News
News
X

MP David Murder : ఎంపీ డేవిడ్ అమీస్ హత్య ఉగ్రవాదుల పనే.. లండన్ పోలీసుల ప్రకటన !

బ్రిటన్‌లో ఎంపీని చర్చిలో హత్య చేయడం కలకలం రేపుతోంది. ఈ ఘటన వెనుక ఉగ్రవాద హస్తం ఉందని పోలీసులు ప్రకటించారు.

FOLLOW US: 

బ్రిటన్‌ పార్లమెంట్ సభ్యుడు సర్ డేవిడ్ అమీస్‌ను హత్య చేయడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇది ఉగ్రవాద చర్యేనని లండన్ పోలీసులు ప్రకటించారు. ఈ హత్యకు పాల్పడిన పాతికేళ్ల యువకుడిని లండన్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆ యువకుడి ఇంటితో పాటు మరో చోట సోదాలు చేసి కీలకమైన సమచారాన్ని సేకరించారు. ఉగ్రవాద కోణంలోనే హత్య జరిగిందని బ్రిటన్ పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు రావడంతో ఎంపీలదంరికీ భద్రత పెంచారు. ఇప్పటి వరకూ ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఈ హత్యకు తాము కారణం అని ప్రకటించుకోలేదు. అలాగే ఎంపీ హత్యలో ఒక్కరే పాల్గొన్నారు. అతను కూడా ఫలానా ఉగ్రవాద గ్రూపునకు చెందిన వ్యక్తి అని పోలీసులు నిర్ధారించలేదు. ఎంపీ హత్య వెనుక భారీ కుట్ర ఉందని లండన్ పోలీసులు అనుమానిస్తున్నారు. 

Also Read : బంగ్లాదేశ్‌లో దసరా వేడుకలు రక్తసిక్తం.. ఇస్కాన్ టెంపుల్‌పై దాడి.. భక్తులకు గాయాలు

సర్ డేవిడ్ అమీస్ 1983  నుంచి ఎంపీగా ఉన్నారు.  ఎసెక్స్‌లోని సౌంత్ ఎండ్ వెస్ట్ నుంచి డేవిడ్ అమీస్ పార్ల‌మెంట్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఆయనకు ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి. నేరుగా ప్రజల్ని కలుస్తూ ఉంటారు. హత్య జరిగిన సమయంలోనూ ఆయన ప్రజలతో మాట్లాడుతున్నారు. సమస్యలపై చర్చించేందుకు ఓచర్చిలో ఆయన సమావేశం పెట్టారు. దీనికి హాజరైన యువకుడు హఠాత్తుగా విరుచుకుపడ్డాడు. కత్తితో  విరుచుకుపడ్డాడు. విచక్షణా రహితంగా పొడిచాడు. దీంతో డేవిడ్ అమీస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. 

Also Read : 'దుర్గా మండపాలపై దాడులు చేసిన వారిని వదిలిపెట్టం'

నిందితుడ్ని  సోమాలియా మూలాలున్న బ్రిటన్ పౌరుడిగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఉగ్రవాద కుట్ర ఉందని తేలడంతో బ్రిటన్‌కు చెందిన కౌంటర్ టెర్రరిజం గ్రూప్ పని ప్రారంభించింది. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థల ప్రోత్సాహంతోనే ఈ ఘటన చోటు చేసుకుందేనేదనికి ప్రాథమిక ఆధారాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే ఎంపీలందరికీ భద్రత పెంచారు. గత ఐదేళ్ల కాలంలో బ్రిటన్‌లో ఎంపీ హత్యకు గురవడం రెండో సారి. 2016లో కూడా ఓ ఎంపీని హత్య చేశారు. 

Also Read: Aryan Khan: జైలు నుంచి వీడియో కాల్.. ఆర్యన్‌కు రూ.4,500 మనీ ఆర్డర్ పంపిన షారుక్!

