అన్వేషించండి

Prakasam Politics: ప్రకాశం జిల్లాలో వైసీపీకి కష్టాలు! స్థానాల మార్పుతో మరింత గందరగోళం

YSRCP Prakasam Politics: ప్రకాశం జిల్లాలో ఇప్పటికే పార్టీ అంతర్గత రాజకీయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఇప్పుడు ఇన్ చార్జ్ ల మార్పు తర్వాత ఈ పరిస్థితి మరింత దిగజారుతుందో లేక మెరుగు పడుతుందో చూడాలి. 

YSRCP Politics: యర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలపు సురేష్ ఇప్పుడు కొండెపి నియోజకవర్గ ఇన్ చార్జ్.. 
వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న మేరుగ నాగార్జున ఇప్పుడు సంతనూతలపాడు ఇన్ చార్జ్..
ఈ రెండు నియామకాలతో ప్రకాశం జిల్లాలో వైసీపీ అంతర్గత రాజకీయం మరింత గందరగోళంగా మారింది. కొండెపిలో టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామిని ఓడించేందుకు మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్ ని అక్కడికి పంపించారని అనుకున్నా.. ఆయన ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న యర్రగొండపాలెంకు ఎవరినీ ఇన్ చార్జ్ గా వేయకపోవడం విశేషం. ఇక సంతనూతలపాడుకి కొత్త ఇన్ చార్జ్ గా మంత్రి మేరుగ నాగార్జునను పంపించడంతో అక్కడ ఉన్న వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. ఈ మార్పుతో మేరుగ నాగార్జున నియోజకవర్గం వేమూరుకి కొత్త ఇన్ చార్జ్ రావడం విశేషం. మొత్తమ్మీద వైసీపీ అంతర్గత రాజకీయాలు మరింత గందరగోళానికి దారితీశాయనే చెప్పాలి. 

ఇప్పటికే ప్రకాశం జిల్లాలో వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి వైసీపీకి మంటపెడుతున్నారు. తన వ్యాఖ్యలతో అధినేతకు చికాకు కలిగిస్తున్నారు. ఆయనకు ప్రస్తుత జిల్లా మంత్రి ఆదిమూలపు సురేష్ కి అస్సలు పడటంలేదు. బాలినేనికి కూడా టికెట్ డౌట్ అనుకుంటున్న సందర్భంలో కొత్తగా మరికొన్ని నియోజకవర్గాల్లో ఇన్ చార్జ్ ల మార్పు కలకలం రేపింది. 

ఉమ్మడి ప్రకాశం లోని 12 స్థానాల్లో గత ఎన్నికల్లో టీడీపీ 4 స్థానాలు కైవసం చేసుకుంది. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, వైసీపీ వైపు రావడంతో ప్రస్తుతం ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలున్నారు. మిగతా చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా.. ఎన్నికల నాటికి పరిస్థితులు అంత సానుకూలంగా కనపడటంలేదు. అందుకే సీఎం జగన్ ఈ ఫార్ములా ప్రయోగించారు. రెండు స్థానాలకు ఇన్ చార్జ్ లను ప్రకటించారు సీఎం జగన్. ఆ రెండు స్థానాలతోపాటు మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న యర్రగొండపాలెం కూడా ఇప్పుడు సందిగ్ధంలో పడింది. ప్రస్తుతానికి అక్కడ ఇన్ చార్జ్ గా ఎవరినీ ప్రకటించలేదు. అలాగని మంత్రి సురేష్ ఆ నియోజకవర్గ బాధ్యతలు చూసుకుంటారని కూడా చెప్పలేం. ఆయనకు కొత్తగా కొండెపి బాధ్యతలు అప్పగించడంతో ఎన్నికల ఏడాదిలో అక్కడ తన టీమ్ ని సిద్ధం చేసుకోడానికి సురేష్ ప్రయత్నాలు ప్రారంభించారు. 

ఎందుకీ మార్పులు..?
ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో సిట్టింగ్ లకు అధిక సీట్లిచ్చి దెబ్బతిన్నారు కేసీఆర్. ఏపీలో కూడా అలాంటి ఫలితాలు పునరావృతమవుతాయనే అనుమానం జగన్ లో ఉంది. అందుకే ఆయన ఇన్ చార్జ్ ల పేరుతో అభ్యర్థులను మార్చేస్తున్నారు. కొత్త అభ్యర్థులను కొన్నిచోట్ల తెరపైకి తెస్తుండగా, మిగతా చోట్ల ఉన్నవారినే అటు ఇటు మారుస్తున్నారు. ఈ ప్రయోగం ఈసారి ఫలిస్తుందో లేదో చూడాలి. అయితే ప్రకాశం జిల్లాలో ఇప్పటికే పార్టీ అంతర్గత రాజకీయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఇప్పుడు ఇన్ చార్జ్ ల మార్పు తర్వాత ఈ పరిస్థితి మరింత దిగజారుతుందో లేక మెరుగు పడుతుందో చూడాలి. ప్రస్తుతానికయితే.. జగన్ ప్రయోగం ప్రకాశం జిల్లాలో మరింత గందరగోళం సృష్టించిందనే చెప్పాలి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Embed widget