అగ్ని-5 మిసైల్ టెస్ట్ విజయవంతం, DRDO శాస్త్రవేత్తల్ని అభినందించిన ప్రధాని
Mission Divyastra: అగ్ని -5 మిజైల్ టెస్ట్ విజయవంతంగా పూర్తైందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
PM Modi on Mission Divyastra: ప్రధాని నరేంద్ర మోదీ DRDO శాస్త్రవేత్తలపై ప్రశంసల జల్లు కురిపించారు. పూర్తిగా దేశీయంగా తయారైన అగ్ని - 5 మిసైల్ తొలి పరీక్ష విజయవంతంగా పూర్తైందని వెల్లడించారు. Mission Divyastra లో భాగంగా ఈ క్షిపణిని తయారు చేసింది భారత్. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దీన్ని రూపొందించారు. ఈ మిజైల్ ద్వారా Multiple Independently Targetable Re-entry Vehicle (MIRV) ని శాస్త్రవేత్తలు పరీక్షించారు. చైనాలోని కీలక ప్రాంతాలు అగ్ని-5 రేంజ్‌లోకి వస్తాయని వెల్లడించారు. ఈ టెక్నాలజీతో రకరకాల ప్రాంతాల్లో ఉన్న వార్ హెడ్స్‌ని ఒకేసారి ధ్వంసం చేసేందుకు అవకాశముంటుంది. ఈ టెస్ట్ సక్సెస్ అవడం వల్ల MIRV టెక్నాలజీ సామర్థ్యం ఉన్న దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. ఈ వ్యవస్థలో దేశీయంగా తయారైన Avionics systems తో పాటు సెన్సార్‌లున్నాయి. గురి తప్పకుండా లక్ష్యాలని ఛేదించగలగడం ఇందులోని ప్రత్యేకత. పదేళ్ల క్రితం తయారు చేసిన ఈ మిజైల్‌ని ఇప్పుడు తొలిసారి పరీక్షించారు.
PM Narendra Modi tweets, "Proud of our DRDO scientists for Mission Divyastra, the first flight test of indigenously developed Agni-5 missile with Multiple Independently Targetable Re-entry Vehicle (MIRV) technology." pic.twitter.com/MgqRB7ye09
— ANI (@ANI) March 11, 2024
"మిషన్ దివ్యాస్త్రలో భాగంగా పూర్తిగా దేశీయంగా తయారైన అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఈ ఘనత సాధించిన DRDO శాస్త్రవేత్తలకు నా అభినందనలు. మల్టిపుల్ ఇండిపెండెంట్‌లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికిల్ టెక్నాలజీతో ఈ టెస్ట్‌ని విజయవంతం చేశారు"
- ప్రధాని నరేంద్ర మోదీ