Kamala Harris Meeting Modi: 'భారత్ ఓ ముఖ్యమైన భాగస్వామి.. అమెరికా గర్వపడుతోంది'
అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో భేటీ అయ్యారు. ఇరు దేశాల సంబంధాలపై కమలా హారిస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అమెరికా పర్యటనలో భాగంగా ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. భారత్.. అమెరికాకు ఓ ముఖ్యమైన భాగస్వామని ఈ సందర్భంగా కమలా తెలిపారు.
#WATCH | "Early in the pandemic, India was vital source of vaccines for other countries. When India experienced surge of COVID in the country, the United States was proud to support India in its need & responsibility to vaccinate its people," says US Vice-President Kamala Harris pic.twitter.com/ekThkFlbTd
— ANI (@ANI) September 23, 2021
సహజమైన భాగస్వాములు..
కరోనా సమయంలో అమెరికా అందించిన సాయానికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కమలా హారిస్‌పై ప్రశంసలు కురిపించారు.
#WATCH Your (Kamala Harris) election as Vice President of USA has been an important & historic event. You're a source of inspiration for many across the world. I'm confident that under Pres Biden & your leadership our bilateral relations will touch new heights: PM Narendra Modi pic.twitter.com/zEVruaiAWc
— ANI (@ANI) September 23, 2021