Bandlagooda Private School: ప్రైవేట్ స్కూల్ అత్యుత్సాహం - అయ్యప్ప మాల ధరించిన బాలికను అనుమతించని యాజమాన్యం
Rangareddy News: ఓ బాలిక అయ్యప్ప మాల ధరించగా ఆమెను స్కూల్ యాజమాన్యం లోపలికి అనుమతించలేదు. స్కూల్ డ్రెస్ లోనే రావాలని తేల్చిచెప్పింది. దీనిపై బాలిక తండ్రి ఆందోళనకు దిగారు.
School Management Not allowed Girl Child who Wear Ayyappa Mala: రంగారెడ్డి (Rangareddy) జిల్లా రాజేంద్రనగర్ (Rajendra Nagar) బండ్లగూడలో (Bandlagooda) ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అత్యుత్సాహం ప్రదర్శించింది. అయ్యప్ప మాల వేసుకున్న ఓ చిన్నారిని లోపలికి అనుమతించలేదు. స్కూల్ డ్రెస్ లోనే రావాలని తేల్చిచెప్పింది. ఈ క్రమంలో సదరు బాలిక గంట పాటు బయట ఎండలోనే నిలబడాల్సి వచ్చింది. దీనిపై తండ్రికి సమాచారం ఇవ్వగా, తన కుమార్తెను ఎందుకు లోపలికి రానివ్వరు అంటూ అతను పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. స్కూల్ డ్రెస్ ఉంటేనే అనుమతిస్తామని, అయ్యప్ప మాల ఆ డ్రెస్ లో ఉంటే అనుమతించమని స్పష్టం చేసింది. దీనిపై బాలిక తండ్రి ఆందోళనకు దిగారు. ఈ తతంగాన్ని మొబైల్ లో రికార్డు చేయడానికి యత్నించగా, ఈ రికార్డింగులు స్కూల్ లో చెల్లవంటూ స్కూల్ యాజమాన్యం బెదిరింపులకు దిగినట్లు బాలిక తండ్రి ఆరోపించారు.
రంగారెడ్డి - రాజేంద్రనగర్ బండ్లగూడలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అత్యుత్సాహం
— Telugu Scribe (@TeluguScribe) December 11, 2023
అయ్యప్ప మాల వేసుకుంటే స్కూల్ లోకి నో ఎంట్రీ.. స్కూల్ డ్రెస్ ఉంటేనే స్కూల్ లోకి అనుమతి అంటూ చిన్నారిని తోసేసిన యాజమాన్యం.
గంట పాటు ఎండలోనే నిలబడ్డ చిన్నారి. తన తండ్రి సమాచారం ఇచ్చిన యాజమాన్యం.
స్కూల్… pic.twitter.com/pxRi57u9qR