Pakistan: ఎలక్ట్రానిక్ మీడియాకు పాకిస్తాన్ కీలక ఆదేశాలు... రాత్రి 9 గంటల బులెటిన్ లో పాక్ మ్యాప్ ప్రసారం తప్పనిసరి
శాటిలైట్ టీవీ ఛానల్స్ కు పాకిస్తాన్ కీలక ఆదేశాలు జారీచేసింది. రాత్రి 9 గంటల న్యూస్ బులెటిన్ కి ముందు 2 సెకన్ల పాటు పాక్ మ్యాప్ ను ప్రసారం చేయాలని ఆదేశించింది.
పాకిస్తాన్ ప్రభుత్వం ఆ దేశ ఎలక్ట్రానిక్ మీడియోకు కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రతి రోజూ రాత్రి 9 గంటల న్యూస్ బులెటిన్‌కు ముందు పాకిస్తాన్ మ్యాప్‌ను ప్రసారం చేయాలని అన్ని టీవీ ఛానెల్‌లను ఆదేశించింది. ఈ మేరకు పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (పెమ్రా) ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని వార్తా ఛానెల్‌లు (ప్రభుత్వ, ప్రైవేట్) రోజూ రాత్రి 09:00 గంటల న్యూస్ బులెటిన్ ప్రసారం చేయడానికి ముందు 2 సెకన్ల పాటు పాకిస్తాన్ పొలిటికల్ మ్యాప్‌ను ప్లాష్ చేయాలని పెమ్రా లేఖ విడుదల చేసింది.
Also read: తొలిసారి కరోనాకు చెక్ పెట్టేందుకు టాబ్లెట్... బ్రిటన్ ఆమోదం
మీడియా హక్కులను అణచివేసేలా ఆదేశాలు
అన్ని శాటిలైట్ టీవీ ఛానల్స్ ఈ సిఫార్సులు పాటించాలని పాక్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ విషయంపై సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సూచనను కూడా లేఖలో పెమ్రా పేర్కొంది. పాకిస్తాన్‌లోని వార్తా ఛానెళ్లను వివిధ ఆర్డర్‌ల ద్వారా అణిచివేసేందుకు పెమ్రా ప్రయత్నించిందని గతంలో ఆరోపణలు వచ్చాయి. నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో గురించి, ప్రభుత్వ పాలనను కించపరిచే ఉద్దేశ్యంతో నిరాధారమైన, ఏకపక్షమైన అభిప్రాయాలను ప్రసారం చేయకూడదని మార్చిలో పాక్ ప్రభుత్వం మీడియాపై ఆంక్షలు విధించింది. డాన్ వార్త పత్రిక కథనాల ప్రకారం... పెమ్రా నిబంధనలకు విరుద్ధంగా కంటెంట్‌ను ప్రసారం చేస్తే PEMRA (సవరణ) చట్టం 2007, పెమ్రా నిబంధనలు ఉల్లంఘించడమేనని పేర్కొంది.
(ANI సౌజన్యంతో ఈ కథనం రాశాము)
Also Read: ఇక భాజపా కథ వేరుంటది.. బంగాల్ రాజకీయంపై నడ్డా కీలక వ్యాఖ్యలు
Also Read: Chennai Flood Alert: జలదిగ్బంధంలో చెన్నై.. విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవు
Also Read: Nadda on BJP: ఇక భాజపా కథ వేరుంటది.. బంగాల్ రాజకీయంపై నడ్డా కీలక వ్యాఖ్యలు
Also Read: Aryan Khan Drugs Case: 'ఆర్యన్ ఖాన్‌ను కిడ్నాప్ చేశారు.. షారుక్ ఇప్పటికైనా నోరు విప్పు'
Also Read: Chennai Rain: భారీ వర్షాలకు చెన్నై గజగజ.. రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎమ్‌డీ
Also Read: Hidden Camera: స్కూల్ బాత్రూంలో సీసీ కెమెరాలు.. షాకైన అధికారులు.. రిజిస్ట్రేషన్ రద్దు!
Also read: వినువీధిలో అద్భుతం, వందేళ్లలో అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం... చూసే అదృష్టం ఈ దేశాల వారిదే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి