అన్వేషించండి

Amritpal Singh News: భార్యను హౌజ్ అరెస్ట్ చేశాడు, తీవ్రంగా కొట్టే వాడు - అమృత్ పాల్‌పై నిఘా వర్గాల రిపోర్ట్‌

Amritpal Singh News: అమృత్‌ పాల్ సింగ్ తన భార్యను హౌజ్ అరెస్ట్ చేసి తీవ్రంగా వేధించే వాడని నిఘా వర్గాల రిపోర్ట్ వెల్లడించింది.

Amritpal Singh News:

ఈ ఫిబ్రవరిలో పెళ్లి..

అమృత్‌ పాల్ సింగ్‌పై నిఘా వర్గాల రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దుబాయ్‌లో లగ్జరీ లైఫ్ గడిపే వాడని, థాయ్‌లాండ్‌కు తరచూ వెళ్లొచ్చే వాడని వెల్లడైంది. భార్య కిరణ్‌దీప్ కౌర్‌ను హౌజ్ అరెస్ట్ చేశాడని, తీవ్రంగా కొట్టేవాడని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వీరిద్దరికీ వివాహమైంది. అప్పటి నుంచి ఆమెను వేధిస్తూనే ఉన్నాడని చెప్పాయి. అమృత్‌కు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పంజాబ్ పోలీసులు అమృత్ భార్య కిరణ్‌దీప్ కౌర్‌ను ప్రశ్నించారు.  Waris Punjab De పార్టీకి ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయో విచారించారు. ఈ నెల 18న అమృత్ పాల్‌ను అరెస్ట్ చేసేందుకు ఆపరేషన్ మొదలు పెట్టారు. అప్పటి నుంచి పరారీలోనే ఉన్నాడు. ఈ ఇంటిలిజెన్స్ రిపోర్ట్‌లో మరి కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

రిపోర్ట్‌లోని అంశాలివే..

1. ఈ ఏడాది ఫిబ్రవరిలో కిరణ్‌దీప్ కౌర్‌ను వివాహం చేసుకున్నాడు అమృత్ పాల్ సింగ్. అప్పటి నుంచి ఆమెను ఇంట్లోనే నిర్బంధించాడు. కిరణ్‌దీప్ పంజాబ్‌లోనే పుట్టినా...ఆమె యూకేలో సెటిల్ అయ్యారు. 

2. అమృత్ పాల్ ఎప్పుడూ ఎవరితోనూ తన గతం గురించి మాట్లాడకుండా జాగ్రత్త పడేవాడు. 2002 వరకూ దుబాయ్‌లోనే ట్రక్‌ డ్రైవర్‌గా పని చేశాడు. ఇక్కడికి వచ్చిన వెంటనే రాజకీయాల్లోకి దిగిపోయాడు. వారిస్ పంజాబ్‌ దే పార్టీ చీఫ్‌గా ఎదిగాడు. 

3. అమృత్‌ పాల్ తరచూ థాయ్‌లాండ్‌కు వెళ్లాడు. మరో సంచలన విషయం ఏంటంటే...అక్కడ ప్రాస్టిట్యూషన్ చేసినట్టు అనుమానాలున్నాయి. అంతే కాదు. అక్కడ మరో మహిళతో సంబంధం పెట్టుకున్నట్టూ తెలుస్తోంది. 

4. భారత్‌లో ఉన్నప్పుడు సిక్కు సంప్రదాయాలు పాటించే అమృత్ పాల్...విదేశాలకు వెళ్లినప్పుడు మాత్రం వాటిని పట్టించుకోడు. 

5. దుబాయ్‌లో ట్రక్‌ డ్రైవర్‌గా పని చేస్తూనే డ్రగ్ డీలర్స్‌తో లింక్స్ పెట్టుకున్నాడు. ఆ క్రమంలోనే జస్వంత్ సింగ్ అనే ఓ డ్రగ్ డీలర్‌తో పరిచయం ఏర్పడింది. పాకిస్థాన్‌ నుంచి వీళ్లు డ్రగ్స్‌ను సప్లై చేస్తున్నారు. 

