Viral News: ఇలా ఉన్నారేంటి ? - ఆ రైలు నడుపుతోంది వాళ్ల బ్రదర్ అట.. టిక్కెట్ తీసుకోకుండా ఏసీ కోచ్ ఎక్కేశారు! వీడియో
Train Tickets: టిక్కెట్ తీసుకోకుండా రైల్లో ప్రయాణించేవారు విచిత్రమైన కథలు చెబుతున్నారు.తాజాగా ఇద్దరు మహిళలు రైలు లోకోపైలెట్ తన సోదరుడేనని టీటీఈతో వాదనకు దిగారు.

Travel Stories Without Trains: భారతీయ రైల్వేలో టికెట్ లేకుండా ప్రయాణించేవారు చిత్రమైన కథలు చెబుతూ టీటీఈలపై రుబాబు చేస్తున్నారు. తాజాగా మరో వివాదాస్పద ఘటన బయటపడింది. ఒక తల్లి-కూతురు దంపతులు ఫస్ట్ AC కోచ్‌లో టికెట్ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడ్డారు. తన సోదరుడు లోకో పైలట్ అని అందుకే తాము ఉచితంగా ప్రయాణిస్తున్నామని వాదించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తల్లి-కూతురు ఫస్ట్ AC కోచ్‌లోకి ఎక్కి టిక్కెట్ తీసుకున్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. కానీ టికెట్ ఇన్‌స్పెక్టర్లు (TTI) రొటీన్ చెకింగ్ సమయంలో వారిని పట్టుకున్నారు. టికెట్లు లేకపోవడం తెలిసిన వెంటనే, వారు తమ వాదనను ముందుకు పెట్టారు: " సోదరుడు భారతీయ రైల్వేలో లోకో పైలట్‌గా పనిచేస్తున్నాడు. అందుకే మేము ఇక్కడ ప్రయాణిస్తున్నాం" అని యువతి వాదించింది.
My brother is a loco pilot, so I’ll travel in First AC without a ticket.
— Trains of India 🚆🇮🇳 (@trainwalebhaiya) October 11, 2025
Yesterday it was a government school teacher, today it’s the sister of a loco pilot, looks like government employees and their family members believe Indian Railways is their personal property.
First,… pic.twitter.com/xXeZVMARQ2
ఎవరైనా తప్పు చేస్తే, "మా అంకుల్ MLA/MP" అని చెప్పి తప్పించుకోవడం కామన్ గా ఉంటుంది. ఇక్కడ '2.0' వెర్షన్‌గా, రాజకీయుల స్థానంలో రైల్వే లోకో పైలట్ సోదరుడిని ఉపయోగించారు. భారతీయ రైల్వేలో ఉద్యోగుల కుటుంబాలకు కొన్ని రాయితీలు ఉన్నప్పటికీ, ఫస్ట్ ACలో టికెట్ లేకుండా ప్రవేశం చట్టవిరుద్ధం.
రైల్వే అధికారులు ఈ తల్లీకూతుళ్లపై రైల్వే యాక్ట్ సెక్షన్ 138 (టికెట్ లేకుండా ప్రయాణం) కింద కేసు నమోదు చేశారు. వారు చెప్పినట్లుగా నిజంగానే వారి సోదరుడు లోకోపైలెట్ గా ఉన్నారా అని ఆరా తీస్తున్నారు. ఒక వేళ అలాగే చెప్పి అతను రైలు ఎక్కించినట్లయితే అతనిపైనాచర్యలు తీసుకోనున్నారు. ఇటీవల ఓ ఘటన ఇలాగే జరిగింది. ఓ యువతి టిక్కెట్ తీసుకోకుండా .. రుబాబు చేశారు. పైగా బెదిరింపులకు దిగారు.
Two different incidents
— Tathvam-asi (@ssaratht) October 11, 2025
Her brother is a loco pilot so she thinks she can travel without ticket in AC coach
A teacher travelling in AC coach without a ticket is caught
When will this mindset change? Only with strict punishments. pic.twitter.com/eK146HzIAh
భారతదేశంలో రైల్వేల్లో రోజుకు 2.3 కోట్ల మంది ప్రయాణిస్తారు. కానీ టికెట్ లేకుండా ప్రయాణం సాధారణ సమస్యగానే ఉంది. 2024లో 5 లక్షల మందిపై చర్యలు తీసుకున్నారు.





















