PM Modi UAE Visit: ప్రధాని నరేంద్ర మోదీ యూఏఈ పర్యటన వాయిదా.. కారణమిదే!
2022 జనవరి 6న షెడ్యూల్ అయిన ప్రధాని మోదీ యూఏఈ పర్యటన వాయిదా పడింది.
![PM Modi UAE Visit: ప్రధాని నరేంద్ర మోదీ యూఏఈ పర్యటన వాయిదా.. కారణమిదే! PM Narendra Modi UAE visit January 2022 postponed amid Covid 19 Variant Omicron concerns- Report PM Modi UAE Visit: ప్రధాని నరేంద్ర మోదీ యూఏఈ పర్యటన వాయిదా.. కారణమిదే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/27/af4a4736d16fd8820881b8ea9ec6eed4_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఒమిక్రాన్ ఆందోళనల కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ.. యూఏఈ పర్యటన వాయిదా పడింది. 2022 జనవరి 6న ఆయన యూఏఈ వెళ్లాల్సి ఉంది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ విజృంభిస్తోండటంతో ఈ పర్యటన వాయిదా వేసినట్లు కేంద్రం ప్రకటించింది.
Prime Minister Narendra Modi's visit to UAE postponed. PM Modi was scheduled to visit the UAE on Jan 6: Sources
— ANI (@ANI) December 29, 2021
(File pic) pic.twitter.com/G1AUCp6Dbn
భారత్-యూఏఈ మధ్య దౌత్య సంబంధాలకు 50 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ పర్యటన షెడ్యూల్ చేశారు. 2022లో ఇదే మోదీ తొలి విదేశీ పర్యటన. ఈ పర్యటనలో దుబాయ్ ఎక్స్‌పోలో ఆయన పాల్గొననున్నారు.
వాతావరణం, జీవవైవిధ్యం, అంతరిక్షం, పట్టణ, గ్రామీణ అభివృద్ధి, ప్రపంచ లక్ష్యాలు , ఆరోగ్యం, ఆహారం, వ్యవసాయం, జీవనోపాధిపై యూఏఈతో మోదీ చర్చలు జరపాల్సి ఉంది.
ప్రధాని మోదీ ఇంతకుముందు 2015, 2018, 2019లో యూఏఈని సందర్శించారు. ప్రధాని మోదీ యూఏఈ అత్యున్నత పౌర పురస్కారమైన 'ఆర్డర్ ఆఫ్ జాయేద్'ను ఇటీవల స్వీకరించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి మోదీ కృషికి గాను యూఏఈ ప్రభుత్వం ఈ పురస్కారంతో సత్కరించింది. యూఏఈ యువరాజు మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ఈ అవార్డును మోదీకి ప్రదానం చేశారు.
యూఏఈ వ్యవస్థాపకుడు షేక్ జాయేద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ పేరు మీద ఈ పురస్కారాన్ని ఇస్తారు. ఇప్పటి వరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్, క్వీన్ ఎలిజబెత్-2, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సహా మరికొందరు ప్రపంచనేతలకు ఈ అవార్డును ప్రదానం చేశారు. గత ఏప్రిల్‌లో దివంగత అల్ నహ్యాన్ జయంతి సందర్భంగా మోదీకి యూఏఈ సర్కారు ఈ అవార్డును ప్రకటించింది.
భారత్‌తో యూఏఈకిి మంచి వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. భారత్‌కు యూఏఈ అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉంది. ఆ దేశంలో దాదాపు 30 శాతం మంది భారతీయులే ఉన్నారు.
Also Read: Omicron Cases In India: దేశంలో ఒమిక్రాన్ దడ.. 800కు చేరువలో మొత్తం కేసులు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)