చేసిన పాత జోకులపై బెంగళూరులో జరుగుతున్న లైవ్ షోలో కొందరు అభిమానులు గొడవకు దిగి, బలవంతంగా క్షమాపణలు చెప్పించడం కూడా పెద్ద సంచలనంగా మారింది.

వ్యంగ్యం విధానాలు, నిర్ణయాలపై ఉండాలి.. వ్యక్తిగత జీవితంపై కాదు! 

రాజకీయ విమర్శలు,  వ్యంగ్యం  అనేది ప్రజాస్వామ్యంలో సహజం. అమెరికా, యూరప్ దేశాల్లో అధ్యక్షులపైనే తీవ్రమైన జోకులు వేస్తుంటారు. కానీ, అక్కడ ఆ వ్యంగ్యం వారి విధానాలు, నిర్ణయాలపై ఉంటుంది తప్ప వారి వ్యక్తిగత జీవితాల మీద, భార్యాపిల్లల మీద ఉండదు. మన దగ్గర జరుగుతున్న పొరపాటు ఇదే. పవన్ కల్యాణ్ గత వైవాహిక జీవితాన్ని ప్రస్తావించడం, లేదా చంద్రబాబు నాయుడిపై జరిగిన పాత హత్యాయత్న ఉదంతాలను హాస్యాస్పదం చేయడం ఏమాత్రం ప్రొఫెషనలిజం అనిపించుకోదు. నవ్వులు పూయించాల్సిన వేదికలు కాస్తా, రాజకీయ కక్షలకు, వ్యక్తిగత దూషణలకు సాధనాలుగా మారుతుండటంతోనే సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.

ఈ పరిణామాలన్నీ స్టాండప్ కామెడీ రంగంలో  సెల్ఫ్ సెన్సార్‌షిప్  ఎంత అవసరమో గుర్తుచేస్తున్నాయి. కేవలం కొన్ని వ్యూస్ కోసం, చప్పట్ల కోసం ,  వైరల్ అవ్వాలనే తాపత్రయంతో సమాజం అంగీకరించని హద్దులను దాటడం వల్ల కెరీర్‌లు ముగిసిపోతాయి తప్ప గుర్తింపు రాదు. చట్టం తన పని తాను చేసుకుపోతున్న తరుణంలో.. హాస్యం అంటే ఎదుటివారిని నొప్పించడం కాదు, మెప్పించడం అనే కనీస ధర్మాన్ని కమెడియన్లు తెలుసుకోకపోతే ఈ వేదికల ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
IND VS SL Saransh Jain Debut: 12 ఏళ్ల నిరీక్షణకు తెర.. కుల్దీప్  ప్లేస్ లో సారాంశ్ ఎంట్రీ, కొలంబో టెస్ట్ కు టీమిండియాలో మార్పు!
12 ఏళ్ల నిరీక్షణకు తెర.. కుల్దీప్  ప్లేస్ లో సారాంశ్ ఎంట్రీ, కొలంబో టెస్ట్ కు టీమిండియాలో మార్పు!
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget