Gangavaram Port : కోర్టుల్లో పోర్టుల అమ్మకం డీల్స్ ! అదానీకి చిక్కులు తప్పవా ?
గంగవరం, కృష్ణపట్నం పోర్టులను అదానీ సంస్థ కొనుగోలు చేయడం న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం నిబంధనలు పాటించడం లేదని కోర్టుల్లో పిటిషన్లు దాఖలవుతూండటమే దీనికి కారణం.
గంగవరం పోర్టు అంశం న్యాయపరిధిలోకి చేరే అవకాశం కనిపిస్తోంది. అసలు నిబంధనలు పట్టించుకోకుండా అమ్మేశారని దీనిపై సమగ్ర విచారణ కోసం సత్యభూపాల్‌రెడ్డి, పూర్ణచంద్రారెడ్డి అనే వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశం అవుతోంది. మొత్తం వ్యవహారంలో ప్రొప్రయిటీ ఆడిట్ కూడా నిర్వహించేలా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌ను ఆదేశించాలని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. వాటాల విక్రయం అంశాన్ని ప్రభుత్వం సీక్రెట్‌గా ఉంచిందని ... అంతర్జాతీయ స్థాయిలో బిడ్లు ఆహ్వానించి ఉంటే ప్రభుత్వానికి మరింత లాభం వచ్చి ఉండేదని వారు చెబుతున్నారు. Also Read : గంగవరం పోర్టు అమ్మకంలో స్కాం జరిగిందా..?
అనూహ్యంగా లబ్దితారులు అంటే అదానీ సంస్థను ప్రతివాదాలుగా చేర్చాలని ప్రభుత్వ తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదించారు. వారిని ప్రతివాదులుగా చేయాల్సిన అవసరం ఉందని అడ్వకేట్ జనరల్ స్పష్టం చేశారు. అంతే కాదు అధికారుల నివేదిక ఆధారంగానే ప్రభుత్వం వాటాలను ఉపసంహరించుకుని తెలిపారు. అయితే ఇంకా గడువు ఇస్తే వివరాలు సమర్పిస్తామని చెప్పడంతో తదుపరి విచారణను ఇరవయ్యో తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఇదే పిల్‌లో కృష్ణపట్నం పోర్టు అమ్మకంపై కూడా ఆరోపణలు చేశారు. ఆ పోర్టును కూడా అదానీ సంస్థనే కొనుగోలు చేసింది. Also Read : టీడీపీలో సీనియర్ల అసంతృప్తికి కారణం ఏమిటి..?
గంగవరం పోర్టులో ప్రభుత్వానికి ఉన్న 10.4 శాతం వాటాఉంది. ఈ విషయాన్ని బాంబే స్టాక్ ఎక్సేంజ్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లకు అదానీ గ్రూప్ అధికారికంగా తెలియచేసిన తర్వాతనే బయట ప్రపంచానికి తెలిసింది. ఇంతకు ముందు అదానీ పోర్ట్స్ ఏపీ ప్రభుత్వ వద్ద ఉన్న 10.4శాతం వాటా మినహా మిగతా ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉన్నవాటాలను కొనుగోలు చేసింది. ప్రభుత్వం కూడా తన వాటాలు ఇచ్చేయడంతో వందశాతం అదానీ పోర్టుగా గంగవరం పోర్టు మారిపోయింది. ఇదంతా పెద్ద స్కాం అని ఆంధ్రప్రదేశ్ విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. రక్షణ పరంగా అత్యంత కీలకమైనదని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం సరి కాదని కొంత మంది నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. Also Read : జగనన్న ల్యాప్ ట్యాప్ కావాలా..?
గంగవరం పోర్టు సామర్థ్యం 64 మిలియన్ మెట్రిక్ టన్నులు. 2019-20లో 34.5 ఎంఎంటీ కార్గోను పోర్టు హ్యాండిల్ చేసింది. 2 లక్షల డీడబ్ల్యూటీ సామర్థ్యం కలిగిన నౌకలు సైతం పోర్టులో రాకపోకలు సాగించే వీలుంది. 9 బెర్తులతో కార్యకలాపాలు సాగిస్తోంది. కోల్, ముడిఇనుము, ఎరువులు, లైమ్‌స్టోన్, స్టీల్ తదితర పలు కమోడిటీలను హ్యాండిల్ చేయగల సౌకర్యాలను కలిగి ఉంది. గతేడాది గంగవరం పోర్ట్ రూ. 1082 కోట్ల ఆదాయాన్ని సాధించింది. రూ. 516 కోట్ల నికర లాభం ఆర్జించింది. పోర్ట్ కు ఎలాంటి రుణాలు లేవు. అంతే కాదు రూ. 500 కోట్ల నగదు నిల్వలు కలిగి బలమైన ఆర్థిక స్థితిలో ఉంది. అయినా కంపెనీలో 10.4 శాతం వాటాను తక్కువకే అమ్మడంపై ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి.