X

Nizamabad: కాసేపట్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత నామినేషన్.. కాంగ్రెస్, బీజేపీ పోటీకి దూరం, కారణం ఏంటంటే..

నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలో కవిత గెలుపు లాంఛనమే కానుంది. బీజేపీ, కాంగ్రెస్ లు పోటీకి దూరంగా ఉంటున్నాయి.

FOLLOW US: 

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత మొత్తానికి రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండనున్నట్లు తేలిపోయింది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు ఆమెకే కేటాయిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం మధ్యా్హ్నం 1.30 గంటలకు ఆమె నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. కవిత ప్రస్తుత శాసన మండలి సభ్యత్వం త్వరలో ముగియనుండగా.. మళ్లీ ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ఆమె ఆసక్తి చూపడంలేదనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్‌ను ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీఎం కేసీఆర్‌ ఖరారు చేయడంతో.. ఆయన స్థానంలో కవితను పంపిస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఇందుకు తగ్గట్టుగానే నిజామాబాద్‌ స్థానానికి సిటింగ్‌ ఎమ్మెల్సీ ఆకుల లలిత పేరు వినిపించింది. కానీ, టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఊహాగానాలకు తెరదించుతూ నిజామాబాద్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మళ్లీ కవిత పేరునే ఖరారు చేసింది. 

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయొద్దని బీజేపీ నిర్ణయించగా, కాంగ్రెస్‌ మాత్రం కొన్నిచోట్ల పోటీ చేయాలని, ఇంకొన్నిచోట్ల దూరంగా ఉండాలని భావిస్తోంది. నిజామాబాద్‌లో కాంగ్రెస్‌ ఒకవేళ పోటీ చేసినా.. సభ్యుల పరంగా టీఆర్‌ఎస్‌కు భారీ మెజారిటీ ఉండడంతో కవిత విజయం బాగా సులువు కానుంది. బల ప‌రీక్షకు కూడా క‌నీసం ద‌రిదాపుల్లో లేన‌ప్పుడు అన‌వ‌స‌రంగా పోటీకి దిగి మ‌రింత బ‌ల‌హీన ప‌డటం ఎందుక‌నే అభిప్రాయానికి కాంగ్రెస్, బీజేపీ వచ్చినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి క‌విత‌కు అధిష్ఠానం అవ‌కాశం ఇచ్చింది. 23వ తేదీన కవిత మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేల‌తో క‌లిసి నామినేష‌న్ దాఖ‌లు వేయ‌నున్నారు.

ఓట్ల తీరిది..
ఉమ్మడి జిల్లాలో 820 ఓట్లున్నాయి. ఇందులో కాంగ్రెస్‌కు 44, బీజేపీకి 54 ఉన్నాయి. ఈ ఇద్దరివి క‌లిసినా వంద ఓట్లు కూడా లేవు. మిగిలిన 720 బ‌లం టీఆర్ఎస్‌కు ఉంది. క‌నీసం పోటీకి ద‌రిదాపుల్లో కూడాలేవు. దీంతో రెండు జాతీయ పార్టీలు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. పోటీ చేసి టీఆర్ఎస్ లోక‌ల్ బాడీ లీడ‌ర్లకు తాయిలాలు ఇప్పించేందుకు దోహ‌ప‌డ‌టంతో పాటు ఉన్న పార్టీ నేత‌లు జంప్ కాకుండా వారికి ఖ‌ర్చు పెట్టి కాపాడుకోవ‌డం అవ‌స‌ర‌మా..? అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: గురుకుల స్కూల్‌లో కరోనా కలకలం.. 29 మంది విద్యార్థినులకు కొవిడ్ పాజిటివ్.. సిబ్బంది అలర్ట్

Also Read: Foods: ఎక్కువకాలం జీవించాలనుందా... అయితే ఇవి కచ్చితంగా తినండి  
Also Read: ఒకే ఒక్కడు.. వెయ్యిమందిని కాపాడాడు.. కోవూరు ఎస్సైకి జనం జేజేలు 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండిTags: nizamabad MLC Kavitha Kalvakuntla Kavitha Nizamabad Latest Nizamabad Update nizamabad mlc election

సంబంధిత కథనాలు

Nizamabad వరి పంట వైపే మొగ్గుచూపుతున్న జిల్లా రైతులు

Nizamabad వరి పంట వైపే మొగ్గుచూపుతున్న జిల్లా రైతులు

Nizamabad: ప్రజల కోసం పనిచేసే నాయకులకు మద్దతివ్వండి: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Nizamabad: ప్రజల కోసం పనిచేసే నాయకులకు మద్దతివ్వండి: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Nizamabad: వీఆర్ఏ గౌతమ్ మృతి.. ఇసుక మాఫియాపై ఫ్యామిలీ అనుమానం

Nizamabad: వీఆర్ఏ గౌతమ్ మృతి.. ఇసుక మాఫియాపై ఫ్యామిలీ అనుమానం

Nizamabad: గల్ఫ్ నుంచి వచ్చిరాగానే మృత్యు ఒడికి చేరిన యువకుడు

Nizamabad: గల్ఫ్ నుంచి వచ్చిరాగానే మృత్యు ఒడికి చేరిన యువకుడు

BR Ambedkar Death Anniversary: అంటరానితనంపై ఎక్కుపెట్టిన ఆయుధం బీఆర్ అంబేద్కర్.. ఆ బానిసలే మేలన్న రాజ్యాంగ నిర్మాత

BR Ambedkar Death Anniversary: అంటరానితనంపై ఎక్కుపెట్టిన ఆయుధం బీఆర్ అంబేద్కర్.. ఆ బానిసలే మేలన్న రాజ్యాంగ నిర్మాత
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

CDS Bipin Rawat Chopper Crash: బిపిన్ రావత్.. ఆర్మీ లెజెండ్.. వెన్నుచూపని యోధుడు!

CDS Bipin Rawat Chopper Crash: బిపిన్ రావత్.. ఆర్మీ లెజెండ్.. వెన్నుచూపని యోధుడు!

CDS Bipin Rawat Chopper Crash Live: గురువారం ఢిల్లీకి రావత్ దంపతుల మృతదేహాలు.. శుక్రవారం అంత్యక్రియలు

CDS Bipin Rawat Chopper Crash Live: గురువారం ఢిల్లీకి రావత్ దంపతుల మృతదేహాలు.. శుక్రవారం అంత్యక్రియలు

Saiteja Helicopter Crash : త్రివిధ దళాల అధిపతికే రక్షకుడు..కానీ దురదృష్టం వెంటాడింది..! కన్నీరు పెట్టిస్తున్న సాయితేజ మరణం...

Saiteja Helicopter Crash :  త్రివిధ దళాల అధిపతికే రక్షకుడు..కానీ దురదృష్టం వెంటాడింది..!  కన్నీరు పెట్టిస్తున్న సాయితేజ మరణం...

Mi 17V Helicopter : వరల్డ్ బెస్ట్ హెలికాఫ్టర్లలో ఒకటి Mi-17V-5 ..! మరి ప్రమాదం ఎలా జరిగింది ?

Mi 17V Helicopter :  వరల్డ్ బెస్ట్ హెలికాఫ్టర్లలో ఒకటి Mi-17V-5 ..! మరి ప్రమాదం ఎలా జరిగింది ?