అన్వేషించండి

Amroha Three Sisters Marriage: ముగ్గురు అక్కా చెల్లెళ్లను ఒకే సారి పెళ్లి చేసుకున్న వ్యక్తి - వీడియో వైరల్ - కానీ అసలు ట్విస్ట్ క్లైమాక్స్‌లో

UP Man Marries 3 Sisters : యూపీలో ఓ వ్యక్తి ముగ్గురు అక్కా చెల్లెళ్లను పెళ్లి చేసుకున్నట్లుగా ఓ వీడియో వైరల్ అయింది. కానీ అసలు లెక్క మాత్రం చివరిలో బయటపడింది.

UP Police Action Amroha Reel:  యూపీలోని అమరోహా  జిల్లాలో   చాముండా దేవి ఆలయం వేదికగా ఒకే యువకుడిని ముగ్గురు  అక్కాచెల్లెళ్ళు వివాహం చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమైన వార్త ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ముగ్గురు యువతులు ఒకే యువకుడి మెడలో దండలు వేయడం, గుడి ఆవరణలో తాళి కట్టే ఘట్టాలు, సత్యనారాయణ స్వామి వ్రతం తరహా పూజలు చేయడం ఉన్న వీడియోలు ఆన్‌లైన్‌లో తుఫాను సృష్టించాయి.  ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లను ఒకే యువకుడు పెళ్ళాడాడు అనే క్యాప్షన్లతో ఈ వార్త క్షణాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర విస్మయానికి గురయ్యారు.

అయితే, సోషల్ మీడియాలో ప్రచారమైనంత మాత్రాన ఇది నిజమైన వివాహం అనుకుంటే పొరపాటే!  వివరాల్లోకి వెళ్తే అసలు నిజం వేరేలా ఉంది. అమరోహ ప్రాంతానికి చెందిన  ఆదర్శ్ అనే యువకుడితో పాటు ఆయన ఇద్దరు అక్కాచెల్లెళ్ళు, మరో బంధువుల అమ్మాయి కలిసి నిత్యం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా  రీల్స్ చేస్తుంటారు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో వ్యూస్ , ఫాలోవర్లను పెంచుకోవడమే ధ్యేయంగా ప్లాన్ చేసిన ఒక  నాటకీయ డ్రామా   మాత్రమే ఇదని పోలీసులు పరిశీలనలో తేలింది.

సాధారణంగా హిందూ వివాహ చట్టం ప్రకారం బహుభార్యత్వాం చట్టరీత్యా నేరం మాత్రమే కాకుండా, పవిత్రమైన దేవాలయ ఆవరణలో కేవలం వ్యూస్ కోసం ఇలాంటి విన్యాసాలు చేయడంపై స్థానిక భక్తులు, హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. చాముండా దేవి ఆలయ కమిటీ ప్రతినిధులు సైతం ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. పవిత్రమైన గుడి పరిసరాలను కలుషితం చేస్తూ, వ్యవస్థను హేళన చేసేలా రీల్స్ చిత్రీకరించిన సదరు యువకుడు ,  ఆ ముగ్గురు యువతులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు  చేశారు.     

పోలీసు యంత్రాంగం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా ఇది చట్టబద్ధంగా జరిగిన పెళ్లి కాదని, కేవలం సోషల్ మీడియా హైప్ , ఫాలోవర్లను ఆకర్షించేందుకు ఆడిన స్క్రిప్టెడ్ నాటకం అని సదరు యువతులు అంగీకరించారు. పవిత్రమైన ఆలయ ప్రాంగణాన్ని తమ స్వార్థం కోసం వాడుకున్నందుకు, సమాజంలో తప్పుడు సందేశాన్ని వ్యాప్తి చేసినందుకు సదరు క్రియేటర్లపై చట్టపరమైన విచారణ నమోదు చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. సోషల్ మీడియా యుగంలో చిల్లర ప్రచారాల కోసం, కొన్ని లైక్స్, లైవ్ వ్యూస్ కోసం ఏ స్థాయికైనా దిగజారే సంస్కృతి ఏ రేంజ్‌కు చేరిందో చెప్పడానికి అమరోహా సంఘటన ఒక ఉదాహరణగా నిలిచింది.

 

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Breaking News:ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమవుతున్న ఉద్యోగులు- 16న ఏపీ జేఏసీ అత్యవసర భేటీ 
ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమవుతున్న ఉద్యోగులు- 16న ఏపీ జేఏసీ అత్యవసర భేటీ 
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
IND vs BAN Tour: బంగ్లాదేశ్ టూర్ కి గవర్నమెంట్ పర్మిషన్ కోసం బిసిసిఐ వెయిటింగ్.. రెండు బోర్డుల మధ్య కుదిరిన రాజీ, సిరీస్ నిర్వహణపై ట్విస్ట్!
బంగ్లాదేశ్ టూర్ కి గవర్నమెంట్ పర్మిషన్ కోసం బిసిసిఐ వెయిటింగ్.. రెండు బోర్డుల మధ్య కుదిరిన రాజీ, సిరీస్ నిర్వహణపై ట్విస్ట్!
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
YS Jagan Kurnool Tour: జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
Adilabad Airport Update: ఎయిర్ పోర్టు భూసేకరణ, సర్వే ప్రక్రియపై ప్రజలకు అపోహలు ఉండొద్దు- అధికారులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు 
ఎయిర్ పోర్టు భూసేకరణ, సర్వే ప్రక్రియపై ప్రజలకు అపోహలు ఉండొద్దు- అధికారులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు 
Bigg Boss Agnipariksha 2 : మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
Embed widget