అన్వేషించండి

Stand-up Comedian Sarat Uday: స్టాండప్ కమెడియన్ శరత్ ఉదయ్‌‌కి చేదు అనుభవం, లైవ్‌లో అడ్డుకుని వార్నింగ్ ఇచ్చిన టీడీపీ కార్యకర్తలు!

ప్రముఖ స్టాండప్ కమెడియన్ శరత్ ఉదయ్ లైవ్ షో నిర్వహిస్తుండగా, టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. రెండేళ్ల క్రితం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పించి, వార్నింగ్ ఇచ్చి వెళ్లారు.

standup comidian Sarat Uday | బెంగళూరు: స్టాండప్ కమెడియన్ శరత్ ఉదయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. గతంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై మరోసారి దుమారం చెలరేగింది.  రెండేళ్ల కిందట చంద్రబాబుపై చేసిన జోకుల విషయంలో టీడీపీ మద్దతుదారులు స్టాండప్ కమెడియన్ శరత్ ఉదయ్ ప్రోగ్రామ్ అడ్డుకుని మరీ మరోసారి క్షమాపణ చెప్పించారు. అందుకు సంబంధించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బూతులు తిడుతూ టీడీపీ సానుభూతిపరులు చేసిన చర్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

అసలేం జరిగిందంటే..
శనివారం, ఏప్రిల్ 25న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో బెంగళూరులోని కోరమంగళలో స్టాండప్ కమెడియన్ శరత్ ఉదయ్ ప్రోగ్రామ్ జరిగింది. స్టేజీ ఎక్కిన అతను అందర్నీ నవ్వుతూ పలకరించాడు. చంద్రబాబుపై రెండేళ్ల క్రితం చేసిన జోకుల విషయంలో ఆగ్రహించిన తెలుగుదేశం పార్టీ (TDP)కి చెందిన మద్దతుదారులు బెంగళూరులో స్టాండప్ కమెడియన్ శరత్ ఉదయ్ ప్రదర్శనను అడ్డుకున్నారు.  ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్న సమయంలో ప్రేక్షకుల మధ్యలోంచి ఓ వ్యక్తి లేచి అతడి వద్దకు వచ్చిన ‘నేను మీకు అభిమానిని. మీరు కామెడీ చాలా బాగా చేస్తారు. కానీ ఒక షోలో మీరు మా నాయకుడిని అవమానించారు. ’ అని అనడంతో షాకవడం శరత్ ఉదయ్ వంతు అయింది.

చంద్రబాబుపై, నారా లోకేష్‌లపై చేసిన జోక్‌లపై తాను గతంలోనే క్షమాపణలు కోరానని చెప్పినా టీడీపీ సపోర్టర్స్ బూతులు తిడుతూ శరత్ ఉదయ్‌పై బెదిరింపులకు పాల్పడ్డారు. నక్సలైట్లు హత్యాయత్నం చేస్తే జోకులు వేస్తావా, లడ్డూపై జోకులు వేసి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కాస్త శృతిమించి అసభ్యకర పదజాలం వాడుతూ స్టాండప్ కమెడియన్‌తో అనుచితంగా ప్రవర్తించారు. శరత్ ఉదయ్‌తో మరోసారి బహిరంగంగా క్షమాపణలు చెప్పించారు. ఈ తతంగం మొత్తం ఉదంతం వీడియోలో రికార్డ్ అయింది.

‘చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి క్షమాపణలు చెబుతున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా క్షమాపణ కోరుతున్నానని’ వీడియో రికార్డింగ్‌లో శరత్ ఉదయ్ మరోసారి సారీ చెప్పారు. అంతటితో ఆగకుండా జై తెలుగుదేశం, జై చంద్రబాబు అనాలని అతడిపై టీడీపీ కార్యకర్తలు ఒత్తిడి పెంచారు. చేసిన వ్యాఖ్యలపై తప్పిదానికి క్షమాపణ చెబుతా కానీ, మీ పార్టీకి, నేతకు జై కొట్టాలని ఎలా అడుగుతారని.. తాను వైసీపీ నేతలపై సైతం జోక్స్ వేశానని శరత్ ఉదయ్ గుర్తుచేశాడు. మరోసారి జాగ్రత్తగా మాట్లాడాలని అతడికి వార్నింగ్ ఇచ్చి అక్కడినుంచి వెళ్లిపోయారు. 

సారీ చెప్పాను కదా.. ఇక నా షో నుంచి వెళ్లిపోండి అని టీడీపీ మద్దతుదారులకు అతడు సూచించగా.. టికెట్ డబ్బులు తిరిగిస్తావా అని వాళ్లు అడిగారు. మీ డబ్బులు తిరిగిచ్చేస్తా, మొత్తం ఎంత మంది వచ్చారని అడగగా 10 మంది వచ్చామన్నారు. వారికి పేమెంట్ చేసి అక్కడి నుంచి పంపించేశారు. తమకు డబ్బులు ముఖ్యం కాదని మరోసారి చంద్రబాబు, నారా లోకేష్ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే ఈసారి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Chintada RaviKumar: మహిళా ఎస్సైపై దౌర్జన్యం.. వైసీపీ నేత చింతాడ రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మహిళా ఎస్సైపై దౌర్జన్యం.. వైసీపీ నేత చింతాడ రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget