Raipur Blast: రాయ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో పేలుడు... నలుగురు సీఆర్పీఎఫ్ సిబ్బందికి గాయాలు
రాయ్‌పూర్‌లో రైల్వే స్టేషన్‌లో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో నలుగురు సీఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. డిటోనేటర్ల బాక్స్ ఫ్లోర్ పై పడి పేలుడు సంభవించినట్లు రాయ్ పూర్ పోలీసులు భావిస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో శనివారం ఉదయం పేలుడు సంభవించింది. సీఆర్‌పీఎఫ్ స్పెషల్ ట్రైన్‌లో ఇగ్నిటర్‌సెట్ ఉన్న బాక్సు కిందపడి పేలిపోయింది. ఈ ఘటనలో నలుగురు సెంట్రల్ రిజర్వడ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) సిబ్బందికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన జవాన్లను రాయ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. శనివారకం ఉదయం 6.30 సమయంలో జార్సుగూడ నుంచి జమ్మూతావి వెళ్తోన్న రైలు ప్లాట్‌ఫామ్ మీద ఆగిన సమయంలో ఈ పేలుడు సంభవించింది.
Also Read: ఎంపీ డేవిడ్ అమీస్ హత్య ఉగ్రవాదుల పనే.. లండన్ పోలీసుల ప్రకటన !
నలుగురికి గాయాలు
శనివారం ఉదయం రాయ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో డిటోనేటర్‌ను మార్చే సమయంలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో నలుగురు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) సిబ్బంది గాయపడ్డారు. సీఆర్‌పీఎఫ్ వర్గాల సమాచారం ప్రకారం శనివారం ఉదయం 6.30 గంటలకు రాయ్ పూర్ రైల్వే స్టేషన్‌లో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 122 బెటాలియన్ జమ్మూ వెళ్లే రైలు ఎక్కేందుకు వెళ్తున్నారు. ఈ సమయంలో ప్రత్యేక రైలులో ఇగ్నిటర్ సెట్ ఉన్న బాక్స్ పడడంతో పేలుడు సంభవించిందని ప్రాథమికంగా తెలుస్తోంది.
Chhattisgarh | Four CRPF personnel injured in an explosion caused after a box containing igniter set fell on the floor in a CRPF Special Train at Raipur railway station, says Raipur Police
— ANI (@ANI) October 16, 2021
Also Read: దేశంలో తగ్గిన కరోనా కేసులు... తాజాగా 15,981 కేసులు, 166 మరణాలు... సగానికి పైగా కేరళలోనే
పేలుడుపై దర్యాప్తు
గాయపడిన సిబ్బందిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. "హెడ్ కానిస్టేబుల్ వికాస్ చౌహాన్ తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆయన ప్రమాదవశాత్తు కింద పడడంతో అతని వద్ద నుంచి డిటోనేటర్ బాక్సు నేలపై పడింది. దీంతో పేలుడు సంభవించింది. ముగ్గురు సిబ్బందికి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రథమ చికిత్స తర్వాత వారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వారు రైలు ఎక్కారు" అని అధికారి చెప్పారు . "సీఆర్‌పిఎఫ్ సీనియర్ అధికారులు, స్థానిక పోలీసులు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు" అని ఆయన చెప్పారు.
Also Read: సూక్ష్మ కళలో సిద్ధహస్తుడు.. నెల్లూరు ముసవీర్..
Also Read: బంగ్లాదేశ్‌లో దసరా వేడుకలు రక్తసిక్తం.. ఇస్కాన్ టెంపుల్‌పై దాడి.. భక్తులకు గాయాలు