Pegasus Supreme Court : పెగాసస్‌పై వివరాలు చెప్పట్లేదు.. మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు !
పెగాసస్ నిఘా అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయడానికి కేంద్రం ఆసక్తి కనబరచలేదు. దీంతో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
దేశంలో పెగాసస్ సాఫ్ట్‌వేర్‌తో ప్రముఖులపై నిఘా పెట్టిన అంశంపై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసేందుకు నిరాసక్తత ప్రదర్శించడంతో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఆ మధ్యంతర ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. రెండు మూడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని ఒకే వేళ కేంద్ర ప్రభుత్వానికి అఫిడవిట్ దాఖలు చేసే విషయంలో పునరాలోచన ఉంటే చెప్పవచ్చని సీజేఐ ఎన్వీ రమణ సొలిసిటర్ జనరల్ కు తెలిపారు. Also Read : కొబ్బరికాయ కావాలా నాయనా? ధర రూ.6.5 లక్షలు మాత్రమే!
పెగాసస్‌తో నిఘా పెట్టిన వ్యవహారంపై విచారణ చేయించాలని సుప్రీంకోర్టులో ప్రముఖ జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై గతంలో సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఆ సమయంలో అఫిడవిట్ దాఖలు చేసేందుకు సుప్రీంకోర్టు కేంద్రానికి గడువు ఇచ్చింది. పెగాసస్ నిఘా అంశంపై నిపుణుల కమిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. దేశ భద్రత అంశాలు చర్చించడం మంచిది కాదని కేంద్రం అభిప్రాయపడింది. ఈ అంశంపై స్వతంత్ర కమిటీ అన్నీ పరిశీలించి నివేదిస్తుందని కేంద్రం తరపున వాదించిన సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. Also Read : అనుకున్నంతలోనే సీఎంల మార్పు ! బీజేపీలో మోడీ,షాల పట్టుకు నిదర్శనమా..?
అయితే దేశ భద్రత అంశంలోకి వెళ్లడంలేదని జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు వారి హక్కుల రక్షణకై దాఖలు చేసిన పిటిషన్లపై మాత్రమే విచారణ జరుపుతున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది. వీరిపై ప్రభుత్వం ఏమైనా స్పైవేర్ నిఘాను ఉపయోగించిందా? అని సీజేఐ ఎన్వీ రమణ ప్రశ్నించారు. సొలిసిటర్ జనరల్ పూర్తి స్థాయి వివరాలు చెప్పకపోవడంతో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తే ప్రభుత్వ విధానం ఏమిటో తెలుస్తుందన్నారు. కేంద్ర మాజీమంత్రి రవిశంకర్‌ప్రసాద్ 2019లో పెగాసస్‌పై చేసిన ప్రకటనను ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ సొలిసిటర్ జనరల్ దృష్టికి తీసుకెల్లారు. కేంద్రానికి ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చామని .. అయినా కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసేందుకు సుముఖంగా లేనట్లు కనిపిస్తోందని సీజేఐ ఎన్వీరమణ అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని నిర్ణయించామని ప్రకటించారు. Also Read : ఎలన్ మస్క్‌కు షాకిచ్చిన కేంద్రం
సుప్రీంకోర్టు ఇచ్చే మధ్యంతర ఉత్తర్వులు ఎలా ఉంటాయన్న చర్చ ప్రారంభమయింది. పెగాసస్ సాఫ్ట్‌వేర్‌తో రాహుల్ గాందీ సహా సుప్రీంకోర్టు న్యాయమూర్తులపైనా నిఘా పెట్టారని పలు వార్తలు బయటకు వచ్చాయి. అదే సమయంలో గతంలో కేంద్రం ఈ సాఫ్ట్‌వేర్ గురించి ప్రస్తావించింది. కానీ ఇప్పుడు మాత్రం అవి ఉపయోగించామా లేదా అన్నవాటిని చెప్పడం లేదు. కానీ దేశభద్రత అంశాన్ని తెరపైకి తెస్తోంది. ప్రతిపక్ష నేతలు మాత్రం ప్రముఖ వ్యక్తులపై నిఘా పెట్టి దేశద్రోహానికి కేంద్రం పాల్పడిందని ఆరోపిస్తున్నాయి. Also Read : కోర్టుల్లో పోర్టుల అమ్మకం డీల్స్ ! అదానీకి చిక్కులు తప్పవా ?