Sansad TV Hacked: సంసద్ టీవీ యూట్యూబ్ ఛానల్ హ్యాక్- సర్కార్ సంగతే ఇలా ఉంటే సామాన్యుడి గతేంటో!
పార్లమెంటు కార్యకలాపాలను అందించే సంసద్ టీవీ యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయింది.
ప్రభుత్వానికి చెందిన సంసద్ టీవీ యూట్యూబ్ ఛానల్‌ను యూట్యూబ్ నిలిపివేసింది. లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలను ఈ ఛానల్ అందిస్తోంది. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను అతిక్రమించినందుకే నిషేధం విధించినట్లు ఆ సంస్థ పేర్కొంది. అయితే తమ యూట్యూబ్ ఛానల్‌ను ఎవరో హ్యాక్ చేశారని సంసద్ టీవీ అధికారిక ప్రకటన చేసింది.
నిషేధం ఉంది
ఛానల్ తిరిగి రీస్టోర్ అయినప్పటికీ యూట్యూబ్ మార్గదర్శకాలను అతిక్రమించినందుకు నిషేధం ఇంకా కొనసాగుతోంది. ఇండియన్ కంప్యూటర్ ఎమెర్జెన్సీ టీమ్ (CERT-In) ఈ మేరకు పేర్కొంది. త్వరలోనే భద్రతా ముప్పును శాశ్వతంగా పరిష్కరిస్తామని యూట్యూబ్ వెల్లడించినట్లు తెలిపింది.
అయితే ప్రభుత్వ యూట్వూబ్ ఛానలే హ్యాక్ చేసేస్తే సామాన్యుడి గతేంటోనని నెటిజెన్లు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.
సంసద్ టీవీ
పార్లమెంట్ సంబంధిత వార్తలను ప్రసారం చేసే లోక్‌సభ టీవీ, రాజ్యసభ టీవీ రెండింటిని కలుపుతూ.. కొత్త ఛానెల్‌ను తీసుకురావాలనే నిర్ణయంతో ఏర్పాటైందే ఈ సంసద్ టీవీ. నిజానికి దీనిపై గత ఏడాది జూన్‌లోనే నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
Also Read: Fodder Scam Case: లాలూ మళ్లీ జైలు- ఆ కుంభకోణం కేసులో దోషిగా తేల్చిన కోర్టు