Punjab Elections 2022: 'కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు.. కానీ ఆ చెత్త మాకొద్దు'
పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ అధికార కాంగ్రెస్ పార్టీలో కనీసం 25 మంది ఎమ్మెల్యేలు తనకు టచ్‌లో ఉన్నారని కేజ్రీవాల్ తెలిపారు. అయితే తన పార్టీలోకి చెత్తను తీసుకునేందుకు తాను సిద్ధంగా లేనని కేజ్రీ అన్నారు.
తాము చెత్త రాజకీయాలు చేసేందుకు సిద్ధంగా లేమని సీఎం కేజ్రివాల్ అన్నారు. పంజాబ్ సంపదను కాంగ్రెస్ దోచుకుంటోందని కేజ్రీవాల్ ఆరోపించారు. 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకొని ఇప్పుడు పంజాబ్‌లో కోశాగారం ఖాళీ అయిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నట్లు కేజ్రీ అన్నారు. తాము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ అవినీతిపై దర్యాప్తు చేసి పంజాబ్‌ను తిరిగి నిర్మిస్తామని కేజ్రీవాల్ అన్నారు.
వాగ్దానాలు..
పంజాబ్ విద్యారంగంలో సమూలమైన మార్పులు తెస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
కాంట్రాక్ట్ టీచర్లను పర్మినెంట్ చేస్తామని, బదిలీలు పారదర్శకంగా చేస్తామని, ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని కేజ్రీ వాగ్దానం చేశారు.
Also Read: Covid 19 3rd Wave: భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ వస్తుందా? నిపుణులు ఏమంటున్నారంటే?
Also Read: Central Vista Project: సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌పై మరో పిటిషన్ తిరస్కరణ.. ఇక లైన్ క్లియర్!
Also Read: Corona Cases: దేశంలో 543 రోజుల కనిష్ఠానికి రోజువారి కరోనా కేసులు
Also Read: గురుకుల స్కూల్‌లో కరోనా కలకలం.. 29 మంది విద్యార్థినులకు కొవిడ్ పాజిటివ్.. సిబ్బంది అలర్ట్
Also Read: Foods: ఎక్కువకాలం జీవించాలనుందా... అయితే ఇవి కచ్చితంగా తినండి
Also Read: ఒకే ఒక్కడు.. వెయ్యిమందిని కాపాడాడు.. కోవూరు ఎస్సైకి జనం జేజేలు