Munawar Show : వేల మంది పోలీసులు - ఫుల్ సెక్యూరిటీ ! స్టాండప్ కామెడీకి సీరియస్ ఏర్పాట్లు ! అయినా ఏం జరుగుతుందో ?
హైదరాబాద్‌లో మునావర్ ఫారుఖీ స్టాండప్ కామెడీ షోకుభారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రాజాసింగ్ హెచ్చరికలతో టిక్కెట్లు కొన్న వారి వివరాలు పరిశీలిస్తున్నారు.
Munavar Show : ఒక్క స్టాండప్ కామెడీ షో హైదరాబాద్ పోలీసుల్ని నాని తిప్పలు పెడుతోంది. స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖీ హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో శనివారం సాయంత్రం ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ షోకు టిక్కెట్లను బుక్ మై షో పూర్తిగా విక్రయించింది. మునావర్ ఫారుఖీ రాక విషయాన్ని కూడా పోలీసులు గోప్యంగా ఉంచారు. ఆయనకు పూర్తి భద్రత కల్పించారు. శిల్పకళా వేదిక చుట్టూ పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించారు. మునావర్ ఫారుఖీ షోకు అనుమతులు ఉన్నాయని మాదాపూర్ డీసీపీ ప్రకటించారు. ఎవరైనా అశాంతి సృష్టించాలని చూస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సాయంత్రం షో మొదలై ముగిసే వరకు పోలీసులు అన్నిచోట్ల బందోబస్తు ఉంటుందని పోలీసులు ప్రకటించారు.
మరో వైపు స్టాండప్ కామెడీ షో వేదికను తగలబెడతామని.. షో జరుగుతున్నప్పుడు.. ఫారుఖీపై దాడి చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. ఎమ్మెల్యే రాజసింగ్ను అరెస్ట్ చేసిన పోలీసులు లాలాగూడా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. భద్రతా చర్యల దృష్ట్యా శిల్పకళా వేదిక వద్ద భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సీతాదేవిపై జోకులు వేయడంతో మునావర్ షోలు వివాదాస్పదంగా మారాయి. కర్ణాటక లో మునావర్ కామెడీ షోలపై ఇప్పటికే బ్యాన్ కొనసాగుతోంది. హైదరాబా లోనూ మునావర్ షోలు నిర్వహించకూడదంటూ రాజాసింగ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే బీజేవైఎం కార్యకర్తలు ఇప్పటికే షో టికెట్స్ తీసుకున్నట్లు రాజాసింగ్ ప్రకటించడంతో నిర్వాహకులు.. పోలీసులు అప్రమత్తమయ్యారు. అ గతంలో బెంగళూరులో మునావర్ ఫారుఖీ స్టాండర్ కామెడీ షో చేయాల్సింది. చివరి క్షణంలో అక్కడి ప్రభుత్వం అనుమతి రద్దు చేసింది. దాంతో షో జరగలేదు. ఆ సమయంలో ఈ అంశంపై స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్.. మునావర్‌ను హైదరాబాద్‌లో షో చేసుకోవచ్చని ఆహ్వానించారు. తాము చివరి క్షణంలో అనుమతులు రద్దు చేయబోమన్నారు. .
అందుకే జరిగేది స్టాండప్ కామెడీ అయినా విషయం మాత్రం సీరియస్‌గా మారింది. .ఈ ఏడాది జనవరిలో మునావర్ ఫరూఖీ హైదరాబాద్ లో షో జరపాలని ప్లాన్ చేశారు. అయితే కొవిడ్ కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు మునావర్ షో ను ఏర్పాటు చేశారు. మాటకు తగ్గట్లుగానే బీజేపీ ఎమ్మెల్యే.. హిందూ సంస్థల నుంచి వ్యతిరేకత వచ్చినా షోలకు అనుమతి ఇచ్చారు. అనుకున్నట్లుగా షో ప్రశాంతంగా జరిగితే సరే... ఏదైనా వివాదం జరిగితే... రాజకీయంగానూ ఈ అంశం కలకలం రేపే అవకాశం ఉంది. ప్రత్యేకంగా కేటీఆర్ ఆహ్వానం మీదనే మునావర్ ఫారుఖీ హైదరాబాద్‌లో షో ఏర్పాటు చేసినందున.. ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై పడింది.
ఏపీ బీజేపీ నేతలుకూడా ఈ షోను వ్యతిరేకిస్తున్నారు. అనుమతులు రద్దు చేయాలని కేటీఆర్‌ను కోరుతున్నారు.
Munawar Faruqui who claims to be a comedian has a track record of abusing Hinduism & Hindu gods/goddesses.@KTRTRS garu is giving red carpet to him in Hyderabad & arresting BJP leaders for opposing it.
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) August 20, 2022
Why TRS hates Hindus & loves anti Hindu forces? Who's next, Hafeez Saeed?