By: ABP Desam | Updated at : 03 Jan 2022 01:38 PM (IST)
ఏపీలో రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఏపీలోనూ రాజకీయ పార్టీ పెడతారన్న ప్రచారానికి ఊతం ఇచ్చేలా వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీసులో జరిగిన ఓ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు ఏపీలో పార్టీ పెట్టబోతున్నట్లుగా వస్తున్న వార్తలపై స్పందించమని కోరారు. ఈ సందర్భంగా షర్మిల ఏపీలో పార్టీ ఎవరైనా పెట్టొచ్చు.. పెట్టకూడదన్న రూలేమీ లేదు కదా అని వ్యాఖ్యానించారు. మామూలుగా అయితే గతంలో తాను ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టనని.. తన రాజకీయ జీవితంపూర్తిగా తెలంగాణకే అంకితమని ప్రకటించారు. కానీ అనూహ్యంగా ఏపీలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టవచ్చని స్పందించడంతో ఆమె రాజకీయ విధానంలో కాస్త మార్పు వచ్చిందని అంచనా వేస్తున్నారు.
Also Read: వేర్వేరుగా ప్రార్థనలు.. నివాళులు... ! జగన్, విజయమ్మ మధ్య కూడా మాటల్లేవా ?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె అయిన షర్మిల మొదటి నుంచి జగన్ ప్రారంభించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశారు. వైఎస్ విజయలక్ష్మి గౌరవాధ్యక్షురాలిగా ఉన్నారు. షర్మిల పార్టీ పరంగా ఎలాంటి పదవులు తీసుకోలేదు కానీ పాదయాత్ర సహా ... ఎన్నికలు వచ్చిన ప్రతీ సారి ప్రచారం చేశారు., ఆ తర్వాత ఏమయిందో కానీ తెలంగాణలో పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. షర్మిల నిర్ణయం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నేరుగా మీడియాతోనే చెప్పారు. ఆమె రాజకీయాలతో తమకు సంబంధం లేదని తేల్చేశారు.
ఆ తర్వాత నుంచి జగన్ - షర్మిల మధ్య వ్యక్తిగత సంబంధాలు కూడా తగ్గిపోయాయని .. మాటల్లేవన్న ప్రచారం జరిగింది. ఇటీవల షర్మిల తెలంగాణలో పార్టీకి పెద్దగా ఆదరణ లభించకపోతూండటం..., ఇతర కారణాల వల్ల ఏపీలోనూ రాజకీయ పార్టీ పెట్టాలన్న ఆలోచన చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ఎవరూ నమ్మలేదు. ఎందుకంటే వైఎస్ విజయలక్ష్మి కూడా అనేక మార్లు తన ఇద్దరు బిడ్డరు... రెండు రాష్ట్రాల్లో రాజకీయం చేస్తారని.. ఒకరిపై ఒకరు రాజకీయం చేయరని చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతున్నట్లుగా కనిపిస్తోంది.
Also Read: వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకొద్దు.. త్వరలో పాదయాత్ర చేస్తా
అదే సమయంలో తెలంగాణలో పార్టీ కార్యక్రమాలను ఉద్దృతంగా కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించడానికి రైతు ఆవేదనా యాత్రను చేస్తున్నారు. అయితే పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. ఒమిక్రాన్ రూల్స్ కారమంగా చూపిస్తున్నారు. ఈ నెలాఖరు నుంచి ఆగిపోయినా ప్రజాప్రస్థానం పాదయాత్రను కూడా ప్రారంభించానుకుంటున్నారు. కానీ అనుమతి రావడం కష్టమే నని భావిస్తున్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Bharat Bandh : సీపీఎస్ రద్దు, కుల ఆధారిత జనాభా గణన డిమాండ్‌తో భారత్ బంద్
Don Dawood In Karachi: కరాచీలో దావూడ్ ఇబ్రహీం- ఈడీ విచారణలో చెప్పిన ఛోటా షకీల్ బావ
Karimnagar News: కరీంనగరం జిల్లా ప్రజలకు మరో గుడ్ న్యూస్- జూన్ 2 నుంచి అందుబాటులోకి సరికొత్త సాహస క్రీడ
Konseema Protest Live Updates: కోనసీమ జిల్లా అంతటా కర్ఫ్యూ- ఆందోళనతో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త
Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !
Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?
Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!
Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరపై..!
KTR In Davos: తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఆశీర్వాద్ పైప్స్ తయారీ ప్లాంట్ - విదేశాలకు ఎగుమతి చేసేలా ప్లానింగ్