YSRCP : వైఎస్ఆర్‌సీపీకి మరో బిగ్ షాక్ - రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య రాజీనామా - ఆమోదం కూడా !
Jagan : రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పదవికి , వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ వెంటనే ఆమోదించారు.
R Krishnaiah has resigned from Rajya Sabha : వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ కు ఊహించని షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య తన పదవికి. వైసీపీకి రాజీనామా చేశార ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ కు రాజీనామాలేఖ ఇచ్చారు. రాజ్యసభ చైర్మన్ వెంటనే రాజీనామాను ఆమోదించారు. ఆ పోస్టు కాళీ అయిందని గెజిట్ విడుదల చేశారు.
వంద బీసీ సంఘాలతో సమావేశమై రాజీనామా నిర్ణయం తీసుకున్నానని ఆర్.కృష్ణయ్య చెబుతున్నారు. రెండేళ్ల కిందట ఆయన వైసీపీ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే మరో నాలుగేళ్ల పదవీ కాలం ఉండగానే రాజీనామా చేశారు. ఆయన భారతీయ జనతా పార్టీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ తరపున మళ్లీ రాజ్యసభకు ఎన్నికయ్యేలా హామీ లభించినందున రాజీనామా చేసినట్లుగా భావిస్తున్నాయి.
రాజ్యసభలో వైసీపీ ఇటీవలి కాలం వరకూ పదకొండు మందిసభ్యులు ఉండేవారు. ముగ్గురు రాజీనామా చేయడంతో ఆ సంఖ్య ఎనిమదికి పడిపోయింది. కొద్ది రోజుల కిందట మోపిదేవి వెంకట రమణారావు, బీద మస్తాన్ రావు రాజీనామాలు చేశారు. ఇప్పుడు వారి బాటలోనే ఆర్.కృష్ణయ్య వెళ్లారు. కొంత కాలంగా ఆర్ కృష్ణయ్య పార్టీ మార్పుపై చర్చలు జరుగుతున్నాయి. కానీ ఆయన మాత్రం.. జగన్ ను విదిలి పెట్టే ప్రసక్తే లేదని గంభీరంగా ప్రకటిస్తున్నారు. కానీ అనూహ్యంగా.. బీసీ సంఘాలతో కలిసి చర్చించి రాజీనామా నిర్ణయం తీసుకున్నానని ఆయన వైదొలిగారు. బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తానని ఆయన అంటున్నారు.
వెంటాడుతున్న మరో కేసు - రఘురామ కేసులో ముందస్తు బెయిల్‌కు నో - ఆ పాల్‌తో పాటు జగన్‌నూ ?
ఆర్ కృష్ణయ్య బీసీ సంఘాల నేతగాపేరు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరారు. ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన ఎల్బీనగర్ నుంచి పోటీ చేయించింది. ఆయన గెలిచారు కానీ.. టీడీపీ అధికారం పొందలేదు. ఆ తర్వాత ఎన్నికలకు కాంగ్రెస్‌లో చేరి మిర్యాలగూడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత వైసీపీ ఏ సమీకరణాలు చూసిందో కానీ.. పిలిచి టిక్కెట్ ఇవ్వడంతో.. ఆయన ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడయ్యారు. అందుకే ఏపీలో జగన్ ను సంఘసంస్కర్తగా పొగుడుతూ ఉండేవారు. కాీ హఠాత్తుగా రాజీనామా చేయడంతో వైసీపీకి షాక్ ఇచ్చినట్లయింది.
హీరోయిన్ జెత్వానీపై ముగ్గురు ఐపీఎస్‌ల కుట్ర - కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
వైసీపీకి మరికొంత మంది రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. రాజీనామాలు చేసినా వైసీపీకి ఒక్క రాజ్యసభ సీటు కూడా దక్కే అవకాశం లేదు. మరికొంత మంది పేర్లు ప్రచారంలోకి వస్తున్నా.. వారు గతంలో వైసీపీ ఆఫీసులో ప్రెస్మీట్లు పెట్టి తాము పార్టీ వీడిపోవడం లేదని.. పార్టీకి విధేయంగా ఉంటామని ప్రకటించారు. అలా ప్రకటించిన కృష్ణయ్య కూడా రాజీనామా చేయడంతో వైసీపీలో గుబులు ప్రారంభమయింది.