Viral Video: ఇంతకంటే ఛాన్స్ ఉంటుందా? - నచ్చిన వస్తువు ఫ్రీగా తీసుకెళ్లొచ్చంటూ బంపరాఫర్, కట్ చేస్తే!
Store Robbery: ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో ఓ స్టోర్ యజమాని వినూత్న ఆఫర్ ప్రకటించాడు. నచ్చిన వస్తువులు ఫ్రీగా తీసుకెళ్లొచ్చంటూ ఆఫర్ ప్రకటించగా.. కస్టమర్లు పోటెత్తారు.
Australian Store Owner Invited Customers To Rob His Shop: తమ వ్యాపారం బాగా జరగాలంటే చాలామంది వ్యాపారులు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తుంటారు. అదే కొత్త షాప్ ఓపెన్ చేస్తేనో.. లేక పండుగల సందర్భాల్లో డిస్కౌంట్లు అంటూ ఆఫర్స్ ఇవ్వడం మనం చూశాం. ఇలాంటి సమయాల్లో కస్టమర్లు సైతం ఎగబడుతుంటారు. అయితే, ఓ షాప్ యజమాని మాత్రం నచ్చిన వస్తువును ఫ్రీగా తీసుకెళ్లాలంటూ కస్టమర్లకు చెప్పాడు. ఇంకేముంది ఇది వినగానే ఆ షాపునకు కస్టమర్లు పోటెత్తారు. కేవలం 30 సెకన్లలోనే వందల సంఖ్యలో వస్తువులను ఖాళీ చేసేశారు. కాగా, ఈ ఆఫర్ తొక్కిసలాటకు దారి తీసింది. ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
పెర్త్‌కు చెందిన స్ట్రీట్ ఎక్స్ అనే దుస్తుల దుకాణం యజమాని డేనియల్ బ్రాడ్ షా.. వినూత్న మార్కెట్‌కు పెట్టింది పేరు. తాజాగా, ఆయన వందలాది టీషర్టులు గివ్ అవే ఇవ్వబోతున్నా అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. దీంతో బాక్సింగ్ డే రోజున పెర్త్‌లోని స్ట్రీట్ ఎక్స్ స్టోర్‌కు వందలాది మంది యువకులు చేరుకున్నారు. షట్టర్ తెరవగానే లోనికి చొచ్చుకెళ్లారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరగ్గా.. పలువురు స్వల్పంగా గాయపడ్డారు. అయితే, ఓ వ్యక్తి ముందు జాగ్రత్త చర్యగా సైకిల్ హెల్మెట్, ప్యాడ్స్ ధరించి షాపులోకి ఎంట్రీ ఇచ్చాడు.
View this post on Instagram
ఆఫర్‌పై యజమాని ఏమన్నారంటే?
కస్టమర్ల కోసం ఏదైనా సరదాగా చేయాలన్న ఉద్దేశంతో పూర్తి స్టోర్‌ను ఫ్రీగా ఉంచినట్లు స్టోర్ యజమాని డేనియల్ బ్రాడ్‌షా తెలిపాడు. సుమారు 400 వస్తువులను కేవలం 30 సెకన్లలో పూర్తయ్యాయని చెప్పాడు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని.. కొందరు వ్యక్తులు షాపు నుంచి బయటకు వచ్చాక ఒకరి చేతుల్లోంచి ఒకరు దుస్తులు లాక్కోవడం కనిపించినట్లు పేర్కొన్నాడు. ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.