News
News
X

North Korea Missile Test: కిమ్ దూకుడు.. బైడెన్ సైలెంట్.. మరో క్షిపణి ప్రయోగం విజయవంతం!

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి క్షిపణి ప్రయోగాలు మొదలుపెట్టారు. లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా ఉత్తరకొరియా నిర్వహించింది.

FOLLOW US: 

కిమ్ జోంగ్ ఉన్.. మరోసారి ప్రపంచాన్ని భయపెడుతున్నారు. ఇన్నాళ్లు కాస్త సైలెంట్ గా ఉన్న కిమ్.. మరోసారి అణుకార్యకలాపాలను మొదలుపెట్టారు. తాజాగా లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణిని ఉత్తర కొరియా పరీక్షించింది. ఇది 1,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలదు.

ఈ ప్రయోగానికి కిమ్‌ హాజరు కాలేదు. ఈ పరీక్షను జాగ్రత్తగా పరిశీలించి అమెరికా ఇంటెలిజెన్స్‌ సంస్థలతో కలిసి విశ్లేషిస్తామని దక్షిణ కొరియా ప్రతినిధులు తెలిపారు. 

మిత్రదేశాలకు ముప్పు..

ఈ ప్రయోగాలపై అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ స్పందించింది. ఇలాంటి శక్తిమంతమైన ఆయుధాలు ఉత్తర కొరియా చేతిలో ఉండటం అమెరికా సహా మిత్రదేశాలకు ప్రమాదకరమని పేర్కొంది. ఈ క్షిపణి పరీక్షలను నిశితంగా గమనిస్తున్నామని ఎప్పటికప్పుడు తమ మిత్ర దేశాలతో మాట్లాడుతున్నట్లు అమెరికా పేర్కొంది.

" ఇలాంటి సైనిక కార్యకలాపాలు, క్షిపణి పరీక్షల వల్ల సరిహద్దు దేశాలు సహా అమెరికా మిత్రదేశాలకు పెనుముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఇది అంతర్జాతీయ సమాజానికే ప్రమాదం.                                       "
- అమెరికా ఇండో-పసిఫిక్ కమాండ్

ప్రస్తుతం ఉత్తర కొరియాపై అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలపై అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నాయి. అయినప్పిటికీ ఉత్తర కొరియా ప్రయోగాలను ఆపడం లేదు. అయితే క్రూయిజ్ క్షిపణి ప్రయోగాలపై బ్యాన్ లేనప్పటికీ ఈ తరహా కార్యకలాపాలు ప్రమాదకరమని అమెరికా అంటోంది.

బైడెన్ ఏం చేస్తారు?

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఉన్న సమయంలో కిమ్ తో పలుమార్లు అణ్వస్త్రాల నిరాయుధీకరణపై చర్చలు జరిపారు. ఆ సమయంలో కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించిన కిమ్.. బైడెన్ రాకతో దూకుడు పెంచారు. బైడెన్ సర్కార్ మాత్రం.. ఉత్తర కొరియాతో అణు చర్చలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరి ప్రస్తుత పరిస్థితుల్లో బైడెన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ఇప్పటికే అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ విషయంలో బైడెన్ పై ప్రపంచదేశాలు ఆరోపణలు చేస్తున్నాయి. అఫ్గాన్ సంక్షోభానికి బైడెన్ నిర్ణయమే కారణమని విమర్శిస్తున్నాయి. మరి తాజాగా ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలతో బైడెన్ పై మరింత ఒత్తిడి పెరిగినట్లే కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.

Also Read: Pegasus Supreme Court : పెగాసస్‌పై వివరాలు చెప్పట్లేదు.. మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు !

Published at : 13 Sep 2021 06:12 PM (IST) Tags: America US North Korea North Korea Missile Test

సంబంధిత కథనాలు

Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, దర్శనానికి 40 గంటలు పైనే!

Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, దర్శనానికి 40 గంటలు పైనే!

Minister Srinivas Goud : విపక్షాలు కక్కుర్తి రాజకీయాలు చేస్తున్నాయి, రాజీనామాపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్

Minister  Srinivas Goud : విపక్షాలు కక్కుర్తి రాజకీయాలు చేస్తున్నాయి, రాజీనామాపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్

Independence Day 2022: ప్రధాని మోదీ ఏ ప్రకటనలు చేస్తారో? స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై అంచనాలు

Independence Day 2022: ప్రధాని మోదీ ఏ ప్రకటనలు చేస్తారో? స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై అంచనాలు

Independence Day 2022: పంద్రాగస్టు వేడుకల కోసం దేశ రాజధాని ముస్తాబు, సీఎం ట్వీట్! 

Independence Day 2022: పంద్రాగస్టు వేడుకల కోసం దేశ రాజధాని ముస్తాబు, సీఎం ట్వీట్! 

UK Next PM: బ్రిటన్ ప్రధాని రేసులో లీడ్‌లో లిజ్ ట్రస్, రిషి సునక్‌పై వ్యతిరేకత ఉందా?

UK Next PM: బ్రిటన్ ప్రధాని రేసులో లీడ్‌లో లిజ్ ట్రస్, రిషి సునక్‌పై వ్యతిరేకత ఉందా?

టాప్ స్టోరీస్

Realme Cheapest 5G Phone: రూ.10 వేలలోపే 5జీ ఫోన్ - రియల్‌మీ మాస్టర్ ప్లాన్!

Realme Cheapest 5G Phone: రూ.10 వేలలోపే 5జీ ఫోన్ - రియల్‌మీ మాస్టర్ ప్లాన్!

Ola Electric Car: సింగిల్ చార్జ్‌తో హైదరాబాద్ టు తిరుపతి - ఓలా ఎలక్ట్రిక్ కార్‌తో మామూలుగా ఉండదు!

Ola Electric Car: సింగిల్ చార్జ్‌తో హైదరాబాద్ టు తిరుపతి - ఓలా ఎలక్ట్రిక్ కార్‌తో మామూలుగా ఉండదు!

Vijayawada TDP MP : బెజవాడ బరిలో నిలిచేదెవరు? టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కొత్త పేరు!

Vijayawada TDP MP : బెజవాడ బరిలో నిలిచేదెవరు? టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కొత్త పేరు!

Vijayawada News : విజయవాడలో స్వాతంత్ర్య వేడుకలు, ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు

Vijayawada News : విజయవాడలో స్వాతంత్ర్య వేడుకలు, ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు