News
News
X

SC on Freebies: ఉచిత హామీలు ఇవ్వకుండా అడ్డుకోలేం, సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

SC on Freebies: ఉచితహామీల అంశంపై సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

FOLLOW US: 

 SC on Freebies: 

ప్రజా ధనం ఎలా ఖర్చు పెడుతున్నారన్నదే ముఖ్యం: సుప్రీంకోర్టు

ఉచిత హామీలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఇప్పుడు దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా ఈ ఉచిత హామీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలనుఅడ్డుకోలేం"అని తేల్చి చెప్పింది. డీఎంకే పార్టీ వేసిన పిటిషన్‌ను విచారించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రజాసంక్షేమమే ప్రభుత్వాల విధి అని వెల్లడించింది. "ప్రజా ధనాన్ని ఎలా ఖర్చు పెడుతున్నారన్నదే ముఖ్యమైన విషయం. కానీ ఈ విషయంలో ఓ నిర్ణయానికి రావటం చాలా కష్టం. ఇలాంటి అంశాలను సుప్రీం కోర్టు పరిశీలిస్తుందా అన్న ప్రశ్నించుకోవాల్సి వస్తుంది" అని చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ వ్యాఖ్యానించారు. ఈ మధ్యే డీఎమ్‌కే పార్టీ ఉచిత హామీలపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను, ఉచిత హామీలుగా పరిగణించటం సరికాదని వాదించింది డీఎమ్‌కే. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం..అలా వ్యాఖ్యానించింది. ఈ ఉచిత హామీల అంశం తేల్చేందుకు ఓ కమిటీ వేయాలనుకుంటున్నట్టు సుప్రీం కోర్టు వెల్లడించింది. "ఉచిత హామీలు మాత్రమే ఎన్నికల్లో విజయాన్ని నిర్ణయిస్తాయని చెప్పటం సరికాదు. కొన్ని పార్టీలు ఎన్నో హామీలు ఇచ్చి కూడా విజయం సాధించ లేక పోతున్నాయి. ఉపాధి హామీ లాంటి పథకాలు పౌరులు గౌరవంగా జీవనం సాగించేందుకు ఉపకరిస్తున్నాయి" అని చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ అభిప్రాయపడ్డారు. 

ఈ అంశం సంక్లిష్టమవుతోంది: సుప్రీం కోర్టు 

"ఏది సరైన హామీ అని తేల్చుకోవటమే అసలు ప్రశ్న. విద్య, వైద్యం, తాగునీరు అందించటం ఉచిత హామీలుగా అనుకోవాలా? ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లను ఇవ్వటం ఉచితం అని పరిగణించాలా? ప్రజాధనాన్ని ఖర్చు చేసే సరైన మార్గమేదో అన్వేషించాలి. ఉచిత హామీల పేరుతో డబ్బు వృథా చేస్తున్నారని కొందరు వాదిస్తున్నారు. ఇంకొందరు అవి సంక్షేమ పథకాలు అని చెబుతున్నారు. ఈ భిన్న వాదనల వల్లే ఈ అంశం సమస్యాత్మకంగా మారుతోంది. ఇది తేల్చేందుకు ఓ కమిటీ అవసరమని భావిస్తున్నాం. దీనిపై సూచనలు ఇవ్వండి" అని పిటిషన్ దారులతో అన్నారు చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ. అంతకు ముందు కూడా...సుప్రీం కోర్టు ఇదే అంశంపై స్పందించింది. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఉచిత హామీలు, అసంబద్ధమైన వాగ్దానాలు ఇవ్వడంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది తీవ్రమైన అంశమని, దీనిపై ఓ వైఖరి తీసుకునేందుకు కేంద్రం ఎందుకు సంకోచిస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈఅంశంపై కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించింది. 

" ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఫ్రీ హామీలపై కేంద్రం ఎందుకు మౌనం వహిస్తోంది? మీరు ఎందుకు ఓ స్టాండ్ తీసుకోవట్లేదు? ఈ విషయంలో మీరు చేసేదేమీ లేదనీ, ఈసీ ఒక నిర్ణయం తీసుకోవాలని ఎందుకు చెప్పరు? అసలు కేంద్ర ప్రభుత్వం దీనిని తీవ్రమైన విషయంగా పరిగణిస్తోందా, లేదా అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరొక నిర్ణయం తీసుకోండి. అప్పుడు ఈ ఉచితాలు కొనసాగాలా, వద్దా అనేది మేం నిర్ణయిస్తాం. దీనిపై సవివరంగా ప్రమాణపత్రం దాఖలు చేయండి.                                                             "
-సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ

ఈ మేరకు కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ కె.ఎం.నటరాజ్‌ను సీజేఐ ధర్మాసనం ఆదేశించింది. 

Published at : 17 Aug 2022 02:29 PM (IST) Tags: DMK Freebies Tamilnadu Supreme Court Political Parties Promises

సంబంధిత కథనాలు

Weather Latest Update: నేడు ఈ జిల్లాలకు వర్షం ఎలర్ట్! ఈ రెండ్రోజులు దంచికొట్టనున్న వానలు

Weather Latest Update: నేడు ఈ జిల్లాలకు వర్షం ఎలర్ట్! ఈ రెండ్రోజులు దంచికొట్టనున్న వానలు

Petrol-Diesel Price, 6 October: పెట్రోల్, డీజిల్ ధరల్లో కొనసాగుతున్న హెచ్చుతగ్గులు - మీ ప్రాంతంలో నేటి రేట్లు ఇవీ

Petrol-Diesel Price, 6 October: పెట్రోల్, డీజిల్ ధరల్లో కొనసాగుతున్న హెచ్చుతగ్గులు - మీ ప్రాంతంలో నేటి రేట్లు ఇవీ

Gold-Silver Price: బెంబేలెత్తిస్తున్న పసిడి ధర - నేడు మరింత పైపైకి, పండగ వేళ డిమాండే కారణమా?

Gold-Silver Price: బెంబేలెత్తిస్తున్న పసిడి ధర - నేడు మరింత పైపైకి, పండగ వేళ డిమాండే కారణమా?

ABP Desam Top 10, 6 October 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 6 October 2022:  ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

MSME Recruitment: ఎంఎస్ఎంఈ ఇంజినీర్ పోస్టులకు నోటిఫికేషన్, అర్హతలివే!

MSME Recruitment: ఎంఎస్ఎంఈ ఇంజినీర్ పోస్టులకు నోటిఫికేషన్, అర్హతలివే!

టాప్ స్టోరీస్

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

RRR For Oscars : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది!

RRR For Oscars : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది!

Bigg Boss 6 Telugu Episode 32: సూర్య అంటే ఇష్టం, తన క్రష్ అని చెప్పేసిన ఇనయా, మరి సూర్యకు?

Bigg Boss 6 Telugu Episode 32: సూర్య అంటే ఇష్టం, తన క్రష్ అని చెప్పేసిన ఇనయా, మరి సూర్యకు?

66 మంది చిన్నారులు మృతి - భారత్‌ దగ్గుమందు తయారీ సంస్థకు డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్

66 మంది చిన్నారులు మృతి - భారత్‌ దగ్గుమందు తయారీ సంస్థకు డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్