Owaisi on PM Modi: మోదీజీ మీకు ఆయనంటే అంత భయమా?: ఒవైసీ
Owaisi on PM Modi: ఐరాస మానవ హక్కుల మండలిలో చైనాకు సంబంధించిన తీర్మానంపై జరిగిన ఓటింగ్‌కు భారత్ గైర్హాజరవటంపై ఒవైసీ అసహనం వ్యక్తం చేశారు. మోదీపై విమర్శలు చేశారు.
Owaisi on PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు చేశారు. చైనాకు సంబంధించిన ఓ అంశంపై ఐరాస మానవ హక్కుల మండలి ((UNHRC)లో ఓటు వేయకుండా భారత్ ఎందుకు దూరంగా ఉందో చెప్పాలని మోదీని ఒవైసీ డిమాండ్ చేశారు.
అంత భయమా?
చైనాలోని జింజియాంగ్ ప్రాంతంలో వీఘర్ ముస్లింలపై మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని ఆరోపణలు ఉన్నాయి. వీటిపై చర్చించాలని కోరుతూ ప్రతిపాదించిన ముసాయిదా తీర్మానంపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో ఓటు వేయకుండా భారత్ గైర్హాజరయింది. దీంతో ఒవైసీ.. మోదీని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ఈ తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో భారత్ ఎందుకు పాల్గొనలేదో చెప్పాలని ఓవైసీ ప్రశ్నించారు.
Will the PM Modi saheb explain the reason for India’s decision to help China out in the UNHRC on the Uighur issue by choosing to abstain from an important vote? Is he so scared of offending Xi Jingping, whom he met 18 times, that India can’t speak for what is right? https://t.co/TJNy3Ffn2w
— Asaduddin Owaisi (@asadowaisi) October 7, 2022
వీగిపోయిన తీర్మానం
చైనాలోని జింజియాంగ్‌లో వీఘర్ ముస్లింలపై మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని, వీటిపై చర్చించాలని ప్రతిపాదించిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి తిరస్కరించింది. భారత్, మలేసియా, ఉక్రెయిన్ సహా 11 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి.
19 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. ఈ తీర్మానాన్ని కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్‌లాండ్, నార్వే, స్వీడన్, బ్రిటన్, అమెరికా ప్రతిపాదించాయి. టర్కీ వంటి దేశాలు బలపరిచాయి. ఫ్రాన్స్, జపాన్, జర్మనీ, నెదర్లాండ్స్ ఈ తీర్మానానికి మద్దతిచ్చాయి. మొత్తం మీద చైనాకు అనుకూల పరిస్థితి ఏర్పడింది.
Also Read: Nobel Peace Prize 2022: నోబెల్ శాంతి పురస్కారం ఎవరికి దక్కిందంటే?
Also Read: Chief Justice UU Lalit: తదుపరి సీజేఐ ఎంపిక ప్రక్రియ షురూ- జస్టిస్ చంద్రచూడ్‌కు ఛాన్స్!