స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్‌లు, ఉద్యోగులకు జీతాలివ్వలేని స్థితిలో కంపెనీ
SpiceJet: స్పైస్‌జెట్ కంపెనీ 1,400 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
Layoffs in SpiceJet: స్పైస్‌జెట్ త్వరలోనే భారీగా లేఆఫ్‌లకు (SpiceJet Layoffs) సిద్ధమవుతోంది. వర్క్‌ఫోర్స్‌ని తగ్గించుకుని రెవెన్యూ పెంచుకునేందుకు ఉద్యోగులను తొలగించనుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం 1,400 మందిని ఇంటికి పంపనుంది. ప్రస్తుతం స్పైస్‌జెట్‌లో 9 వేల మంది ఉద్యోగులున్నారు. అందులే 1,400 మంది అంటే దాదాపు 15% మేర కోత విధిస్తున్నట్టు లెక్క. అయితే...ఎంత మందిని తొలగిస్తున్న విషయంపై కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ప్రస్తుతం కంపెనీలో నష్టాల్లో ఉంది. ఇలాంటి సమయంలో ఉద్యోగులకు జీతాలివ్వలేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. అందుకే...భారీ స్థాయిలో లేఆఫ్‌లు చేపట్టాలని చూస్తోంది. తద్వారా కనీసం రూ.60 కోట్ల భారం తగ్గుతుందని అంచనా. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..ఇప్పటికే కొంతమంది ఉద్యోగులకు లేఆఫ్‌కి సంబంధించిన కాల్స్ వెళ్లాయి. ప్రస్తుతం స్పైస్‌జెట్ 30 ఎయిర్‌క్రాఫ్ట్‌లను నడుపుతోంది. ఇందులో దాదాపు 8 ఎయిర్‌క్రాఫ్ట్‌లను విదేశాల నుంచి లీజ్‌కి తెచ్చుకుంది. కొద్ది నెలలుగా ఉద్యోగులకు జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదు. ఇప్పుడున్న ఈ సవాలుని దాటుకోవాలంటే కనీసం రూ.2,200 కోట్లు అవసరం. ఈ నిధులను సేకరించే పనిలో పడింది సంస్థ. కంపెనీ ప్రతినిధులు మాత్రం ఎలాంటి సమస్యలు లేవని, త్వరలోనే అంతా సర్దుకుంటుందని చెబుతున్నారు. కొంతమంది పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని వెల్లడించారు. ఒకప్పుడు భారత్‌లో రెండో అతి పెద్ద ఎయిర్‌లైన్స్ సంస్థగా పేరు తెచ్చుకున్న స్పైస్‌జెట్ క్రమంగా నష్టాల్లో కూరుకుపోయింది. ఈ అప్పుల నుంచి బయటపడేందుకు షేర్స్, వారెంట్స్ అమ్ముకుంది.