సర్ డేవిడ్ అమీస్ .. అంతర్జాతీయ సమస్యలపైనా చురుకుగా స్పందించారు. ముఖ్యంగా జంతు స‌మ‌స్యలు, అబార్షన్లకు వ్యతిరేకంగా తన గళం వినిపిస్తారు. ఇది ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థల భావాజాలాలకు వ్యతిరేకం.  అందుకే ఆయన సంస్థల సానుభూతి పరులు ఆయనను టార్గెట్ చేసినట్లుగా భావిస్తున్నారు. బ్రిటన్ ఎంపీ హత్యతో ప్రపంచం మొత్తం నివ్వెపోయింది. ఈ ఘటనను ఖండించింది.  ఎంపీ కుటుంబానికి సంతాపం తెలిపింది. 

Also Read: Kandahar Mosque Blast: మసీదులో బాంబు పేలుడు.. 16 మంది మృతి!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 16 Oct 2021 10:51 AM (IST) Tags: Sir David Amess briton MP murder terrorist incident Sir David Amess killing was terrorist incident Met Police

సంబంధిత కథనాలు

నంద్యాల జిల్లాలో రామ్‌కో పరిశ్రమను ప్రారంభించిన సీఎం జగన్

నంద్యాల జిల్లాలో రామ్‌కో పరిశ్రమను ప్రారంభించిన సీఎం జగన్

IRCTC Scam Case: లాలూ ప్రసాద్ యాదవ్ విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి

IRCTC Scam Case: లాలూ ప్రసాద్ యాదవ్ విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి

Harsh Mahajan Joins BJP: కాంగ్రెస్‌కు భారీ షాక్- పార్టీకి గుడ్‌బై చెప్పిన మరో సీనియర్ నేత!

Harsh Mahajan Joins BJP: కాంగ్రెస్‌కు భారీ షాక్- పార్టీకి గుడ్‌బై చెప్పిన మరో సీనియర్ నేత!

Viral Video: వీడెవడండి బాబు, హైటెన్షన్ వైర్లపై సర్కస్ ఫీట్లు - చూసిన వారికి ముచ్చెమటలు

Viral Video: వీడెవడండి బాబు, హైటెన్షన్ వైర్లపై సర్కస్ ఫీట్లు - చూసిన వారికి ముచ్చెమటలు

SSC Delhi Police Recruitment: ఢిల్లీపోలీస్ హెడ్ కానిస్టేబుల్ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

SSC Delhi Police Recruitment: ఢిల్లీపోలీస్ హెడ్ కానిస్టేబుల్ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Raiway Zone Issdue : రైల్వే జోన్‌పై అసలు కేంద్రం ప్రకటన ఇదిగో - అనుమానాలన్నీ తీరిపోయినట్లేనా ?

Raiway Zone Issdue : రైల్వే జోన్‌పై అసలు కేంద్రం ప్రకటన ఇదిగో - అనుమానాలన్నీ తీరిపోయినట్లేనా ?

PD ACT Rajasingh : రాజాసింగ్‌కు మరో చాన్స్ - గురువారమే పీడీయాక్ట్ అడ్వయిజరీ బోర్డు భేటీ !

PD ACT Rajasingh :  రాజాసింగ్‌కు మరో చాన్స్ - గురువారమే పీడీయాక్ట్ అడ్వయిజరీ బోర్డు భేటీ !

Chiranjeevi : చిరు పుత్రోత్సాహం - రామ్ చరణ్ 15 ఇయర్స్ కెరీర్‌పై ట్వీట్

Chiranjeevi : చిరు పుత్రోత్సాహం - రామ్ చరణ్ 15 ఇయర్స్ కెరీర్‌పై ట్వీట్

Leharaayi Movie - Apsara Song : అప్సరస... అప్సరస... నా కంటే ఎందుకు పడ్డావే?

Leharaayi Movie - Apsara Song : అప్సరస... అప్సరస... నా కంటే ఎందుకు పడ్డావే?