Bangladesh: పేనుకు పెత్తనం ఇచ్చినట్లుగా బంగ్లాదేశ్ పరిస్థితి - రాజ్యాంగాన్ని మార్చేయమంటున్న ఆందోళనకారులు !
Yunus: బంగ్లాదేశ్ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. తాజాగా అసలు రాజ్యాంగాన్ని మార్చేయాలని అక్కడి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనలు ప్రారంభించాయి.
Shocking development in Bangladesh big trouble for Yunus: విద్యార్థి సంఘాల ఆందోళలతో దేశంలో ప్రభుత్వం మారిపోయింది. ప్రధాని పారిపోయారు. ప్రజలతో సంబంధం లేకుండా ఆ విద్యార్థుల డిమాండ్ మేరకు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన మహమ్మద్ యూనస్ ను మధ్యంతర అధ్యక్షుడిగా నియమించారు.కానీ ఇప్పుడు ఆ విద్యార్థులు, ఆందోళనకారులు అసలు రాజ్యాంగాన్నే రద్దు చేయమంటున్నారు. దీంతో యూనస్ తో పాటు ఖలీదా జియా పార్టీకి చెందిన వారు కూడా కంగారు పడుతున్నారు. ఇప్పుడేం చేయాలా అని కంగారు పడుతున్నారు.
రాజ్యాంగంపై పడ్డ ఆందోళనకారులు
బంగ్లాదేశ్‌లో షేక్ హసీనాను తరిమేసిన తర్వతా రాడికల్ ఇస్లామిస్టులు బలపడుతున్నారు. జమాతే ఇస్లామీ, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ వంటి కట్టర్ ఇస్లాం మద్దతుదారుల చేతిలో మైనారిటీలైన హిందువులు, క్రిస్టియన్స్, బౌద్ధులు దాడులకు గురవుతున్నారు. ఇప్పుడు ఆందోళనకారులంతా తమ రాజ్యాంగాన్ని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. 1972లో అమల్లోకి వచ్చిన రాజ్యాంగాన్ని మార్చాలని ఆందోళనలు ప్రారంభించారు. రాజ్యాంగంలోని నాలుగు సూత్రాలలో రెండు ‘లౌకికవాదం’ ‘సామ్యవాదం’ అనే పదాలతో పాటు జాతిపితగా షేక్ ముజిబుర్ రెహమాన్ పేరును తొలగించాలని అంటున్నారు. విద్యార్థులు పూర్తిగా ఓ ఆప్ఘనిస్థాన్ తరహాలో బంగ్లాదేశ్ ను చేయాలనుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి.
కొత్త మేనిఫెస్టో ప్రకటిస్తామంటున్న ఆందోళనకారులు
కొత్త ఏడాదిలో తమ మేనిఫెస్టోను ప్రకటిస్తామని విప్లవకారులు ఇప్పటికే ప్రకటించారు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడంతో పాటు చాలా నిర్ణయాలను వారు కోరుతున్నారు. ఇన్నాళ్లు బంగ్లాదేశ్ సెక్యులర్ దేశంగా ఉండేది, అయితే ఇకపై పాకిస్తాన్‌లాగే ఇస్లామిక్ రాజ్యంగా మారే దిశగా అడుగులు వేయాలని వారు కోరుతున్నట్లుగా తెలుస్తోంది. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి.. కట్టుబట్టలతో భారత్‌కు వచ్చి తలదాచుకుంటున్నారు. ఆగష్టు 5న అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోగా.. అనంతరం మూడు రోజుల తర్వాత నోబెల్ గ్రహీత ముహమ్మద్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటయ్యింది. ఆయన ప్రధాన సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు.అప్పట్నుంచి బంగ్లాదేశ్ అల్లకల్లోలంగా ఉంది.
Also Read: Viral Video: ఇంతకంటే ఛాన్స్ ఉంటుందా? - నచ్చిన వస్తువు ఫ్రీగా తీసుకెళ్లొచ్చంటూ బంపరాఫర్, కట్ చేస్తే!
విద్యార్థులు ఇలా మారుతారని ఎవరూ అనుకోలేదు. హసీనా పారిపోవడంతో జైలు నుంచి విడుదలైన ఖలిదా జియా కూడా రాజ్యాంగ మార్పును స్వాగతించడం లేదు. ఆమె పార్టీకి చెందిన వారు విముఖంగా ఉన్నారు. కొన్ని ప్రత్యేకమైన అంశాల పై మార్పులు చేయవచ్చు కానీ.. ఇలా పూర్తిగా రాజ్యాంగాన్ని మార్చేయాలనడం సరి కాదని ఖలిదా జియా నేతృత్వంలోని బంగ్లాదేస్ నేషనలిస్ట్ పార్టీ అంటోంది. ఈ ప్రతిపాదనను ఆందోళనకారులు మాత్రమే సమర్థిస్తున్నారు. యూనస్ కు కూడా సమస్యగా మారింది. ఆయన ఒప్పుకోకపోతే ఆయనను కూడా తరిమేసినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.