అక్రమ సంబంధాలు..

ఈ కేసు విచారణలో ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అమృత్‌ పాల్‌ సింగ్ కొంత మంది అమ్మాయిలతో ఛాట్ చేసినట్టు దర్యాప్తులో తేలింది. వీరిలో పెళ్లైన మహిళలూ ఉన్నారు. మరో షాకింగ్ విషయం ఏంటంటే...వీరిలో కొంత మందిని బ్లాక్‌మెయిల్ కూడా చేశాడు. అమృత్ పాల్ సింగ్ ఛాట్‌, వాయిస్ నోట్స్‌ను పరిశీలించిన పోలీసులు..ఈ విషయం వెల్లడించారు. కొన్ని వాయిస్ నోట్స్‌లో "నాకు క్యాజువల్ రిలేషన్‌ అంటేనే ఇష్టం. మరీ అంత సీరియస్‌గా తీసుకోవద్దు. అమ్మాయిలు ఎందుకింత తొందరగా సీరియస్ రిలేషన్‌షిప్‌లోకి దిగిపోతారు" అని ప్రశ్నించినట్టుగా ఇండియా టుడే వెల్లడించింది. ఇదే సమయంలో మరో మహిళకు ఓ వాయిస్ నోట్ పంపినట్టు తెలిపింది. అందులో "నాకు సమస్యగా మారనంత వరకూ ఏ మహిళతో అయినా అఫైర్ పెట్టుకోవడానికి రెడీయే" అని అన్నాడు అమృత్ పాల్. ఇంతే కాదు. సోషల్ మీడియాలోనూ మహిళలతో ఛాటింగ్ చేసినట్టు ఆధారాలున్నాయి. "మన రిలేషన్ షిప్ కుదిరిందిగా. హనీమూన్‌కు దుబాయ్‌ వెళ్దాం" అని మెసేజ్‌లు పంపినట్టు దర్యాప్తులో వెల్లడైంది. 

Also Read: Rahul Disqualification: రాహుల్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? న్యాయ పోరాటం ఫలిస్తుందా?

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులతో దిద్దించారు: చంద్రబాబు ధ్వజం
AP CM Chandrababu: గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులతో దిద్దించారు: చంద్రబాబు ధ్వజం
Breaking News: గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, ప్లంబర్లు, సెక్యూరిటీ గార్డులు దిద్దారు: చంద్రబాబు
గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు,సెక్యూరిటీ గార్డులు దిద్దారు: చంద్రబాబు
Historic Test Victory: సుతార్ 10 వికెట్ల మాయాజాలంతో లంక చిత్తు.. 165 రన్స్ తేడాతో భారత్ ఘనవిజయం, 600వ టెస్టులో టీమిండియా బంపర్ విక్టరీ!
సుతార్ 10 వికెట్ల మాయాజాలంతో లంక చిత్తు.. 165 రన్స్ తేడాతో భారత్ ఘనవిజయం, 600వ టెస్టులో టీమిండియా బంపర్ విక్టరీ!
Historic Cricket Diplomacy: కరాచీలో టెస్ట్ కావాలన్న ముషారఫ్.. అద్వానీ ఫోన్ కాల్ తో ఆగిన ప్లాన్, 2004 పాకిస్తాన్ టూర్ సీక్రెట్స్ పై తాజా బుక్ లో వెల్ల‌డి!
కరాచీలో టెస్ట్ మ్యాచ్ కావాలన్న ముషారఫ్.. అద్వానీ ఫోన్ కాల్ తో ఆగిన ప్లాన్, 2004 పాకిస్తాన్ టూర్ సీక్రెట్స్ పై తాజా బుక్ !

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Embed widget