కశ్మీరీ పండిట్‌లను అవమానించిన మీపై ఎందుకు వేటు వేయలేదు - ప్రధానిని ప్రశ్నించిన ప్రియాంక గాంధీ
Rahul Gandhi Disqualification: రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేయడంపై ప్రియాంక గాంధీ తీవ్రంగా స్పందించారు.
Rahul Gandhi Disqualification:
ట్విటర్‌లో విమర్శలు..
రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేయడంపై ప్రియాంక గాంధీ స్పందించారు. ట్విటర్‌లో ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. కోట్ల రూపాయలు దోచుకుంటున్న వాళ్లకు బీజేపీ అండగా నిలుస్తోందంటూ మండి పడ్డారు. ప్రశ్నించిన వారిపై ఇలా కేసులు పెడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.
"నీరవ్ మోదీ స్కామ్ - రూ.14,000 కోట్లు
లలిత్ మోదీ స్కామ్ - రూ.425 కోట్లు
మెహుల్ చోక్సీ స్కామ్ - రూ. 13,500 కోట్లు
ఇలా దేశ సంపదను దోచుకున్న వారిని బీజేపీ ఎందుకు రక్షించాలని చూస్తోంది...? విచారణ అంటేనే ఆ పార్టీ ఎందుకు భయపడుతోంది..? వీటిపై ప్రశ్నించిన వారిపై మాత్రం కేసులు పెడుతోంది. అవినీతి పరులకే బీజేపీ సపోర్ట్ ఇస్తోందా..? "
- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నేత
नीरव मोदी घोटाला- 14,000 Cr
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) March 24, 2023
ललित मोदी घोटाला- 425 Cr
मेहुल चोकसी घोटाला- 13,500 Cr
जिन लोगों ने देश का पैसा लूटा, भाजपा उनके बचाव में क्यों उतरी है? जांच से क्यों भाग रही है?
जो लोग इस पर सवाल उठा रहे हैं उन पर मुकदमे लादे जाते हैं।
क्या भाजपा भ्रष्टाचारियों का समर्थन करती है?
పార్లమెంట్‌లో కశ్మీరీ పండిట్ కమ్యూనిటీ కించపరుస్తూ ప్రధాని మాట్లాడారని, ఆయనపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు ప్రియాంక గాంధీ. ఇదేం న్యాయం అంటూ ప్రశ్నించారు.
"కశ్మీరీ పండిట్‌ల ఆచారం ప్రకారం..తండ్రి చనిపోయిన తరవాత కొడుకు తలపాగా చుట్టుకుంటారు. కానీ మీరు (ప్రధాని మోదీ) కశ్మీరీ పండిట్‌ల వర్గాన్ని కించపరిచారు. పార్లమెంట్ సాక్షిగా అవమానించారు. నెహ్రూ అనే ఇంటి పేరుని ఎందుకు పెట్టుకోలేదంటూ ఎగతాళి చేశారు. అప్పుడు ఏ జడ్జ్ కూడా స్పందించలేదు. మీపై అనర్హతా వేటు వేయలేదు. రాహుల్ గాంధీ నిజమైన దేశభక్తుడిగా ప్రశ్నించారు. అదానీ దేశ సంపదను దోచుకున్న విషయాన్ని ప్రస్తావించారు. పార్లమెంట్ కన్నా మీ స్నేహితుడు అదానీ మీకు ఎక్కువైపోయారా..? దీనిపై ప్రశ్నిస్తే అంత షాక్ అవ్వాలా..?"
- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నేత
भरी संसद में आपने पूरे परिवार और कश्मीरी पंडित समाज का अपमान करते हुए पूछा कि वह नेहरू नाम क्यों नहीं रखते…. लेकिन आपको किसी जज ने दो साल की सज़ा नहीं दी। आपको संसद से डिस्क्वालिफाई नहीं किया….
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) March 24, 2023
राहुल जी ने एक सच्चे देशभक्त की तरह अडानी की लूट पर सवाल उठाया...2/4
ప్రియాంకతో పాటు ప్రతిపక్ష నేతలు కూడా రాహుల్కు మద్దతుగా నిలిచారు. బీజేపీ నియంతృత్వంగా వ్యవహరిస్తోందని మండి పడ్డారు.
Also Read: Amritpal Singh News: భార్యను హౌజ్ అరెస్ట్ చేశాడు, తీవ్రంగా కొట్టే వాడు - అమృత్ పాల్పై నిఘా వర్గాల రిపోర్ట్