Secunderabad News: మటన్, మందు విషయంలో ఫ్రెండ్ హత్య! కత్తితో దాడి, అక్కడికక్కడే దుర్మరణం
Secunderabad Latest News: నిందితుడు చారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తుకారాంగేట్ పోలీసులు తెలిపారు.
![Secunderabad News: మటన్, మందు విషయంలో ఫ్రెండ్ హత్య! కత్తితో దాడి, అక్కడికక్కడే దుర్మరణం Secunderabad man stabes friend near tukaram gate Secunderabad News: మటన్, మందు విషయంలో ఫ్రెండ్ హత్య! కత్తితో దాడి, అక్కడికక్కడే దుర్మరణం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/15/fd23ccf0de75f2024ea46396a2a12f531705313800169234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Hyderabad Latest News: సికింద్రాబాద్ తుకారాం గేట్ పీఎస్ పరిధిలో అజయ్ అనే వ్యక్తి దారుణ హత్య గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్ బాయ్ బస్తీకి చెందిన చారి, పక్క ఇంట్లోనే అద్దెకు ఉంటున్న అజయ్ ని కూరగాయల కత్తితో పొడిచి చంపాడు. చారి మద్యం మత్తులో సైకోగా మారాడు. మటన్ తినే విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పచ్చి కూరగాయలు తింటూ, ఇంటి పక్కన ఉన్నవారి పైకి, మహిళల పైకి దాడికి పాల్పడ్డాడు. దీనిని అజయ్ అడ్డుకోవడంతో కూరగాయల కత్తితో అజయ్ కడుపులో పొడిచాడు. అజయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని గాంధీ మర్చరీకి తరలించారు.
నిందితుడు చారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తుకారాంగేట్ పోలీసులు తెలిపారు. మృతుడు అజయ్ పెళ్లి భరాత్ బ్యాండ్ కంపెనీలో పని చేస్తాడని, ఇటీవలనే పెళ్లి అయ్యిందని 8 నెలల కూతురు ఉందని స్థానికులు తెలిపారు. మహంకాళి ఏసీపీ రవీందర్ అధ్వర్యంలో ఇన్ స్పెక్టర్ ఆంజనేయులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎటువంటి ఆవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)