Mother Teresa charity: మదర్ థెరిసా మిషనరీస్ అకౌంట్స్ ఫ్రీజ్ పై వివాదం... నిధులు వినియోగించవద్దని మాత్రమే చెప్పామని కేంద్రం స్పష్టం
మదర్ థెరిసా మిషనరీస్ అకౌంట్స్ ఫ్రీజ్ పై కేంద్రం స్పష్టత ఇచ్చింది. నిధులు మాత్రమే వినియోగించవద్దని చెప్పామని పేర్కొంది. హోంశాఖ నిర్ణయంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మదర్ థెరిసా గొప్ప సేవామూర్తి. ఎవరూ సహాయం చేయడానికి ఇష్టపడని వారి కోసం తన జీవితాన్ని అంకితం చేసింది. యూరప్ లో పుట్టినా భారత్ క్రిస్టియన్ మిషనరీస్ ద్వారా ఎంతో మందికి సేవ చేశారు. ఆమె అందించిన సేవలకు నోబెల్ పురస్కారం దక్కింది. ఆమె మరణించిన 19 సంవత్సరాల తరువాత వాటికన్ సెయింట్‌గా ప్రకటించింది. మదర్ థెరిసా సంస్థ మిషనరీస్ ఆఫ్ ఛారిటీ సంస్థ అకౌంట్లను క్రిస్మస్ రోజునే కేంద్ర ప్రభుత్వం ఫ్రీజ్ చేసింది. విదేశాల్లో ఉన్న దాతల నుంచి నిధులను స్వీకరించాలని స్వచ్ఛంద సంస్థ చేసిన అభ్యర్థనను హోంమంత్రిత్వ శాఖ తిరస్కరించింది. ఈ నిధులను ఉపయోగించడానికి లాభాపేక్ష లేని సంస్థలకు ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ (FCRA) కింద క్లియరెన్స్ అవసరం. అయితే కేంద్రం ఈ లైసెన్స్ పునరుద్ధరించాలనే అభ్యర్థనను తిరస్కరించిందని మదర్ థెరిసా స్వచ్ఛంద సంస్థ తెలిపింది.
Also Read: మదర్ థెరిసా సేవా సంస్థ అకౌంట్లు ఫ్రీజ్ చేసిన కేంద్రం... ఆగ్రహం వ్యక్తం చేసిన మమతా బెనర్జీ !
కానీ కేంద్రం మాత్రం మరో కారణం చెబుతోంది. మిషనరీస్ ఆఫ్ ఛారిటీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయలేదని హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న మిషనరీస్ ఖాతాలను స్తంభింపజేయాలని మిషనరీస్ ఆఫ్ ఛారిటీ సంస్థే స్వయంగా ఎస్‌బీఐను అభ్యర్థించిందని అని పేర్కొంది. మిషనరీస్ ఆఫ్ ఛారిటీ FCRA అర్హతను పునరుద్ధరించలేదని తెలిపింది. మిషనరీస్ దరఖాస్తును పరిగణనలోకి తీసుకున్నప్పుడు కొన్ని ప్రతికూల కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఆ ఖాతాల్లోని నిధులను వినియోగించవద్దని మాత్రమే చెప్పామని కేంద్రం వెల్లడించింది. అయితే ఈ వ్యవహారంపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. పేదలకు ఆశ్రయం కల్పించే మిషనరీస్ ఆఫ్ ఛారిటీ బ్యాంక్ ఖాతాలను కేంద్ర ప్రభుత్వం స్తంభింపజేసిందని ట్వీట్ చేశారు.
Also Read: Year Ender 2021: మోదీ షాకిచ్చిన 5 ప్రకటనలు..! సారీతో సంచలనం
క్రిస్మస్ రోజునే ఆ సంస్థకు చెందిన బ్యాంక్ అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేయడం ఇది మానవత్వం కాదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. మిషనరీస్ ఆఫ్ ఛారిటీ కోల్‌కతా ప్రధాన కేంద్రంగా సేవా కార్యక్రమాలు చేపడుతోంది. క్రిస్మస్ పర్వదినం రోజున తమ సంస్థకు చెందిన బ్యాంక్ అకౌంట్లు, నగదు మొత్తం ఫ్రీజ్ చేశారని దీని వల్ల 22 వేల మందికిపైగా రోగులు, ఉద్యోగులు ఇబ్బంది పడ్డారని ఆ సంస్థకు చెందిన కొంత మంది సోషల్ మీడియాలో ట్వీట్స్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Four Day Work Week: 4 రోజులే పని.. పెరగనున్న బేసిక్ పే.. మారనున్న సాలరీ స్ట్రక్చర్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి