UK woman: ఆఫీసుకుస్పోర్ట్స్ షూ వేసుకొచ్చిందని ఉద్యోగం నుంచి తీసేశారు - కానీ రూ.32 లక్షలు కట్టాల్సి వచ్చింది !
Sports shoes: స్పోర్ట్స్ షూస్ వేసుకుని ఆఫీసుకు రావడం నేరం ఏమీ కాదు.కానీ ఆ అమ్మాయిని కంపెనీ ఉద్యోగం నుంచి తీసేసింది. అయితే ఆమె కన్నీరు పెట్టుకోకుండా న్యాయ పోరాటం చేసింది.
UK woman fired for wearing sports shoes to work awarded 32 lakh compensation: ఆఫీసుకు ఎలా రావాలన్న దానిపై ప్రత్యేకమైన రూల్స్ లేకపోతే కాస్త ఫ్యాషనబుల్‌గా వచ్చేస్తూంటారు ఉద్యోగులు. ముఖ్యంగా యువత అయితే అసలు తగ్గరు. ఇలా లండన్‌లో ఓ రిక్రూటింగ్ ఏజెన్సీలో పని చేసే ఇరవై ఏళ్ల యువతి ఓ రోజు స్పోర్ట్స్ షూస్‌లో ఆఫీసుకు వెళ్లింది. అది కంపెనీ పై ఆఫీసర్లకు అసలు నచ్చలేదు. ఆ రోజే ఉద్యోగం నుంచి తీసేశారు. ఎందుకు తీసేస్తున్నారో కూడా చెప్పారు. దాంతో ఆ అమ్మాయి తనను పని సరిగ్గా చేయడం లేదని తీసేస్తే సైలెంట్ గా ఉండేదమో కానీ తాను స్పోర్ట్స్ షూస్ వేసుకురావడం వల్ల తీసేస్తారా.. అని కోర్టులో పిటిషన్ వేసింది.
కోర్టులో ఆ కంపెనీ స్పోర్ట్స్ షూస్ వేసుకొస్తే ఉద్యోగంలో నుంచి తీసేస్తారా..అలా మీ దగ్గర రూల్స్ ఉన్నాయా్ని ప్రశ్నిస్తే సమాధానం లేదు.అదే సమయంలో ఆ కంపెనీలో చాలా మంది ఉద్యోగులు స్పోర్ట్స్ షూస్ లోనే ఆఫీసుకు వస్తారని ఆ యువతి తరపు లాయర్లు కోర్టులో ఆధారాలు ప్రవేశ పెట్టారు. చాలా మంది వేసుకు వస్తున్నప్పుడు ఆ అమ్మాయి విషయంలో ఎందుకు చర్యలు తీసుకున్నారో చెప్పడానికి కంపెనీ తడబడింది. ఆమె జూనియర్ ఎంప్లాయి అని చెప్పేందుకు ప్రయత్నించారు.కానీ కోర్టు అంగీకరించలేదు. అనవసరంగా ఉద్యోగం నుంచి తొలగించి ఆమెకు మానసిక క్షోభ కలిగించినందుకు ముఫ్పై వేల పౌండ్లు చెల్లించాలని ఆదేశించింది. అంటే మన రూపాయాల్లో ముఫ్పై రెండు లక్షలు అనుకోవచ్చు.
Also Read: యూకే స్టుడెంట్ వీసా రూల్స్ మారాయి - మీ అకౌంట్‌లో ఎంత డబ్బు ఉండాలో తెలుసా?
న్యాయపోరాటం చేసిన ఉద్యోగి పేరు ఎలిజబెత్ బెనాన్సి. పద్దెనిమిదేళ్లకే ఉద్యోగంలో చేరింది. కంపెనీలో చేరినప్పటి నుండి తనను చిన్న పిల్లలా ట్రీట్ చేస్తున్నారని లేనిపోని రూల్స్ తనకే అప్లయ్ చేస్తున్నారని.. తమపై వివక్షచూపిస్తున్నారని ఆ ఉద్యోగిని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఆ కంపెనీ ఎలిజబెత్ విషయంలో వివక్ష చూపించిన విషయం స్పష్టంగా ఉందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఉద్యోగం నుంచి తొలగించడానికి డ్రెస్ కోడ్ వయోలేషన్కారణం అని మేనేజర్ మెయిల్ లోకూడా లేదని జడ్ది చెప్పారు. వృత్తి పరమైన వాతారణంలో జూనియర్లను చిన్న చూపు చూస్తున్న వైనం సీరియస్ గా పరిగణించదగ్గ అంశమని న్యాయస్తానం భావించింది.
యువతిని ఉద్యోగం నుంచి తీసి వేయడానని తీవ్రంగా సమర్థించుకునేందుకు కంపెనీ ప్రయత్నించింది.కానీ ఎలాంటిప్రయజోనం లేకపోయింది. ఆ యువతికి ఫైన్ కట్టాల్సి వచ్చింది. ఇటీవలి కాలంలో యూకే పెరుగుతున్న ఉద్యోగుల వేధింపుల వ్యవహారం, వాటిపై నమోదవుతున్న కేసుల నేపధ్యంలో.. ఎలిజబెత్ కూడా హైలెట్ గా నిలిచింది.
మరో ఆసక్తికర కథనం: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్