అన్వేషించండి

Health Insurance: పాలసీ జారీ చేశాక మెడికల్ క్లెయిమ్‌ను తిరస్కరించడం చట్టవిరుద్ధం: సుప్రీంకోర్టు కీలక తీర్పు

అమెరికాలో వైద్య ఖర్చుల నిమిత్తం క్లెయిమ్ చేయాలని ఓ వినియోగదారుడు చేసిన విజ్ఞప్తిని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తిరస్కరించడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఏదైనా పాలసీ జారీ చేసిన తరువాత ఆ బీమా చేసుకున్న వ్యక్తి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని తెలుపుతూ ఇన్సూరెన్స్ సంస్థ క్లెయిమ్‌ను తిరస్కరించకూడదని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పేర్కొంది. పాలసీ తీసుకున్న సమయంలోనే వినియోగదారుడు తన ఆరోగ్యం వివరాలు సంస్థకు అందించి ఉంటారని, కనుక ప్రస్తుత పరిస్థితిని చూపిస్తూ క్లెయిమ్ తిరస్కరించడం సరికాదని న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. అదే విధంగా పాలసీ తీసుకున్న వ్యక్తికి పూర్తి వివరాలు బీమా సంస్థకు వెల్లడించాల్సిన బాధ్యత ఉందన్నారు. 

బీమాకు సంబంధించిన అన్ని వాస్తవాలు, విషయాలు పాలసీ తీసుకునే వ్యక్తితో పాటు బీమా సంస్థకు తెలుసునని భావిస్తారు. పాలసీదారుడు బీమా సంస్థ తెలిపే అన్ని విషయాలు తెలుసుకున్నాక పాలసీ తీసుకుంటారు. సంస్థ వ్యక్తుల నుంచి వివరాలు సేకరించి పాలసీ జారీ చేయాల్సి ఉంటుంది. బీమా తీసుకున్న వ్యక్తి ప్రస్తుత వైద్య పరిస్థితిని అంచనా వేసిన తర్వాత క్లెయిమ్‌ను తిరస్కరించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. పాలసీ జారీ చేయడానికి ముందు పాలసీదారుడి ఆరోగ్య ప్రస్తుత పరిస్థితిని తమకు తోచిన విధంగా తెలుసుకోవాల్సిన బాధ్యత ఇన్సూరెన్స్ సంస్థదేనని స్పష్టం చేశారు. పాలసీ ప్రతిపాదిత ఫామ్‌లో ఈ విషయం స్పష్టంగా ఉంటుందని.. ఈ కారణంతోనే పాలసీదారుడు వైద్య ఖర్చుల కోసం క్లెయిమ్ చేసి ఉంటారని బెంచ్ ఇటీవల ఇచ్చిన తీర్పులో పేర్కొంది.

Also Read: Coronavirus: కరోనా బారిన పడకుండా ఉండాలంటే వంటల్లో ఉప్పు తగ్గించాల్సిందే

ఓ ఇన్సూరెన్స్ సంస్థ తాను తీసుకున్న చికిత్సకు సంబంధించి ఆస్పత్రి ఖర్చులను క్లెయిమ్ చేశారు. కానీ వినియోగదారుడు నందాకు గతంలోనే హైపర్లిపిడెమియా, డయాబెటిస్ ఉన్నాయని.. పాలసీని తీసుకునే సమయంలో ఆయన ఈ విషయాలు చెప్పలేదంటూ క్లెయిమ్ తిరస్కరించారు. మెడిక్లెయిమ్ పాలసీని కొనుగోలు చేసేటప్పుడు ఫిర్యాదుదారుడు స్టాటిన్ మందులతో బాధపడుతున్నందున, అతను తన ఆరోగ్య పరిస్థితులను పూర్తిగా వెల్లడించడంలో విఫలమయ్యాడని NCDRCనిర్ధారించింది.

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ వినియోగదారుడి మెడికల్ క్లెయిమ్‌ను తిరస్కరించడం చట్టవిరుద్ధమని, పాలసీదారుడు అప్లై చేశాడంటే కచ్చితంగా అతడికి నగదు ఇవ్వాల్సిందేనని సుప్రీం కోర్టు పేర్కొంది. అనుకోని అనారోగ్య సమస్యలు వస్తాయనే మెడిక్లెయిమ్ పాలసీని కొనుగోలు చేస్తారని ఈ విషయం మీకు తెలుసు కదా అని ధర్మాసనం బీమా సంస్థకు సూచించింది. పాలసీ తీసుకున్న వ్యక్తి అనారోగ్యానికి లోనైనప్పుడు ఖర్చులకు సంబంధించిన క్లెయిమ్ తిరస్కకూడదని.. పాలసీ జారీ చేసే సమయంలో అన్నీ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత సంస్థపై ఉంటుందని కోర్టు స్పష్టత ఇచ్చింది.

Health Insurance: పాలసీ జారీ చేశాక మెడికల్ క్లెయిమ్‌ను తిరస్కరించడం చట్టవిరుద్ధం: సుప్రీంకోర్టు కీలక తీర్పు
Also Read: New Study: కోపం, అసహనం పెరిగిపోతోందా? మీరు తినే ఆహారం కూడా వాటికి కారణమే

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget