అన్వేషించండి

Micro Art: సూక్ష్మ కళలో సిద్ధహస్తుడు.. నెల్లూరు ముసవీర్..

సెలబ్రేషన్ ఏదైనా, పండగ ఎలాంటిదైనా ఆయన చాలా ప్రత్యేకంగా చూపిస్తాడు. శుభాకాంక్షలు చెప్పడానికి.. ఆల్‌ది బెస్ట్ చెప్పడంలో ఆయనదే స్పెషల్ హ్యాండ్. ప్రతి అంశాన్ని సూక్ష్మంగా చూడటం ఆయనకు ఉన్న స్పెషాలిటీ.

బంగారు వస్తువులు కానీ, ఆభరణాలు కానీ అందరికీ కనిపించేలా, అందరూ గుర్తించేలా ఉండాలనుకుంటారు చాలామంది. కానీ నెల్లూరు నగరానికి చెందిన ముసవీర్ మాత్రం కంటికి కనిపించనంత సూక్ష్మమైన బంగారు వస్తువుల్ని, జ్ఞాపికలను తయారు చేస్తూ అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. ఈ సూక్ష్మ కళలో నెల్లూరు జిల్లాకే కాదు, ఆయన ఆంధ్రప్రదేశ్‌కే ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక సూక్ష్మ స్వర్ణ కళాకారుడు ముసవీర్ ఒక్కరే. 

క్రికెట్ వరల్డ్ కప్ బీజం వేసింది..

క్రికెట్‌ వరల్డ్ కప్ సందర్భంగా కప్ నమూనాను సూక్ష్మమైన జ్ఞాపికగా తయారు చేసి టీమ్ ఇండియాకి శుభాకాంక్షలు చెప్పడంతో ముసవీర్ సూక్ష్మ స్వర్ణ కళ వెలుగులోకి వచ్చింది. అప్పటి వరకు అందరు స్వర్ణకారులలాగే తాను కూడా ఆభరణాలు తయారు చేసేవాడు. ఆ తర్వాత మాత్రం అతను కేవలం సూక్ష్మమైన జ్ఞాపికల తయారీకే పరిమితం అయ్యారు. 

అన్ని పండగలకీ శుభాకాంక్షలు..

సంక్రాంతి అయినా, రంజాన్ అయినా, క్రిస్మస్ అయినా.. అన్ని మతాల పండగలకు తన జ్ఞాపికలతో శుభాకాంక్షలు చెబుతుంటారు ముసవీర్. నెల్లూరు పక్షుల పండగ సందర్భంగా ఆయన తయారు చేసిన ఫ్లెమింగోస్ కి అరుదైన గుర్తింపు లభించింది. ఇక కను రెప్పపై నిలబడేలా ఆయన తయారు చేసిన తాజ్ మహల్ నమూనా నిజంగా అద్భుతం. ఒకటి కాదు, రెండు కాదు... ఇలా వందలకొద్దీ సూక్ష్మ కళారూపాలను తయారు చేశారు, చేస్తున్నారు ముసవీర్. 

కళ.. కళ కోసమే.. 

ఇప్పటి వరకూ తాను తయారు చేసిన సూక్ష్మ కళారూపాలను ఎక్కడా ఎవరికీ అమ్మలేదు ముసవీర్. వాటికోసం చాలామంది తనను సంప్రదించినా.. అమ్మకానికి పెట్టలేదని, కళను అమ్ముకోబోనని చెబుతారాయన. ప్రభుత్వ సాయం ఉంటే.. తన కళారూపాలతో ఎగ్జిబిషన్ పెట్టాలనే ఆలోచన ఆయనకు ఉంది. 

అవార్డులు, రివార్డు లు లెక్కలేనన్ని.. 

సూక్ష్మ కళతో అందరి దృష్టినీ ఆకర్షించిన ముసవీర్ కి అవార్డులు, రివార్డులు లెక్కలేనన్ని వచ్చాయి. జిల్లా అధికార యంత్రాంగం నుంచి ఆయనకు సత్కారాలు కూడా దక్కాయి. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆయన సొంతం. 1 గ్రాము 400 మిల్లీగ్రాముల బరువు ఉండే బంగారంతో.. జాతీయ గీతంలోని అన్ని అక్షరాలను రూపొందించి అరుదైన రికార్డ్ సృష్టించారు ముసవీర్. ఇప్పటి వరకు 30 ప్రపంచ రికార్డులు సొంతం చేసుకున్నారు. గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాలనేదే తన జీవితాశయం అంటారు ముసవీర్.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Jio Airtel Best Plans: కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులుమాజీ ప్రధానికేనా.. నా తండ్రికి ఇవ్వరా? కాంగ్రెస్ తీరుపై ప్రణబ్ కుమార్తె ఆగ్రహంNasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Jio Airtel Best Plans: కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Bengaluru: మీరెక్కిన క్యాబ్ డ్రైవర్ నిద్రమత్తులో ఉంటే ఏం చేస్తారు? - ఈయన చేసింది మాత్రం వైరల్ అయింది !
మీరెక్కిన క్యాబ్ డ్రైవర్ నిద్రమత్తులో ఉంటే ఏం చేస్తారు? - ఈయన చేసింది మాత్రం వైరల్ అయింది !
Pawan Kalyan: 'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ
'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ
Manmohan Singh Last Rites: ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
Embed widget