PM Modi Praises Kamala: 'మీ రాకకై ఇండియా ఎదురుచూస్తోంది..' మోదీ మాటలకు 'కమల' వికాసం
భారత ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను భారత్ రావాలని ఆహ్వానించారు.
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఆమె సాధించిన విజయం ఎందరికో ఆదర్శమన్నారు. కమలా హారిస్ భారత్‌కు రావాలని మోదీ ఆహ్వానించారు.
#WATCH "The people of India are waiting to welcome you. I extend to you an invitation to visit India," PM Modi to US Vice President Kamala Harris, in Washington DC pic.twitter.com/Gtw13sYnZW
— ANI (@ANI) September 23, 2021
అంతకుముందు మాట్లాడిన కమలా హారిస్.. భారత్- అమెరికా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్.. అమెరికాకు ఓ ముఖ్యమైన భాగస్వామి అని అభివర్ణించారు. కరోనాపై పోరులో ఇరు దేశాలు అందిపుచ్చుకున్న సహాయసహకారాలను ప్రస్తావించారు.
" అమెరికాకు భారత్ ఓ ముఖ్యమైన భాగస్వామి. భారత్‌లో కరోనా విజృంభించిన సమయంలో ఆపన్నహస్తం అందించినందుకు అమెరికా గర్వపడుతోంది. వ్యాక్సినేషన్‌లో భారత్ చూపిస్తోన్న చొరవ బాధ్యతాయుతంగా ఉంది. త్వరలోనే వ్యాక్సిన్ ఎగుమతులు పునఃప్రారంభించాలని భారత్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. ప్రస్తుతం రోజుకు దాదాపు కోటి మందికి భారత్ వ్యాక్సిన్ అందించడం నిజంగా ప్రశంసనీయం. "